ప్రభన్యూస్

Aditya Dhar: ‘నా విజయానికి కారణం యామీనే’.. భార్యపై ధురంధర్ డైరెక్టర్ ప్రశంసల వర్షం! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

‘ధురంధర్’ సినిమాకు గాను దర్శకుడు ఆదిత్య ధర్, నటి యామీ గౌతమ్‌లకు ప్రతిష్ఠాత్మక ‘సీఎన్ఎన్-న్యూస్18 ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2026’ అవార్డు లభించింది. ఈ సందర్భంగా ఆదిత్య నిద్రలేకుండా 70 గంటలు పనిచేసిన విషయాన్ని యామీ వెల్లడించారు.

News18
News18

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధర్, నటి యామీ గౌతమ్ దంపతులు ప్రతిష్ఠాత్మక ‘సీఎన్ఎన్-న్యూస్18 ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2026’ పురస్కారాన్ని అందుకున్నారు. న్యూఢిల్లీలో గురువారం జరిగిన 16వ ఎడిషన్ వేడుకల్లో, రణ్‌వీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘ధురంధర్’కు గాను ‘ఛాంపియన్ ఆఫ్ భారత్ స్టోరీ’ విభాగంలో వీరిద్దరినీ సంయుక్తంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆదిత్య మాట్లాడుతూ, తనకు రాత్రికి రాత్రే స్టార్‌డమ్ రాలేదని, ఇందుకోసం దాదాపు 20 ఏళ్ల పాటు శ్రమించానని గుర్తుచేసుకున్నారు.

తన జీవితంలోకి అడుగుపెట్టిన యామీ గౌతమ్ తనకు ‘లేడీ లక్’ అని, ఆమె ప్రోత్సాహం వల్లే తాను నమ్మిన కథలను తెరకెక్కించగలుగుతున్నానని ఆదిత్య కృతజ్ఞతలు తెలిపారు. భార్యను ప్రశంసించే విషయంలో ఇతర భర్తలు ఆదిత్యను చూసి నేర్చుకోవాలని వ్యాఖ్యాత సరదాగా వ్యాఖ్యానించారు.

నిద్రలేకుండా 70 గంటలు పనిచేశారు

తన భర్త పనితీరు గురించి యామీ గౌతమ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. నిజాయితీ, అంకితభావం, కష్టపడే తత్వం కలిగిన అరుదైన వ్యక్తి ఆదిత్య అని కొనియాడారు. సినిమాల కోసం ఆయన ఎంతలా శ్రమిస్తారంటే, ఒక దశలో కంటిమీద కునుకు లేకుండా దాదాపు 70 గంటల పాటు ఏకధాటిగా పనిచేశారని యామీ వెల్లడించారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఆదిత్య ఎప్పుడూ ఎవరి గురించి చెడుగా మాట్లాడరని తెలిపారు.

భార్యాభర్తలమైనప్పటికీ వృత్తిపరమైన విషయాల్లో తాము చాలా క్రమశిక్షణతో ఉంటామని ఆదిత్య చెప్పారు. యామీతో ఏదైనా కొత్త ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలన్నా నేరుగా కాకుండా ఆమె ఏజెన్సీ, మేనేజ్‌మెంట్ ద్వారానే సంప్రదిస్తానని ఆయన తెలిపారు. ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ సినిమా ప్రమోషన్ల సమయంలోనే తాము సరిగ్గా మాట్లాడుకోవడం మొదలుపెట్టామని గుర్తుచేసుకున్నారు.

2021 జూన్‌లో వివాహం చేసుకున్న ఈ జంటకు 2024లో కుమారుడు వేదావిద్ జన్మించాడు. ఇటీవలే ‘ఆర్టికల్ 370’ చిత్రానికి గాను యామీ జాతీయ ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్న సంగతి తెలిసిందే.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 19 November 2026, 10:20 pm Digital Edition : Prabhanews
Aditya Dhar: ‘నా విజయానికి కారణం యామీనే’.. భార్యపై ధురంధర్ డైరెక్టర్ ప్రశంసల వర్షం! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Nov 19, 2026 10:20 PM IST'ధురంధర్' సినిమాకు గాను దర్శకుడు ఆదిత్య ధర్, నటి యామీ గౌతమ్‌లకు ప్రతిష్ఠాత్మక 'సీఎన్ఎన్-న్యూస్18 ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2026' అవార్డు లభించింది. ఈ సందర్భంగా ఆదిత్య నిద్రలేకుండా 70 గంటలు పనిచేసిన విషయాన్ని యామీ వెల్లడించారు.News18ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధర్, నటి యామీ గౌతమ్ దంపతులు ప్రతిష్ఠాత్మక 'సీఎన్ఎన్-న్యూస్18 ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2026' పురస్కారాన్ని అందుకున్నారు. న్యూఢిల్లీలో గురువారం జరిగిన 16వ ఎడిషన్ వేడుకల్లో, రణ్‌వీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ చిత్రం 'ధురంధర్'కు గాను 'ఛాంపియన్ ఆఫ్ భారత్ స్టోరీ' విభాగంలో వీరిద్దరినీ సంయుక్తంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆదిత్య మాట్లాడుతూ, తనకు రాత్రికి రాత్రే స్టార్‌డమ్ రాలేదని, ఇందుకోసం దాదాపు 20 ఏళ్ల పాటు శ్రమించానని గుర్తుచేసుకున్నారు.తన జీవితంలోకి అడుగుపెట్టిన యామీ గౌతమ్ తనకు 'లేడీ లక్' అని, ఆమె ప్రోత్సాహం వల్లే తాను నమ్మిన కథలను తెరకెక్కించగలుగుతున్నానని ఆదిత్య కృతజ్ఞతలు తెలిపారు. భార్యను ప్రశంసించే విషయంలో ఇతర భర్తలు ఆదిత్యను చూసి నేర్చుకోవాలని వ్యాఖ్యాత సరదాగా వ్యాఖ్యానించారు.
#CNNIndianOfTheYear | Yami Gautam Dhar and Aditya Dhar win the Champion of Bharat Story honour at CNN-News18's Indian of the Year 2026, celebrating their contribution to Indian cinema and storytelling!
#IndianOfTheYear2026 #CNNNews18 #EmergentLabs #IndianStartups #IOTY2026@kritsween @aakaaanksha @AnchorAnandN— News18 (@CNNnews18) November 19, 2026నిద్రలేకుండా 70 గంటలు పనిచేశారుతన భర్త పనితీరు గురించి యామీ గౌతమ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. నిజాయితీ, అంకితభావం, కష్టపడే తత్వం కలిగిన అరుదైన వ్యక్తి ఆదిత్య అని కొనియాడారు. సినిమాల కోసం ఆయన ఎంతలా శ్రమిస్తారంటే, ఒక దశలో కంటిమీద కునుకు లేకుండా దాదాపు 70 గంటల పాటు ఏకధాటిగా పనిచేశారని యామీ వెల్లడించారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఆదిత్య ఎప్పుడూ ఎవరి గురించి చెడుగా మాట్లాడరని తెలిపారు.భార్యాభర్తలమైనప్పటికీ వృత్తిపరమైన విషయాల్లో తాము చాలా క్రమశిక్షణతో ఉంటామని ఆదిత్య చెప్పారు. యామీతో ఏదైనా కొత్త ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలన్నా నేరుగా కాకుండా ఆమె ఏజెన్సీ, మేనేజ్‌మెంట్ ద్వారానే సంప్రదిస్తానని ఆయన తెలిపారు. 'ఉరి: ది సర్జికల్ స్ట్రైక్' సినిమా ప్రమోషన్ల సమయంలోనే తాము సరిగ్గా మాట్లాడుకోవడం మొదలుపెట్టామని గుర్తుచేసుకున్నారు.2021 జూన్‌లో వివాహం చేసుకున్న ఈ జంటకు 2024లో కుమారుడు వేదావిద్ జన్మించాడు. ఇటీవలే 'ఆర్టికల్ 370' చిత్రానికి గాను యామీ జాతీయ ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్న సంగతి తెలిసిందే.మరింత చదవండి

Source link