ప్రభన్యూస్

Kulgam Encounter: సోమవారం తప్పించుకున్నాడు.. బుధవారం దొరికిపోయాడు.. కుల్గాం ఎన్‌కౌంటర్‌లో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఖతం! |


Last Updated:

Kulgam Encounter: జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలు భారీ విజయాన్ని సాధించాయి. దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో బుధవారం జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, లష్కరే తోయిబా (LeT) కమాండర్ లతీఫ్ భట్ హతమయ్యాడు.

లతీఫ్ భట్
లతీఫ్ భట్

ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశంలో అతడి మృతదేహాన్ని గుర్తించారని, ఆ ప్రాంతంలో ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని వార్తా సంస్థ పీటీఐ (PTI) వెల్లడించింది. కుల్గాం జిల్లా దేవ్‌సర్ ప్రాంతంలోని జంగల్‌పోరా గ్రామంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో భద్రతా బలగాలు బుధవారం తెల్లవారుజామున కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. లోయలోని మసీదుల్లో ఉదయం ప్రార్థనల పిలుపునకు కొద్దిసేపటి ముందే ఈ ఎన్‌కౌంటర్ మొదలైంది.

లొంగిపోవాలని విజ్ఞప్తి

ఒక మసీదులో నక్కి ఉన్న లతీఫ్ భట్‌ను చుట్టుముట్టిన భద్రతా బలగాలు, ఆయుధాలు విడిచి లొంగిపోవాలని పలుమార్లు విజ్ఞప్తి చేశాయి. ఉగ్రవాదిని లొంగిపోవాలని భద్రతా సిబ్బంది కోరుతున్న వీడియోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి.

ఎదురుకాల్పులు

అయితే భట్ లొంగిపోవడానికి నిరాకరించి కాల్పులు జరపడంతో, బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో అతడు హతమయ్యాడు. ఈ ఆపరేషన్‌లో భట్ దాక్కున్న మసీదుకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని ఆర్మీ వర్గాలు స్పష్టం చేశాయి. దీనికి సంబంధించిన తుది నివేదికను పోలీసులు విడుదల చేస్తారని తెలిపాయి.

సోమవారం నాటి ఎన్‌కౌంటర్ నుంచి తప్పించుకుని..

కశ్మీర్‌లో మిగిలి ఉన్న ఏకైక స్థానిక ఉగ్రవాదిగా, మోస్ట్ వాంటెడ్ లష్కరే కమాండర్‌గా లతీఫ్ భట్‌ను అధికారులు పేర్కొన్నారు. సోమవారం కుల్గాంలోని లారు బైపాస్ సమీపంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉమర్ నిసార్ దార్ అనే ఉగ్రవాదిని బలగాలు మట్టుబెట్టగా, ఆ ఘటనా స్థలం నుంచి భట్ తప్పించుకున్నాడు. అప్పటి నుంచి అతడి కోసం బలగాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. నవంబర్ 11న కుల్గాంలోని సీఆర్‌పీఎఫ్ (CRPF) పోస్టుపై జరిగిన దాడి వెనుక లతీఫ్ భట్, ఉమర్ నిసార్ దార్ హస్తం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. ఆ దాడిలో ముగ్గురు పారామిలిటరీ సిబ్బంది గాయపడ్డారు.

గత ఆరు నెలలుగా భట్‌కు ఆశ్రయం కల్పిస్తూ, లాజిస్టిక్ సాయం అందించిన ఉమర్ నిసార్ దార్.. పాకిస్థాన్‌కు చెందిన లష్కరే అనుబంధ సంస్థ ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ (TRF)లో చేరిన వారం రోజులకే సోమవారం నాటి ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. తాజాగా లతీఫ్ భట్ కూడా హతమవ్వడంతో దక్షిణ కశ్మీర్‌లో ఉగ్రవాద నెట్‌వర్క్‌కు కోలుకోలేని దెబ్బ తగిలినట్లయింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 18 November 2026, 10:41 am Digital Edition : Prabhanews
Kulgam Encounter: సోమవారం తప్పించుకున్నాడు.. బుధవారం దొరికిపోయాడు.. కుల్గాం ఎన్‌కౌంటర్‌లో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఖతం! |

Last Updated:Nov 18, 2026 10:40 AM ISTKulgam Encounter: జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలు భారీ విజయాన్ని సాధించాయి. దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో బుధవారం జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, లష్కరే తోయిబా (LeT) కమాండర్ లతీఫ్ భట్ హతమయ్యాడు.లతీఫ్ భట్ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశంలో అతడి మృతదేహాన్ని గుర్తించారని, ఆ ప్రాంతంలో ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని వార్తా సంస్థ పీటీఐ (PTI) వెల్లడించింది. కుల్గాం జిల్లా దేవ్‌సర్ ప్రాంతంలోని జంగల్‌పోరా గ్రామంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో భద్రతా బలగాలు బుధవారం తెల్లవారుజామున కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. లోయలోని మసీదుల్లో ఉదయం ప్రార్థనల పిలుపునకు కొద్దిసేపటి ముందే ఈ ఎన్‌కౌంటర్ మొదలైంది.లొంగిపోవాలని విజ్ఞప్తిఒక మసీదులో నక్కి ఉన్న లతీఫ్ భట్‌ను చుట్టుముట్టిన భద్రతా బలగాలు, ఆయుధాలు విడిచి లొంగిపోవాలని పలుమార్లు విజ్ఞప్తి చేశాయి. ఉగ్రవాదిని లొంగిపోవాలని భద్రతా సిబ్బంది కోరుతున్న వీడియోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి.ఎదురుకాల్పులుఅయితే భట్ లొంగిపోవడానికి నిరాకరించి కాల్పులు జరపడంతో, బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో అతడు హతమయ్యాడు. ఈ ఆపరేషన్‌లో భట్ దాక్కున్న మసీదుకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని ఆర్మీ వర్గాలు స్పష్టం చేశాయి. దీనికి సంబంధించిన తుది నివేదికను పోలీసులు విడుదల చేస్తారని తెలిపాయి.సోమవారం నాటి ఎన్‌కౌంటర్ నుంచి తప్పించుకుని..కశ్మీర్‌లో మిగిలి ఉన్న ఏకైక స్థానిక ఉగ్రవాదిగా, మోస్ట్ వాంటెడ్ లష్కరే కమాండర్‌గా లతీఫ్ భట్‌ను అధికారులు పేర్కొన్నారు. సోమవారం కుల్గాంలోని లారు బైపాస్ సమీపంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉమర్ నిసార్ దార్ అనే ఉగ్రవాదిని బలగాలు మట్టుబెట్టగా, ఆ ఘటనా స్థలం నుంచి భట్ తప్పించుకున్నాడు. అప్పటి నుంచి అతడి కోసం బలగాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. నవంబర్ 11న కుల్గాంలోని సీఆర్‌పీఎఫ్ (CRPF) పోస్టుపై జరిగిన దాడి వెనుక లతీఫ్ భట్, ఉమర్ నిసార్ దార్ హస్తం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. ఆ దాడిలో ముగ్గురు పారామిలిటరీ సిబ్బంది గాయపడ్డారు.గత ఆరు నెలలుగా భట్‌కు ఆశ్రయం కల్పిస్తూ, లాజిస్టిక్ సాయం అందించిన ఉమర్ నిసార్ దార్.. పాకిస్థాన్‌కు చెందిన లష్కరే అనుబంధ సంస్థ ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ (TRF)లో చేరిన వారం రోజులకే సోమవారం నాటి ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. తాజాగా లతీఫ్ భట్ కూడా హతమవ్వడంతో దక్షిణ కశ్మీర్‌లో ఉగ్రవాద నెట్‌వర్క్‌కు కోలుకోలేని దెబ్బ తగిలినట్లయింది.మరింత చదవండి

Source link