Kitchen Tips: కొత్తిమీర రెండు రోజుల్లోనే వాడిపోతోందా.. ఈ చిన్న చిట్కాతో ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది..! | లైఫ్ స్టైల్


Last Updated:

కొత్తిమీర తాజాగా ఉండేందుకు విశాఖపట్నానికి చెందిన గృహిణి సాయి పల్లవి కొన్ని చిన్న చిట్కాలు చెప్పారు. కడగకుండా, టిష్యూ పేపర్‌తో పొడి డబ్బాలో నిల్వ చేస్తే కొత్తిమీర ఎక్కువ రోజులు తాజాగా ఉంటుందని సూచించార

News18
News18

వంటింట్లో కొత్తిమీరకు ప్రత్యేక స్థానం ఉంటుంది. పప్పు, కూర, పచ్చడి.. ఇలా ఏ వంటకం చేసినా చివర్లో కొద్దిగా కొత్తిమీర వేస్తే రుచి, సువాసన రెండూ పెరుగుతాయి. అందుకే చాలామంది మార్కెట్‌కు వెళ్లినప్పుడు ఒకేసారి ఎక్కువ మొత్తంలో కొత్తిమీర కొనుగోలు చేస్తుంటారు. కానీ ఇంటికి తెచ్చిన రెండు మూడు రోజులకే ఆకులు పసుపు రంగులోకి మారి వాడిపోతుంటాయి. దీంతో చేసేదేమీ లేక పాడైన కొత్తిమీరను పడేయాల్సి వస్తుంది. అయితే కొన్ని చిన్న చిట్కాలు పాటిస్తే కొత్తిమీరను ఎక్కువ రోజులు తాజాగా ఉంచుకోవచ్చని విశాఖపట్నానికి చెందిన గృహిణి సాయి పల్లవి చెబుతున్నారు.

చాలామంది మార్కెట్ నుంచి కొత్తిమీర తీసుకొచ్చిన వెంటనే నీటితో కడిగి ఫ్రిజ్‌లో పెట్టేస్తుంటారు. కానీ ఆకులపై నీరు అలాగే ఉండిపోవడం వల్ల అవి త్వరగా కుళ్లిపోయే అవకాశం ఉంటుంది. అందుకే ముందుగా కొత్తిమీరలోని పసుపు రంగులోకి మారిన, ఎండిపోయిన ఆకులను తొలగించాలి. వేర్లకు మట్టి ఉంటే శుభ్రం చేయాలి. కడగకుండా నిల్వ చేయడం మంచిది. ఒకవేళ కడిగితే మాత్రం కిచెన్ టవల్‌పై పరచి పూర్తిగా ఆరిన తర్వాతే ఫ్రిజ్‌లో పెట్టాలి.

కొత్తిమీర ఎక్కువ రోజులు తాజాగా ఉండేందుకు టిష్యూ పేపర్ చిట్కా బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం ఒక శుభ్రమైన, పూర్తిగా పొడిగా ఉన్న గాలి చొరబడని డబ్బా తీసుకోవాలి. దాని అడుగున టిష్యూ పేపర్ పరిచి, దానిపై కొత్తిమీర ఆకులను ఉంచాలి. అనంతరం ఆకుల పైన మరో పొర టిష్యూ పేపర్ వేసి డబ్బా మూత పెట్టాలి. ఇలా చేయడం వల్ల ఆకుల్లోని అదనపు తేమను టిష్యూ పేపర్ పీల్చుకుంటుంది. దీంతో కొత్తిమీర త్వరగా కుళ్లిపోకుండా ఉంటుంది.

మరికొందరు కొత్తిమీరను నేరుగా ప్లాస్టిక్ కవర్లలో పెట్టి ఫ్రిజ్‌లో నిల్వ చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల కవర్ లోపల తేమ పేరుకుపోయి ఆకులు త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. అందుకే పొడి డబ్బాలో నిల్వ చేయడం మంచిదని సాయి పల్లవి సూచిస్తున్నారు. అలాగే ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి డబ్బాను తెరిచి టిష్యూ పేపర్‌ను పరిశీలించాలి. అది తడిగా ఉంటే వెంటనే కొత్తది మార్చాలి. పాడైన ఆకులు కనిపిస్తే వాటిని కూడా తీసేయాలి.

కొత్తిమీరను తాజాగా ఉంచడానికి పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మన ఇంట్లోనే అందుబాటులో ఉండే టిష్యూ పేపర్, ఒక పొడి డబ్బా ఉంటే సరిపోతుంది. అయితే ఫ్రిజ్‌లో ఉంచినప్పటికీ ఎప్పటికప్పుడు ఆకులను పరిశీలించడం ముఖ్యం. ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే కొత్తిమీర వృథా కాకుండా అవసరమైనప్పుడు తాజాగా ఉపయోగించుకోవచ్చు. మార్కెట్‌కు పదేపదే వెళ్లి కొత్తిమీర కొనాల్సిన ఇబ్బంది కూడా కొంత తగ్గుతుంది. (గమనిక: ఈ కథనం గృహిణి అందించిన సాధారణ సమాచారం ఆధారంగా రాసినది. దీనికి లోకల్ 18తెలుగు ధృవీకరించడం లేదు.)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 15 November 2026, 8:10 pm Digital Edition : Prabhanews
Kitchen Tips: కొత్తిమీర రెండు రోజుల్లోనే వాడిపోతోందా.. ఈ చిన్న చిట్కాతో ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది..! | లైఫ్ స్టైల్

Last Updated:Nov 15, 2026 7:56 PM ISTకొత్తిమీర తాజాగా ఉండేందుకు విశాఖపట్నానికి చెందిన గృహిణి సాయి పల్లవి కొన్ని చిన్న చిట్కాలు చెప్పారు. కడగకుండా, టిష్యూ పేపర్‌తో పొడి డబ్బాలో నిల్వ చేస్తే కొత్తిమీర ఎక్కువ రోజులు తాజాగా ఉంటుందని సూచించారNews18వంటింట్లో కొత్తిమీరకు ప్రత్యేక స్థానం ఉంటుంది. పప్పు, కూర, పచ్చడి.. ఇలా ఏ వంటకం చేసినా చివర్లో కొద్దిగా కొత్తిమీర వేస్తే రుచి, సువాసన రెండూ పెరుగుతాయి. అందుకే చాలామంది మార్కెట్‌కు వెళ్లినప్పుడు ఒకేసారి ఎక్కువ మొత్తంలో కొత్తిమీర కొనుగోలు చేస్తుంటారు. కానీ ఇంటికి తెచ్చిన రెండు మూడు రోజులకే ఆకులు పసుపు రంగులోకి మారి వాడిపోతుంటాయి. దీంతో చేసేదేమీ లేక పాడైన కొత్తిమీరను పడేయాల్సి వస్తుంది. అయితే కొన్ని చిన్న చిట్కాలు పాటిస్తే కొత్తిమీరను ఎక్కువ రోజులు తాజాగా ఉంచుకోవచ్చని విశాఖపట్నానికి చెందిన గృహిణి సాయి పల్లవి చెబుతున్నారు.చాలామంది మార్కెట్ నుంచి కొత్తిమీర తీసుకొచ్చిన వెంటనే నీటితో కడిగి ఫ్రిజ్‌లో పెట్టేస్తుంటారు. కానీ ఆకులపై నీరు అలాగే ఉండిపోవడం వల్ల అవి త్వరగా కుళ్లిపోయే అవకాశం ఉంటుంది. అందుకే ముందుగా కొత్తిమీరలోని పసుపు రంగులోకి మారిన, ఎండిపోయిన ఆకులను తొలగించాలి. వేర్లకు మట్టి ఉంటే శుభ్రం చేయాలి. కడగకుండా నిల్వ చేయడం మంచిది. ఒకవేళ కడిగితే మాత్రం కిచెన్ టవల్‌పై పరచి పూర్తిగా ఆరిన తర్వాతే ఫ్రిజ్‌లో పెట్టాలి.కొత్తిమీర ఎక్కువ రోజులు తాజాగా ఉండేందుకు టిష్యూ పేపర్ చిట్కా బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం ఒక శుభ్రమైన, పూర్తిగా పొడిగా ఉన్న గాలి చొరబడని డబ్బా తీసుకోవాలి. దాని అడుగున టిష్యూ పేపర్ పరిచి, దానిపై కొత్తిమీర ఆకులను ఉంచాలి. అనంతరం ఆకుల పైన మరో పొర టిష్యూ పేపర్ వేసి డబ్బా మూత పెట్టాలి. ఇలా చేయడం వల్ల ఆకుల్లోని అదనపు తేమను టిష్యూ పేపర్ పీల్చుకుంటుంది. దీంతో కొత్తిమీర త్వరగా కుళ్లిపోకుండా ఉంటుంది.మరికొందరు కొత్తిమీరను నేరుగా ప్లాస్టిక్ కవర్లలో పెట్టి ఫ్రిజ్‌లో నిల్వ చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల కవర్ లోపల తేమ పేరుకుపోయి ఆకులు త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. అందుకే పొడి డబ్బాలో నిల్వ చేయడం మంచిదని సాయి పల్లవి సూచిస్తున్నారు. అలాగే ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి డబ్బాను తెరిచి టిష్యూ పేపర్‌ను పరిశీలించాలి. అది తడిగా ఉంటే వెంటనే కొత్తది మార్చాలి. పాడైన ఆకులు కనిపిస్తే వాటిని కూడా తీసేయాలి.కొత్తిమీరను తాజాగా ఉంచడానికి పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మన ఇంట్లోనే అందుబాటులో ఉండే టిష్యూ పేపర్, ఒక పొడి డబ్బా ఉంటే సరిపోతుంది. అయితే ఫ్రిజ్‌లో ఉంచినప్పటికీ ఎప్పటికప్పుడు ఆకులను పరిశీలించడం ముఖ్యం. ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే కొత్తిమీర వృథా కాకుండా అవసరమైనప్పుడు తాజాగా ఉపయోగించుకోవచ్చు. మార్కెట్‌కు పదేపదే వెళ్లి కొత్తిమీర కొనాల్సిన ఇబ్బంది కూడా కొంత తగ్గుతుంది. (గమనిక: ఈ కథనం గృహిణి అందించిన సాధారణ సమాచారం ఆధారంగా రాసినది. దీనికి లోకల్ 18తెలుగు ధృవీకరించడం లేదు.)మరింత చదవండి

Source link