ప్రభన్యూస్

Russia Plane Crash: రష్యాలో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన సైనిక రవాణా విమానం.. 17 మంది దుర్మరణం! |


Last Updated:

దక్షిణ రష్యాలోని కెమెరోవో ప్రాంతంలో మంగళవారం సైనిక రవాణా విమానం ఏఎన్-12 కుప్పకూలడంతో అందులోని 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు సెర్బియాలో జరిగిన మిగ్-29 యుద్ధ విమాన ప్రమాదంలో పైలట్ మరణించారు.

News18
News18

దక్షిణ రష్యాలోని కెమెరోవోలో మంగళవారం ఘోర విమాన ప్రమాదం సంభవించింది. రష్యా సైన్యానికి చెందిన ఏఎన్-12 (An-12) రవాణా విమానం యాగునోవో గ్రామం సమీపంలోని స్థానిక విమానాశ్రయానికి చేరువలో కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న మొత్తం 17 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని, ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని రష్యన్ మీడియా వెల్లడించింది. యాగునోవో సమీపంలో విమానం కూలిపోయిన విషయాన్ని కెమెరోవో గవర్నర్ ఇల్యా సెరెడ్యూక్ అధికారికంగా ధ్రువీకరించారు.

అయితే ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. సాంకేతిక లోపమా లేక వాతావరణ ప్రతికూలతలా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఇదే రోజు సెర్బియా ఉత్తర ప్రాంతంలోని స్టారా పజోవా పట్టణం వద్ద మిగ్-29 యుద్ధ విమానం కూలిపోవడంతో పైలట్ మృతి చెందినట్లు ఆ దేశ రక్షణ శాఖ ప్రకటించింది.

రష్యాకు పెరుగుతున్న భద్రతా సవాళ్లు

రష్యా భూభాగంలోకి ఉక్రెయిన్ డ్రోన్లు, క్షిపణులతో తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న తరుణంలో ఈ విమాన ప్రమాదం చోటుచేసుకోవడం గమనార్హం. గత 24 గంటల్లోనే రికార్డు స్థాయిలో 1,441 ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా సైన్యం ప్రకటించింది. 2022 ఫిబ్రవరిలో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఒక్క రోజులో ఇంత భారీ సంఖ్యలో డ్రోన్లను అడ్డుకోవడం ఇదే తొలిసారి.

వైమానిక రక్షణ వ్యవస్థలపై తీవ్ర ఒత్తిడి

ఎస్-300, ఎస్-400, ఎస్-500 వంటి అత్యాధునిక వైమానిక రక్షణ వ్యవస్థలు ఉన్నప్పటికీ, తక్కువ ఎత్తులో ఎగిరే ఉక్రెయిన్ డ్రోన్లను గుర్తించడం రష్యా రాడార్లకు సవాలుగా మారింది. చమురు శుద్ధి కర్మాగారాలు, క్రిమియాను కలిపే కెర్చ్ వంతెన వంటి కీలక ప్రాంతాలపై ఉక్రెయిన్ దాడులు పెంచగా, శీతాకాలం సమీపిస్తున్న వేళ ఉక్రెయిన్ విద్యుత్ కేంద్రాలపై రష్యా ప్రతీకార దాడులు తీవ్రతరం చేసింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 17 November 2026, 10:46 pm Digital Edition : Prabhanews
Russia Plane Crash: రష్యాలో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన సైనిక రవాణా విమానం.. 17 మంది దుర్మరణం! |

Last Updated:Nov 17, 2026 10:42 PM ISTదక్షిణ రష్యాలోని కెమెరోవో ప్రాంతంలో మంగళవారం సైనిక రవాణా విమానం ఏఎన్-12 కుప్పకూలడంతో అందులోని 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు సెర్బియాలో జరిగిన మిగ్-29 యుద్ధ విమాన ప్రమాదంలో పైలట్ మరణించారు.News18దక్షిణ రష్యాలోని కెమెరోవోలో మంగళవారం ఘోర విమాన ప్రమాదం సంభవించింది. రష్యా సైన్యానికి చెందిన ఏఎన్-12 (An-12) రవాణా విమానం యాగునోవో గ్రామం సమీపంలోని స్థానిక విమానాశ్రయానికి చేరువలో కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న మొత్తం 17 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని, ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని రష్యన్ మీడియా వెల్లడించింది. యాగునోవో సమీపంలో విమానం కూలిపోయిన విషయాన్ని కెమెరోవో గవర్నర్ ఇల్యా సెరెడ్యూక్ అధికారికంగా ధ్రువీకరించారు.అయితే ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. సాంకేతిక లోపమా లేక వాతావరణ ప్రతికూలతలా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఇదే రోజు సెర్బియా ఉత్తర ప్రాంతంలోని స్టారా పజోవా పట్టణం వద్ద మిగ్-29 యుద్ధ విమానం కూలిపోవడంతో పైలట్ మృతి చెందినట్లు ఆ దేశ రక్షణ శాఖ ప్రకటించింది.
BREAKING: Military plane carrying 17 people crashes in southern Russia, killing everyone on board - 112 https://t.co/ZzbLuod72B
— BNO News Live (@BNODesk) November 17, 2026రష్యాకు పెరుగుతున్న భద్రతా సవాళ్లురష్యా భూభాగంలోకి ఉక్రెయిన్ డ్రోన్లు, క్షిపణులతో తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న తరుణంలో ఈ విమాన ప్రమాదం చోటుచేసుకోవడం గమనార్హం. గత 24 గంటల్లోనే రికార్డు స్థాయిలో 1,441 ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా సైన్యం ప్రకటించింది. 2022 ఫిబ్రవరిలో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఒక్క రోజులో ఇంత భారీ సంఖ్యలో డ్రోన్లను అడ్డుకోవడం ఇదే తొలిసారి.వైమానిక రక్షణ వ్యవస్థలపై తీవ్ర ఒత్తిడిఎస్-300, ఎస్-400, ఎస్-500 వంటి అత్యాధునిక వైమానిక రక్షణ వ్యవస్థలు ఉన్నప్పటికీ, తక్కువ ఎత్తులో ఎగిరే ఉక్రెయిన్ డ్రోన్లను గుర్తించడం రష్యా రాడార్లకు సవాలుగా మారింది. చమురు శుద్ధి కర్మాగారాలు, క్రిమియాను కలిపే కెర్చ్ వంతెన వంటి కీలక ప్రాంతాలపై ఉక్రెయిన్ దాడులు పెంచగా, శీతాకాలం సమీపిస్తున్న వేళ ఉక్రెయిన్ విద్యుత్ కేంద్రాలపై రష్యా ప్రతీకార దాడులు తీవ్రతరం చేసింది.మరింత చదవండి

Source link