ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా అంబుడ్స్‌పర్సన్‌ను నియమించి, గ్రామీణ కార్మికుల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించే బాధ్యత అప్పగించనున్నారు. జాబ్ కార్డులు, ఉపాధి కల్పన, కూలీ డబ్బుల చెల్లింపులు, కూలీ చెల్లింపుల్లో జాప్యానికి పరిహారం, పని ప్రదేశాల్లో సౌకర్యాలు, మస్టర్ రోల్స్ వంటి అంశాలకు సంబంధించిన ఫిర్యాదులను వీరు పరిశీలిస్తారు. అలాగే కార్మికులకు చట్టపరంగా రావాల్సిన ప్రయోజనాలను నిరాకరించినా, వివక్ష చూపించినా, వేధింపులకు గురిచేసినా ఫిర్యాదు చేయవచ్చు. ముఖ్యంగా మహిళలు, బలహీన వర్గాలకు చెందిన కార్మికుల హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన సమస్యలపై కూడా ప్రత్యేక దృష్టి పెడతారు. (ప్రతీకాత్మక చిత్రం)

