Last Updated:
గ్లామర్ ఒలకబోస్తేనే ఇండస్ట్రీలో నిలదొక్కుకోవచ్చు అనే ఫార్ములాను బ్రేక్ చేసి.. స్టార్ హీరోలతో సినిమాలు చేసుకుంటూ యావత్ ఇండియాలోనే ది మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా క్రేజ్ సంపాదించుకుంది ఈ కుట్టీ. అసలు ఈ కుట్టికి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.
గ్లామర్ ఒలకబోస్తేనే ఇండస్ట్రీలో నిలదొక్కుకోవచ్చు అనే ఫార్ములాను బ్రేక్ చేసి.. స్టార్ హీరోలతో సినిమాలు చేసుకుంటూ యావత్ ఇండియాలోనే ది మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా క్రేజ్ సంపాదించుకుంది ఈ కుట్టీ. అసలు ఈ కుట్టికి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. లెక్కల మాస్టర్ సుకుమార్ సైతం ఈమె ఫాలోయింగ్ చూసి లేడీ పవర్ స్టార్ అన్నారంటే.. ఆమెకు ఏ రేంజ్‌లో అభిమాన గళం ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
అసలు సిల్వర్ స్క్రీన్‌పై ఆమెను చూస్తే చాలు కుర్రకారు గాల్లో పేపర్లు విసరడం.. ఈలలు, గోలలతో రచ్చ చేస్తుంటారు. అసలు ఆమె నటించిన సినిమా రిలీజవుతుందంటే.. హీరో ఎవరా అని కూడా ఆలోచించకుండా థియేటర్‌లకు పరిగెత్తుతుంటారు. అంతలా తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించుకుంది సాయి పల్లవి.
గ్లామర్‌కు దూరంగా ఉంటూ నటనకు ప్రాధాన్యత ఇచ్చే ఈ బ్యూటీ.. ఇప్పుడు మరోసారి తన పాత్ర కోసం సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా తన పొడవాటి జుత్తును కత్తిరించుకుని షార్ట్ హెయిర్‌తో కనిపించేందుకు సిద్ధమయ్యారు. అయితే సాయిపల్లవి తీసుకున్న ఈ నిర్ణయం చూసి ఆమె తల్లి షాక్‌కు గురయ్యారట. కోపంతో వీడియో కాల్‌ను కూడా కట్ చేశారట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సాయిపల్లవి స్వయంగా ఈ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ప్రముఖ నటుడు ధనుష్ హీరోగా నటిస్తున్న ‘ఓ.ఎం. (ఆపరేషన్ మోల్)’ సినిమాలో సాయిపల్లవి కీలక పాత్ర పోషిస్తున్నారు. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆమె నిత్యా రెడ్డి అనే ఐపీఎస్ అధికారిణిగా కనిపించనున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ కథలో పోలీస్ అధికారిణి పాత్ర కోసం సాయిపల్లవి తన లుక్‌ను పూర్తిగా మార్చుకున్నారు. ఇందులో భాగంగానే తన పొడవాటి జుత్తును కత్తిరించుకుని పొట్టి జుత్తుతో కొత్తగా కనిపించనున్నారు.
ఈ మార్పు గురించి సాయిపల్లవి మాట్లాడుతూ.. జుత్తు కత్తిరించుకున్న తర్వాత తన తల్లికి వీడియో కాల్ చేశానని చెప్పారు. అయితే తన కొత్త లుక్ చూసిన తల్లి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారని, కోపంతో వెంటనే కాల్ కట్ చేశారని గుర్తుచేసుకున్నారు. ఆ తర్వాత తండ్రికి కూడా ఈ విషయం చెప్పాల్సి వచ్చిందని తెలిపారు.
తన తండ్రి మొదట జుత్తు కత్తిరించుకోలేదని, విగ్ పెట్టుకున్నానని అనుకున్నారట. కానీ నిజంగానే జుత్తు కత్తిరించుకున్నానని చెప్పడంతో ఆయన కూడా ఆశ్చర్యపోయారని సాయిపల్లవి వెల్లడించారు. ఈ విషయం తెలిసిన తర్వాత తల్లికి నచ్చజెప్పడానికి తన తండ్రి కొన్ని రోజుల పాటు ప్రయత్నించాల్సి వచ్చిందట. చివరకు తల్లి అర్థం చేసుకున్న తర్వాతే మళ్లీ తనతో మాట్లాడటం మొదలుపెట్టారని ఆమె సరదాగా చెప్పుకొచ్చారు.
అయితే ప్రతి సినిమా కోసం ఇలాంటి మార్పులకు అంగీకరించనని సాయిపల్లవి స్పష్టం చేశారు. వేరే దర్శకుడు తనను షార్ట్ హెయిర్‌తో కనిపించాలని అడిగితే బహుశా ఒప్పుకునేదాన్ని కాదని చెప్పారు. కానీ రాజ్‌కుమార్ పెరియసామిపై ఉన్న నమ్మకంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తన పాత్ర స్వరూపాన్ని వివరించడానికి దర్శకుడు ఐపీఎస్ అధికారిణి మెరిన్ జోసెఫ్ ఫొటోను రిఫరెన్స్‌గా చూపించారని వెల్లడించారు. ఆ పాత్రకు తగినట్టుగా కనిపించాలనే ఉద్దేశంతోనే జుత్తును కత్తిరించుకున్నట్లు వివరించారు.
ఇక ‘ఓ.ఎం. (ఆపరేషన్ మోల్)’ సినిమాలో ధనుష్‌తో పాటు మలయాళ స్టార్ మమ్ముట్టి కూడా మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. తొలుత ఈ చిత్రానికి ‘ఓం’ అనే టైటిల్‌ను ఖరారు చేయగా, సెన్సార్ బోర్డు సూచన మేరకు ‘ఓ.ఎం. (ఆపరేషన్ మోల్)’గా మార్చారు. నవంబర్ 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
మొత్తానికి సినిమా కోసం సాయిపల్లవి చేసిన ఈ హెయిర్ స్టైల్ మార్పు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తన పాత్ర కోసం ఎంతటి మార్పుకైనా సిద్ధమనే విషయాన్ని మరోసారి నిరూపించారు.

