ప్రభన్యూస్

Agniveer Marriage Rules: అగ్నివీరులకు కేంద్రం బంపర్ ఆఫర్.. నాలుగేళ్ల తర్వాత పెళ్లికి అనుమతి.. కొత్త రూల్స్ ఇవే! |


Last Updated:

Agniveer Marriage Rules: అగ్నిపథ్ పథకం కింద సైన్యంలో చేరిన యువతకు కేంద్ర ప్రభుత్వం కీలక వెసులుబాటు కల్పించింది. ఇప్పటివరకు నాలుగేళ్ల సర్వీసు పూర్తయ్యే వరకు పెళ్లి చేసుకోవడానికి అనుమతి ఉండేది కాదు. అయితే రెండేళ్ల అదనపు సర్వీసును ఎంచుకునే అగ్నివీరులకు ఈ విషయంలో మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

అగ్నిపథ్ పథకం కింద సైన్యంలో చేరిన అగ్నివీర్లకు కేంద్ర ప్రభుత్వం కీలక వెసులుబాటు కల్పించింది. ఇప్పటివరకు నాలుగేళ్ల సర్వీసు సమయంలో పెళ్లి చేసుకోవడానికి అనుమతి లేకపోగా, ఇకపై రెండేళ్ల సర్వీస్ పొడిగింపును ఎంచుకునే వారికి వివాహం చేసుకునే అవకాశం కల్పించనుంది. అయితే దీనికి కొన్ని నిబంధనలు వర్తిస్తాయి. రెండేళ్ల పొడిగింపు కోసం ఎంపికైన అగ్నివీర్లు రెండో విడత విధుల్లో చేరిన తర్వాత ప్రత్యేక శిక్షణను విజయవంతంగా పూర్తి చేయాలి. ఆ తర్వాతే పెళ్లి చేసుకోవడానికి అనుమతి ఉంటుంది. ఇప్పటికే అగ్నివీర్లుగా పనిచేస్తున్న వారికి ఈ విషయంపై సమాచారం అందినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

2022లో కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని ప్రారంభించింది. ఈ విధానం ద్వారా సైన్యం, నేవీ, వైమానిక దళాల్లో యువతను నాలుగేళ్ల కాలానికి నియమిస్తున్నారు. ఈ పథకం కింద చేరే అభ్యర్థులు నియామకం సమయంలో తప్పనిసరిగా అవివాహితులై ఉండాలి. అంతేకాకుండా నాలుగేళ్ల సర్వీసు పూర్తయ్యే వరకు పెళ్లి చేసుకోవడానికి అనుమతి ఉండదు. రెండేళ్ల సర్వీస్ పొడిగింపును ఎంచుకునే సమయంలో కూడా అగ్నివీర్లు అవివాహితులుగానే కొనసాగాలనే నిబంధన ఉంది. అయితే తాజాగా తీసుకున్న నిర్ణయంతో రెండో విడత సర్వీసులోకి ప్రవేశించిన తర్వాత ఈ నిబంధనలో మార్పు రానుంది.

రెండేళ్ల పొడిగింపును ఎంచుకున్న అగ్నివీర్లు మొదట కొంత విరామం తీసుకున్న తర్వాత తిరిగి విధుల్లో చేరాల్సి ఉంటుంది. ఈ సమయంలో దాదాపు నాలుగు వారాల పాటు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. రెండో విడత విధుల కోసం అవసరమైన శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన వెంటనే వారు వివాహం చేసుకోవచ్చు. అంటే రెండో విడత సర్వీసులో చేరే ముందు లేదా శిక్షణ సమయంలో కాకుండా, శిక్షణ పూర్తయిన తర్వాతే పెళ్లికి అనుమతి లభిస్తుంది. ఈ మార్పు వల్ల యువ అగ్నివీరులకు వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొంత వెసులుబాటు లభించనుంది.

ఇప్పటికే భారత నావికాదళంలో అగ్నివీర్ల మొదటి బ్యాచ్ తమ నాలుగేళ్ల సర్వీసును పూర్తి చేసుకుంది. వీరిలో మెరిట్ ఆధారంగా 25 శాతం మందికి శాశ్వత ఉద్యోగాల్లో చేరే అవకాశం కల్పించారు. మిగిలిన అర్హులైన అభ్యర్థులకు మరో రెండేళ్లు సర్వీసు కొనసాగించే అవకాశం ఇచ్చారు. భారత సైన్యం, వైమానిక దళాల్లో చేరిన మొదటి బ్యాచ్‌లు కూడా వచ్చే నెలలో తమ నాలుగేళ్ల సర్వీసును పూర్తి చేసుకోనున్నాయి. దీంతో ఈ కొత్త నిబంధన మరింత మంది అగ్నివీరులకు ఉపయోగపడనుంది.

అగ్నివీర్లకు రెండేళ్ల అదనపు సర్వీసు అవకాశం కల్పించే ‘సెకండ్ టూర్ ఆఫ్ డ్యూటీ’ (TOD) ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం నవంబర్ 4న ఆమోదం తెలిపింది. శిక్షణ పొందిన యువ సిబ్బందిని మరికొంత కాలం సైన్యంలో కొనసాగించడం ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశం. నాలుగేళ్ల సర్వీసు పూర్తయ్యాక బయటకు వెళ్లే మిగిలిన 75 శాతం అగ్నివీరులకు కూడా మొత్తం ఆరేళ్ల అనుభవం తర్వాత సాధారణ సైనిక నియామకాలకు మరో అవకాశం కల్పించాలనే లక్ష్యం ఉంది. అయితే శాశ్వత నియామకానికి ఎంపికయ్యే వారి సంఖ్య, అర్హతలు సంబంధిత నిబంధనల ప్రకారమే ఉంటాయి.

ఇవి కూడా చదవండి: India AC Demand: ఇక ప్రతి ఇంట్లో ఏసీ ఉండాల్సిందే.. భారత్‌లో రాబోయే పదేళ్లలో భారీ మార్పు!

ఈ సందర్భంగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ ఎన్.ఎస్. రాజా సుబ్రమణి అగ్నిపథ్ పథకంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అగ్నిపథ్ విధానం ఒకేలా కొనసాగిపోయే పథకం కాదని, అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసుకుంటూ ముందుకు సాగుతుందని తెలిపారు. సైనిక దళాల అవసరాలు, యువతకు ఎదురయ్యే సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు మార్పులు చేయనున్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు.

అగ్నిపథ్ పథకం కింద సాధారణంగా 17.5 నుంచి 21 ఏళ్ల మధ్య వయసున్న యువత నియామకానికి ఎంపికవుతున్నారు. వీరిలో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల నుంచి వస్తున్నారు. నాలుగేళ్ల సర్వీసు పూర్తయ్యే సమయానికి వీరి వయసు 21 నుంచి 25 ఏళ్ల మధ్య ఉంటుంది. రెండేళ్ల పొడిగింపుతో 23 నుంచి 27 ఏళ్ల వయసులోకి చేరుకుంటారు. ఈ వయసులో చాలామంది పెళ్లి, కుటుంబ బాధ్యతల గురించి ఆలోచించడం సహజం. ఇలాంటి పరిస్థితుల్లో రెండో విడత సర్వీసులో పెళ్లికి అనుమతి ఇవ్వడం ద్వారా అగ్నివీరుల వ్యక్తిగత, సామాజిక అవసరాలను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకున్నట్లు భావించవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 22 November 2026, 2:29 pm Digital Edition : Prabhanews
Agniveer Marriage Rules: అగ్నివీరులకు కేంద్రం బంపర్ ఆఫర్.. నాలుగేళ్ల తర్వాత పెళ్లికి అనుమతి.. కొత్త రూల్స్ ఇవే! |

Last Updated:Nov 22, 2026 2:21 PM ISTAgniveer Marriage Rules: అగ్నిపథ్ పథకం కింద సైన్యంలో చేరిన యువతకు కేంద్ర ప్రభుత్వం కీలక వెసులుబాటు కల్పించింది. ఇప్పటివరకు నాలుగేళ్ల సర్వీసు పూర్తయ్యే వరకు పెళ్లి చేసుకోవడానికి అనుమతి ఉండేది కాదు. అయితే రెండేళ్ల అదనపు సర్వీసును ఎంచుకునే అగ్నివీరులకు ఈ విషయంలో మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించింది.
ప్రతీకాత్మక చిత్రంఅగ్నిపథ్ పథకం కింద సైన్యంలో చేరిన అగ్నివీర్లకు కేంద్ర ప్రభుత్వం కీలక వెసులుబాటు కల్పించింది. ఇప్పటివరకు నాలుగేళ్ల సర్వీసు సమయంలో పెళ్లి చేసుకోవడానికి అనుమతి లేకపోగా, ఇకపై రెండేళ్ల సర్వీస్ పొడిగింపును ఎంచుకునే వారికి వివాహం చేసుకునే అవకాశం కల్పించనుంది. అయితే దీనికి కొన్ని నిబంధనలు వర్తిస్తాయి. రెండేళ్ల పొడిగింపు కోసం ఎంపికైన అగ్నివీర్లు రెండో విడత విధుల్లో చేరిన తర్వాత ప్రత్యేక శిక్షణను విజయవంతంగా పూర్తి చేయాలి. ఆ తర్వాతే పెళ్లి చేసుకోవడానికి అనుమతి ఉంటుంది. ఇప్పటికే అగ్నివీర్లుగా పనిచేస్తున్న వారికి ఈ విషయంపై సమాచారం అందినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.2022లో కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని ప్రారంభించింది. ఈ విధానం ద్వారా సైన్యం, నేవీ, వైమానిక దళాల్లో యువతను నాలుగేళ్ల కాలానికి నియమిస్తున్నారు. ఈ పథకం కింద చేరే అభ్యర్థులు నియామకం సమయంలో తప్పనిసరిగా అవివాహితులై ఉండాలి. అంతేకాకుండా నాలుగేళ్ల సర్వీసు పూర్తయ్యే వరకు పెళ్లి చేసుకోవడానికి అనుమతి ఉండదు. రెండేళ్ల సర్వీస్ పొడిగింపును ఎంచుకునే సమయంలో కూడా అగ్నివీర్లు అవివాహితులుగానే కొనసాగాలనే నిబంధన ఉంది. అయితే తాజాగా తీసుకున్న నిర్ణయంతో రెండో విడత సర్వీసులోకి ప్రవేశించిన తర్వాత ఈ నిబంధనలో మార్పు రానుంది.రెండేళ్ల పొడిగింపును ఎంచుకున్న అగ్నివీర్లు మొదట కొంత విరామం తీసుకున్న తర్వాత తిరిగి విధుల్లో చేరాల్సి ఉంటుంది. ఈ సమయంలో దాదాపు నాలుగు వారాల పాటు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. రెండో విడత విధుల కోసం అవసరమైన శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన వెంటనే వారు వివాహం చేసుకోవచ్చు. అంటే రెండో విడత సర్వీసులో చేరే ముందు లేదా శిక్షణ సమయంలో కాకుండా, శిక్షణ పూర్తయిన తర్వాతే పెళ్లికి అనుమతి లభిస్తుంది. ఈ మార్పు వల్ల యువ అగ్నివీరులకు వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొంత వెసులుబాటు లభించనుంది.ఇప్పటికే భారత నావికాదళంలో అగ్నివీర్ల మొదటి బ్యాచ్ తమ నాలుగేళ్ల సర్వీసును పూర్తి చేసుకుంది. వీరిలో మెరిట్ ఆధారంగా 25 శాతం మందికి శాశ్వత ఉద్యోగాల్లో చేరే అవకాశం కల్పించారు. మిగిలిన అర్హులైన అభ్యర్థులకు మరో రెండేళ్లు సర్వీసు కొనసాగించే అవకాశం ఇచ్చారు. భారత సైన్యం, వైమానిక దళాల్లో చేరిన మొదటి బ్యాచ్‌లు కూడా వచ్చే నెలలో తమ నాలుగేళ్ల సర్వీసును పూర్తి చేసుకోనున్నాయి. దీంతో ఈ కొత్త నిబంధన మరింత మంది అగ్నివీరులకు ఉపయోగపడనుంది.అగ్నివీర్లకు రెండేళ్ల అదనపు సర్వీసు అవకాశం కల్పించే 'సెకండ్ టూర్ ఆఫ్ డ్యూటీ' (TOD) ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం నవంబర్ 4న ఆమోదం తెలిపింది. శిక్షణ పొందిన యువ సిబ్బందిని మరికొంత కాలం సైన్యంలో కొనసాగించడం ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశం. నాలుగేళ్ల సర్వీసు పూర్తయ్యాక బయటకు వెళ్లే మిగిలిన 75 శాతం అగ్నివీరులకు కూడా మొత్తం ఆరేళ్ల అనుభవం తర్వాత సాధారణ సైనిక నియామకాలకు మరో అవకాశం కల్పించాలనే లక్ష్యం ఉంది. అయితే శాశ్వత నియామకానికి ఎంపికయ్యే వారి సంఖ్య, అర్హతలు సంబంధిత నిబంధనల ప్రకారమే ఉంటాయి.ఇవి కూడా చదవండి: India AC Demand: ఇక ప్రతి ఇంట్లో ఏసీ ఉండాల్సిందే.. భారత్‌లో రాబోయే పదేళ్లలో భారీ మార్పు!ఈ సందర్భంగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ ఎన్.ఎస్. రాజా సుబ్రమణి అగ్నిపథ్ పథకంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అగ్నిపథ్ విధానం ఒకేలా కొనసాగిపోయే పథకం కాదని, అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసుకుంటూ ముందుకు సాగుతుందని తెలిపారు. సైనిక దళాల అవసరాలు, యువతకు ఎదురయ్యే సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు మార్పులు చేయనున్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు.అగ్నిపథ్ పథకం కింద సాధారణంగా 17.5 నుంచి 21 ఏళ్ల మధ్య వయసున్న యువత నియామకానికి ఎంపికవుతున్నారు. వీరిలో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల నుంచి వస్తున్నారు. నాలుగేళ్ల సర్వీసు పూర్తయ్యే సమయానికి వీరి వయసు 21 నుంచి 25 ఏళ్ల మధ్య ఉంటుంది. రెండేళ్ల పొడిగింపుతో 23 నుంచి 27 ఏళ్ల వయసులోకి చేరుకుంటారు. ఈ వయసులో చాలామంది పెళ్లి, కుటుంబ బాధ్యతల గురించి ఆలోచించడం సహజం. ఇలాంటి పరిస్థితుల్లో రెండో విడత సర్వీసులో పెళ్లికి అనుమతి ఇవ్వడం ద్వారా అగ్నివీరుల వ్యక్తిగత, సామాజిక అవసరాలను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకున్నట్లు భావించవచ్చు.మరింత చదవండి

Source link