ప్రభన్యూస్

Yuzvendra Chahal: రాజకీయాల్లోకి క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్.. బీజేపీలో చేరిక.. జాతీయ ఓబీసీ మోర్చాలో కీలక పదవి! |


Last Updated:

టీమిండియా స్టార్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ రాజకీయ అరంగేట్రం చేశారు. శనివారం భారతీయ జనతా పార్టీలో చేరిన ఆయనకు జాతీయ ఓబీసీ మోర్చా కార్యవర్గ ప్రత్యేక ఆహ్వానితుడిగా పార్టీ అధిష్ఠానం కీలక బాధ్యతలు అప్పగించింది.

News18
News18

భారత క్రికెట్ జట్టు స్టార్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ రాజకీయ ఇన్నింగ్స్ ప్రారంభించారు. శనివారం ఆయన అధికారికంగా బీజేపీలో చేరారు. పార్టీలో చేరిన వెంటనే చాహల్‌కు జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు దక్కాయి. కొత్తగా ఏర్పాటు చేసిన బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా కార్యవర్గంలో ‘ప్రత్యేక ఆహ్వానితుడిగా’ ఆయనను నియమిస్తూ పార్టీ అధిష్ఠానం ఉత్తర్వులు జారీ చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఓబీసీ మోర్చాలో చేపట్టిన విస్తృత స్థాయి నియామకాల్లో భాగంగా చాహల్‌కు ఈ పదవిని అప్పగించారు.

పార్టీలో చేరడానికి ముందు చాహల్ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు అమర్‌పాల్ మౌర్యతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. హర్యానాకు చెందిన ఈ క్రికెటర్ చేరికతో యువతలో, ముఖ్యంగా ఓబీసీ వర్గాల్లో పార్టీకి మరింత బలం చేకూరుతుందని బీజేపీ నాయకత్వం భావిస్తోంది.

భారత్ తరఫున అనేక వన్డేలు, టీ20 మ్యాచ్‌లు ఆడిన చాహల్, ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అరుదైన ఘనత సాధించారు. 2024 టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులోనూ ఆయన సభ్యుడిగా ఉన్నారు. గతంలో గౌతమ్ గంభీర్, రవీంద్ర జడేజా, కేదార్ జాదవ్ వంటి పలువురు క్రికెటర్లు కాషాయ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. మైదానంలో తన స్పిన్ మాయాజాలంతో బ్యాటర్లను బోల్తా కొట్టించిన చాహల్, ఇప్పుడు రాజకీయ పిచ్‌పై ఎలా రాణిస్తారోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 21 November 2026, 10:27 pm Digital Edition : Prabhanews
Yuzvendra Chahal: రాజకీయాల్లోకి క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్.. బీజేపీలో చేరిక.. జాతీయ ఓబీసీ మోర్చాలో కీలక పదవి! |

Last Updated:Nov 21, 2026 10:13 PM ISTటీమిండియా స్టార్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ రాజకీయ అరంగేట్రం చేశారు. శనివారం భారతీయ జనతా పార్టీలో చేరిన ఆయనకు జాతీయ ఓబీసీ మోర్చా కార్యవర్గ ప్రత్యేక ఆహ్వానితుడిగా పార్టీ అధిష్ఠానం కీలక బాధ్యతలు అప్పగించింది.News18భారత క్రికెట్ జట్టు స్టార్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ రాజకీయ ఇన్నింగ్స్ ప్రారంభించారు. శనివారం ఆయన అధికారికంగా బీజేపీలో చేరారు. పార్టీలో చేరిన వెంటనే చాహల్‌కు జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు దక్కాయి. కొత్తగా ఏర్పాటు చేసిన బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా కార్యవర్గంలో 'ప్రత్యేక ఆహ్వానితుడిగా' ఆయనను నియమిస్తూ పార్టీ అధిష్ఠానం ఉత్తర్వులు జారీ చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఓబీసీ మోర్చాలో చేపట్టిన విస్తృత స్థాయి నియామకాల్లో భాగంగా చాహల్‌కు ఈ పదవిని అప్పగించారు.పార్టీలో చేరడానికి ముందు చాహల్ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు అమర్‌పాల్ మౌర్యతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. హర్యానాకు చెందిన ఈ క్రికెటర్ చేరికతో యువతలో, ముఖ్యంగా ఓబీసీ వర్గాల్లో పార్టీకి మరింత బలం చేకూరుతుందని బీజేపీ నాయకత్వం భావిస్తోంది.భారత్ తరఫున అనేక వన్డేలు, టీ20 మ్యాచ్‌లు ఆడిన చాహల్, ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అరుదైన ఘనత సాధించారు. 2024 టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులోనూ ఆయన సభ్యుడిగా ఉన్నారు. గతంలో గౌతమ్ గంభీర్, రవీంద్ర జడేజా, కేదార్ జాదవ్ వంటి పలువురు క్రికెటర్లు కాషాయ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. మైదానంలో తన స్పిన్ మాయాజాలంతో బ్యాటర్లను బోల్తా కొట్టించిన చాహల్, ఇప్పుడు రాజకీయ పిచ్‌పై ఎలా రాణిస్తారోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.మరింత చదవండి

Source link