ప్రభన్యూస్

PM Modi: గత ప్రభుత్వాలు పేదలను నిలువునా దోచుకున్నాయి.. బీహార్ సభలో విపక్షాలపై ప్రధాని మోదీ నిప్పులు! |


Last Updated:

బీహార్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ రూ.34,470 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు, గంగా నదిపై నిర్మించిన ఆరు లైన్ల ‘నితీష్ సేతు’ వంతెనకు శనివారం ప్రారంభోత్సవం చేశారు. గత పాలకులు పేదలను దోచుకున్నారని విమర్శించారు.

PM Modi (File Photo)
PM Modi (File Photo)

బీహార్‌లోని వైశాలిలో శనివారం జరిగిన బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొని రూ.34,470 కోట్ల విలువైన భారీ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, ఎన్డీయే ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న వేళ రాష్ట్ర అభివృద్ధిలో మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కీలక పాత్ర పోషించారని కొనియాడారు. గత ప్రభుత్వాలు పేదలను దోచుకున్నాయని విమర్శించిన మోదీ, ఒకప్పుడు కరెంటు లేక అంధకారంలో ఉన్న బీహార్ గ్రామాలు నేడు విద్యుత్ ఉత్పత్తిలో కీలకంగా మారాయన్నారు. రాష్ట్రంలో రహదారుల నిర్మాణం వేగంగా జరుగుతోందని, మరింత బలమైన, సంపన్న బీహార్‌ను నిర్మిస్తున్నామని మోదీ స్పష్టం చేశారు.

రూ.4,280 కోట్లతో ‘నితీష్ సేతు’..

పట్నా జిల్లాలోని కచ్చి దర్గాను వైశాలి జిల్లాలోని బిదుపూర్‌తో కలుపుతూ గంగా నదిపై రూ.4,280 కోట్లతో నిర్మించిన ఆరు లైన్ల ‘నితీష్ సేతు’ వంతెనను ప్రధాని జాతికి అంకితం చేశారు. 9.7 కిలోమీటర్ల ప్రధాన వంతెనతో కలిపి మొత్తం 19.7 కిలోమీటర్ల పొడవున్న ఈ ప్రాజెక్టుకు మాజీ సీఎం నితీష్ కుమార్ పేరు పెట్టారు. దీనివల్ల గంగా నదిపై ఉన్న ఇతర వంతెనలపై ట్రాఫిక్ రద్దీ తగ్గి, ఉత్తర, దక్షిణ బీహార్ మధ్య రవాణా మరింత సులభతరం కానుంది.

విద్యుత్ ప్రాజెక్టులు, 100 ఎలక్ట్రిక్ బస్సులు, పేదలకు ఇళ్లు

660 మెగావాట్ల సామర్థ్యం గల బక్సర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు రెండో యూనిట్‌తో పాటు ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్, కాలువల పునరుద్ధరణ, విద్యా, వైద్య సంస్థల భవనాలను మోదీ ప్రారంభించారు. రూ.14,450 కోట్ల విలువైన హైవే విస్తరణ, తాగునీటి పనులకు శంకుస్థాపన చేశారు. ప్రజా రవాణాను బలోపేతం చేసేందుకు 100 ఎలక్ట్రిక్ బస్సులను జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన (అర్బన్) కింద 26,900 మందికి పైగా లబ్ధిదారులకు గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 21 November 2026, 4:33 pm Digital Edition : Prabhanews
PM Modi: గత ప్రభుత్వాలు పేదలను నిలువునా దోచుకున్నాయి.. బీహార్ సభలో విపక్షాలపై ప్రధాని మోదీ నిప్పులు! |

Last Updated:Nov 21, 2026 3:54 PM ISTబీహార్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ రూ.34,470 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు, గంగా నదిపై నిర్మించిన ఆరు లైన్ల ‘నితీష్ సేతు’ వంతెనకు శనివారం ప్రారంభోత్సవం చేశారు. గత పాలకులు పేదలను దోచుకున్నారని విమర్శించారు.PM Modi (File Photo)బీహార్‌లోని వైశాలిలో శనివారం జరిగిన బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొని రూ.34,470 కోట్ల విలువైన భారీ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, ఎన్డీయే ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న వేళ రాష్ట్ర అభివృద్ధిలో మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కీలక పాత్ర పోషించారని కొనియాడారు. గత ప్రభుత్వాలు పేదలను దోచుకున్నాయని విమర్శించిన మోదీ, ఒకప్పుడు కరెంటు లేక అంధకారంలో ఉన్న బీహార్ గ్రామాలు నేడు విద్యుత్ ఉత్పత్తిలో కీలకంగా మారాయన్నారు. రాష్ట్రంలో రహదారుల నిర్మాణం వేగంగా జరుగుతోందని, మరింత బలమైన, సంపన్న బీహార్‌ను నిర్మిస్తున్నామని మోదీ స్పష్టం చేశారు.రూ.4,280 కోట్లతో ‘నితీష్ సేతు’..పట్నా జిల్లాలోని కచ్చి దర్గాను వైశాలి జిల్లాలోని బిదుపూర్‌తో కలుపుతూ గంగా నదిపై రూ.4,280 కోట్లతో నిర్మించిన ఆరు లైన్ల 'నితీష్ సేతు' వంతెనను ప్రధాని జాతికి అంకితం చేశారు. 9.7 కిలోమీటర్ల ప్రధాన వంతెనతో కలిపి మొత్తం 19.7 కిలోమీటర్ల పొడవున్న ఈ ప్రాజెక్టుకు మాజీ సీఎం నితీష్ కుమార్ పేరు పెట్టారు. దీనివల్ల గంగా నదిపై ఉన్న ఇతర వంతెనలపై ట్రాఫిక్ రద్దీ తగ్గి, ఉత్తర, దక్షిణ బీహార్ మధ్య రవాణా మరింత సులభతరం కానుంది.
We are building a Bihar that is stronger, more prosperous and full of opportunities. https://t.co/vvTCLn7Y8o
— Narendra Modi (@narendramodi) November 21, 2026విద్యుత్ ప్రాజెక్టులు, 100 ఎలక్ట్రిక్ బస్సులు, పేదలకు ఇళ్లు660 మెగావాట్ల సామర్థ్యం గల బక్సర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు రెండో యూనిట్‌తో పాటు ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్, కాలువల పునరుద్ధరణ, విద్యా, వైద్య సంస్థల భవనాలను మోదీ ప్రారంభించారు. రూ.14,450 కోట్ల విలువైన హైవే విస్తరణ, తాగునీటి పనులకు శంకుస్థాపన చేశారు. ప్రజా రవాణాను బలోపేతం చేసేందుకు 100 ఎలక్ట్రిక్ బస్సులను జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన (అర్బన్) కింద 26,900 మందికి పైగా లబ్ధిదారులకు గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు.మరింత చదవండి

Source link