ప్రభన్యూస్

WhatsApp Web: ల్యాప్‌టాప్‌లలో వాట్సప్ వెబ్ వాడుతున్నారా? ఇలా చేయకపోతే హ్యాక్ అయ్యే ప్రమాదం! | బిజినెస్


Last Updated:

WhatsApp Web: ఆఫీసు పనుల కోసం లేదా వ్యక్తిగత అవసరాల కోసం డెస్క్‌టాప్‌లు, ల్యాప్‌టాప్‌లలో ‘వాట్సప్ వెబ్’ (WhatsApp Web) వినియోగించే వారికి కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ముఖ్యంగా పబ్లిక్ కంప్యూటర్లు, ఆఫీసు సిస్టమ్‌లలో వాట్సప్ వెబ్ సెషన్‌ను లాగౌట్ చేయకుండా వదిలేయడం వల్ల తీవ్రమైన సైబర్ ముప్పు పొంచి ఉందని స్పష్టం చేసింది. కేంద్ర హోంశాఖ పరిధిలో సైబర్ నేరాల కట్టడి కోసం పనిచేస్తున్న ‘భారత సైబర్ నేరాల సమన్వయ కేంద్రం (I4C)’కు చెందిన ‘ది నేషనల్ సైబర్ క్రైమ్ థ్రెట్ అనలిటిక్స్ యూనిట్ (NCTAU)’ ఈ మేరకు ఒక ప్రత్యేక అడ్వైజరీని విడుదల చేసింది. వినియోగదారులు తమ సెషన్‌ను లాగ్ ఇన్‌లోనే వదిలేస్తే, సైబర్ నేరగాళ్లు ఆ ఖాతాలను సులభంగా హైజాక్ చేసే అవకాశం ఉందని పేర్కొంది. దీనివల్ల వ్యక్తిగత మరియు ప్రైవేట్ సంభాషణలను ఇతరులు చదవడం, మీ ఖాతా నుండి మీకు తెలియకుండానే ఇతరులకు సందేశాలు పంపడం లేదా ఆర్థిక మోసాలకు పాల్పడటం వంటి ప్రమాదాలు జరుగుతాయని హెచ్చరించింది.

బ్రౌజర్ క్లోజ్ చేస్తే సరిపోదు!

చాలామంది వినియోగదారులు వాట్సప్ వెబ్ వాడిన తర్వాత కేవలం బ్రౌజర్ విండో లేదా ట్యాబ్‌ను క్లోజ్ చేసి తమ పని పూర్తయిందని భావిస్తుంటారు. అయితే, అలా చేయడం వల్ల వాట్సప్ వెబ్ సెషన్ ముగియదని, అది బ్యాక్‌గ్రౌండ్‌లో యాక్టివ్‌గానే ఉంటుందని NCTAU స్పష్టం చేసింది. తర్వాత ఆ కంప్యూటర్‌ను ఉపయోగించే వ్యక్తులు నేరుగా మీ వాట్సప్ ఖాతాను యాక్సెస్ చేసే వీలుంటుంది. కాబట్టి, ప్రతి సెషన్ పూర్తయిన వెంటనే వాట్సప్ మెనూలోకి వెళ్లి కచ్చితంగా మాన్యువల్‌గా ‘లాగౌట్’ (Logout) చేయాల్సిందేనని అధికారులు తేల్చి చెప్పారు.

పాటించాల్సిన కీలక జాగ్రత్తలు

సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండేందుకు వినియోగదారులు కింది జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని కేంద్రం సూచించింది. ఆఫీసు కంప్యూటర్లు, ఇంటర్నెట్ కేఫ్‌లు, లేదా ఇతరులతో పంచుకునే సిస్టమ్‌లలో వాట్సప్ వెబ్ వాడిన ప్రతిసారీ మాన్యువల్‌గా లాగౌట్ చేయాలి. పబ్లిక్ లేదా షేర్డ్ కంప్యూటర్ల ద్వారా వాట్సప్ వెబ్ ఉపయోగిస్తున్నప్పుడు బ్యాంక్ వివరాలు, పాస్‌వర్డ్‌లు లేదా ఇతర సున్నితమైన (సెన్సిటివ్) సమాచారాన్ని పంచుకోకపోవడమే ఉత్తమం. మీ మొబైల్ ఫోన్‌లోని వాట్సప్ యాప్‌లో ‘Linked Devices’ ఆప్షన్‌ను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ, తెలియని లేదా పాత సెషన్లను వెంటనే తొలగించాలి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 24 November 2026, 5:43 am Digital Edition : Prabhanews
WhatsApp Web: ల్యాప్‌టాప్‌లలో వాట్సప్ వెబ్ వాడుతున్నారా? ఇలా చేయకపోతే హ్యాక్ అయ్యే ప్రమాదం! | బిజినెస్

Last Updated:Nov 24, 2026 5:38 AM ISTWhatsApp Web: ఆఫీసు పనుల కోసం లేదా వ్యక్తిగత అవసరాల కోసం డెస్క్‌టాప్‌లు, ల్యాప్‌టాప్‌లలో 'వాట్సప్ వెబ్' (WhatsApp Web) వినియోగించే వారికి కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది.ప్రతీకాత్మక చిత్రంముఖ్యంగా పబ్లిక్ కంప్యూటర్లు, ఆఫీసు సిస్టమ్‌లలో వాట్సప్ వెబ్ సెషన్‌ను లాగౌట్ చేయకుండా వదిలేయడం వల్ల తీవ్రమైన సైబర్ ముప్పు పొంచి ఉందని స్పష్టం చేసింది. కేంద్ర హోంశాఖ పరిధిలో సైబర్ నేరాల కట్టడి కోసం పనిచేస్తున్న 'భారత సైబర్ నేరాల సమన్వయ కేంద్రం (I4C)'కు చెందిన 'ది నేషనల్ సైబర్ క్రైమ్ థ్రెట్ అనలిటిక్స్ యూనిట్ (NCTAU)' ఈ మేరకు ఒక ప్రత్యేక అడ్వైజరీని విడుదల చేసింది. వినియోగదారులు తమ సెషన్‌ను లాగ్ ఇన్‌లోనే వదిలేస్తే, సైబర్ నేరగాళ్లు ఆ ఖాతాలను సులభంగా హైజాక్ చేసే అవకాశం ఉందని పేర్కొంది. దీనివల్ల వ్యక్తిగత మరియు ప్రైవేట్ సంభాషణలను ఇతరులు చదవడం, మీ ఖాతా నుండి మీకు తెలియకుండానే ఇతరులకు సందేశాలు పంపడం లేదా ఆర్థిక మోసాలకు పాల్పడటం వంటి ప్రమాదాలు జరుగుతాయని హెచ్చరించింది.బ్రౌజర్ క్లోజ్ చేస్తే సరిపోదు!చాలామంది వినియోగదారులు వాట్సప్ వెబ్ వాడిన తర్వాత కేవలం బ్రౌజర్ విండో లేదా ట్యాబ్‌ను క్లోజ్ చేసి తమ పని పూర్తయిందని భావిస్తుంటారు. అయితే, అలా చేయడం వల్ల వాట్సప్ వెబ్ సెషన్ ముగియదని, అది బ్యాక్‌గ్రౌండ్‌లో యాక్టివ్‌గానే ఉంటుందని NCTAU స్పష్టం చేసింది. తర్వాత ఆ కంప్యూటర్‌ను ఉపయోగించే వ్యక్తులు నేరుగా మీ వాట్సప్ ఖాతాను యాక్సెస్ చేసే వీలుంటుంది. కాబట్టి, ప్రతి సెషన్ పూర్తయిన వెంటనే వాట్సప్ మెనూలోకి వెళ్లి కచ్చితంగా మాన్యువల్‌గా 'లాగౌట్' (Logout) చేయాల్సిందేనని అధికారులు తేల్చి చెప్పారు.పాటించాల్సిన కీలక జాగ్రత్తలుసైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండేందుకు వినియోగదారులు కింది జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని కేంద్రం సూచించింది. ఆఫీసు కంప్యూటర్లు, ఇంటర్నెట్ కేఫ్‌లు, లేదా ఇతరులతో పంచుకునే సిస్టమ్‌లలో వాట్సప్ వెబ్ వాడిన ప్రతిసారీ మాన్యువల్‌గా లాగౌట్ చేయాలి. పబ్లిక్ లేదా షేర్డ్ కంప్యూటర్ల ద్వారా వాట్సప్ వెబ్ ఉపయోగిస్తున్నప్పుడు బ్యాంక్ వివరాలు, పాస్‌వర్డ్‌లు లేదా ఇతర సున్నితమైన (సెన్సిటివ్) సమాచారాన్ని పంచుకోకపోవడమే ఉత్తమం. మీ మొబైల్ ఫోన్‌లోని వాట్సప్ యాప్‌లో 'Linked Devices' ఆప్షన్‌ను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ, తెలియని లేదా పాత సెషన్లను వెంటనే తొలగించాలి.మరింత చదవండి

Source link