ప్రభన్యూస్

Top 10 News: నేటి టాప్ పది వార్తలు మీకోసం.. రెండు నిమిషాల్లో చదివేయండి | తెలంగాణ వార్తలు


విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు రెండో రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖ సంస్థలు ఒప్పందాలపై సంతకాలు చేశాయి.ఏపీ సీఆర్‌డీఏ, ఏపీ మారిటైమ్ బోర్డు, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌తో పాటు పీ4 నమూనాకు సంబంధించిన ఒప్పందాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌లో జనాభా విధానంలో కీలక మార్పులు తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.గతంలో అమలు చేసిన కుటుంబ నియంత్రణ విధానాలకు బదులుగా, ఎక్కువ మంది పిల్లలను కనేలా ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. ఐటీ శకం ముగిసి, ఏఐ, క్వాంటం టెక్నాలజీ యుగం ప్రారంభమైందని,తన విధానాల వల్లే స్థానిక ఎన్నికల్లో కూటమి ఓటు శాతం పెరిగిందని, ప్రజలకు మంచి చేస్తే వారే ఆశీర్వదిస్తారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

2.ఏపీలో తొలి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. తొలి విడత ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ నవంబర్‌ 15న ప్రారంభం కానుంది. అభ్యర్థులు నవంబర్‌ 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. నవంబర్‌ 18న నామినేషన్ల పరిశీలన చేపడతారు. తిరస్కరణకు గురైన నామినేషన్లపై అప్పీల్‌ చేసుకునేందుకు నవంబర్‌ 19, 20 తేదీల్లో అవకాశం కల్పించారు.

3.భారత్‌ సమిట్‌ను విపక్షాలు అనవసకంగా వ్యతిరేకిస్తున్నాయి

భారత్‌ సమిట్‌ను విపక్షాలు గుడ్డిగా వ్యతిరేకిస్తున్నాయని తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ ప్రత్యేకతలు, అనుకూలతలను ప్రపంచానికి పరిచయం చేయడమే సమిట్‌ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. భారత్‌ సమిట్‌పై కిషన్‌రెడ్డి, రామచందర్‌రావు, కేసీఆర్‌ ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారో అర్థం కావడం లేదని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. వాతావరణ మార్పులు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులపై సమిట్‌లో చర్చిస్తున్నామని తెలిపారు.

4.ఎల్‌నినోతో హెల్త్‌ ఎమర్జెన్సీ..డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక

ఎల్‌నినో ప్రభావంతో పిల్లలు, గర్భిణులు, వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు తీవ్రంగా ప్రభావితమయ్యే ప్రమాదం ఉందని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. మురికివాడలు, మారుమూల ప్రాంతాల్లో నివసించేవారికి తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య సేవలు అందుబాటులో లేకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోందని పేర్కొంది. వ్యవసాయ కూలీలు, నిర్మాణ కార్మికులు, వీధి వ్యాపారులు వడగాలుల బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. వాతావరణ మార్పులు అత్యవసర పరిస్థితులుగా మారకముందే ముందస్తు చర్యలు చేపట్టాలని డబ్ల్యూహెచ్‌ఓ సూచించింది.

5.బంగాళాఖాతంలో అల్పపీడనం..

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.నవంబర్‌ 15 నాటికి ఇది వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలో రాబోయే రెండు రోజుల పాటు చలి తీవ్రత మరింత పెరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉష్ణోగ్రతలు అకస్మాత్తుగా తగ్గడం వల్ల సీజనల్ ఫ్లూ, శ్వాసకోశ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ బి. రవీందర్ నాయక్ హెచ్చరించారు.

6. నా మొబైల్‌ను ట్యాప్‌ చేస్తున్నారు

లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణలు చేశారు. తన మొబైల్‌ను ట్యాప్‌ చేస్తున్నారని, అందుకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని వెల్లడించారు. ఈ అంశంపై ప్రధానితో బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్‌ విసిరారు. మూడేళ్ల క్రితం కూడా పెగాసస్‌ స్పైవేర్‌తో ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్‌ చేస్తున్నారని రాహుల్‌ ఆరోపించగా, కేంద్ర ప్రభుత్వం అప్పట్లో ఆ ఆరోపణలను ఖండించింది.

7. అల్లు స్నేహారెడ్డికి అరుదైన గౌరవం

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ భార్య, వ్యాపారవేత్త అల్లు స్నేహారెడ్డికి కళా, సాంస్కృతిక రంగాల్లో అరుదైన గౌరవం దక్కింది. ఆమె ప్రతిష్ఠాత్మక బౌలీ ఆర్ట్‌ సంఘం కల్చర్‌ అండ్‌ హెరిటేజ్‌ విభాగానికి ఫౌండింగ్‌ చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. భారత్‌లోనే తొలిసారిగా నిర్వహించనున్న స్టెప్‌వెల్‌ ఆర్ట్‌ బినాలే ఉద్యమానికి ఆమె ప్రధాన సారథిగా వ్యవహరించనున్నారు.

8. అప్పుడు కన్నీళ్లు ఆగలేదు

‘రామాయణ’ చిత్రంలో సీత పాత్రలో కనిపించిన నటి సాయిపల్లవి షూటింగ్‌ సమయంలో ఎదురైన భావోద్వేగ అనుభవాన్ని పంచుకున్నారు. ఓ సన్నివేశం పూర్తయిన తర్వాత తన డైలాగ్‌ కోచ్‌ వచ్చి పాదాలకు నమస్కరించారని తెలిపారు. ఆ అనూహ్య సంఘటనతో తాను భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నట్లు సాయిపల్లవి గుర్తుచేసుకున్నారు. తన డైలాగ్‌ కోచ్‌ చేసిన పనికి ఆశ్చర్యపోయానని నటి సాయిపల్లవి తెలిపారు. తనను సాయిపల్లవిగా కాకుండా, ప్రతిరోజూ పూజించే పాత్రలోనే ఆమె చూశారని వెల్లడించారు. ఆ పాత్రపై ఉన్న భక్తి, ప్రేమతోనే తన పాదాలకు నమస్కరించారని, ఆ సంఘటన తనను భావోద్వేగానికి గురిచేసిందని సాయిపల్లవి పేర్కొన్నారు.

9. బ్యాటర్లపై గంభీర్‌ అసంతృప్తి

న్యూజిలాండ్‌తో నాలుగో వన్డేలో భారత జట్టు 89 పరుగులకే కుప్పకూలడంపై హెడ్‌కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ అసహనం వ్యక్తం చేశాడు. మాట్‌ హెన్రీ బౌలింగ్‌లో ఆడలేని బంతులేమీ లేవని, బ్యాటర్ల వైఫల్యమే ఓటమికి కారణమని పేర్కొన్నాడు.తొలి పది ఓవర్లలో బ్యాటర్లు జాగ్రత్తగా ఆడాల్సిందని, మంచి లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో హెన్రీ బౌలింగ్‌ చేశాడని తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఏ బంతినైనా ఎదుర్కొనే సామర్థ్యం బ్యాటర్లకు ఉండాలని, ఇంత తక్కువ స్కోరుకే ఆలౌట్‌ కావడం ఆందోళనకరమని గంభీర్‌ వ్యాఖ్యానించాడు.

10. ఇరాన్‌తో ఒప్పందం అవసరం లేదు

ఇరాన్‌తో ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం అమెరికాకు ఇక లేదని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. చాలా కాలం క్రితమే ఆ పరిస్థితిని అధిగమించామని ‘ట్రూత్ సోషల్’లో పేర్కొన్నారు. భారీ మొత్తంలో ఇరాన్ డబ్బును, హర్మూజ్ జలసంధిని తమ నియంత్రణలోకి తీసుకున్నామని ట్రంప్ తన పోస్టులో రాశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 13 November 2026, 8:26 pm Digital Edition : Prabhanews
Top 10 News: నేటి టాప్ పది వార్తలు మీకోసం.. రెండు నిమిషాల్లో చదివేయండి | తెలంగాణ వార్తలు

విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు రెండో రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖ సంస్థలు ఒప్పందాలపై సంతకాలు చేశాయి.ఏపీ సీఆర్‌డీఏ, ఏపీ మారిటైమ్ బోర్డు, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌తో పాటు పీ4 నమూనాకు సంబంధించిన ఒప్పందాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌లో జనాభా విధానంలో కీలక మార్పులు తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.గతంలో అమలు చేసిన కుటుంబ నియంత్రణ విధానాలకు బదులుగా, ఎక్కువ మంది పిల్లలను కనేలా ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. ఐటీ శకం ముగిసి, ఏఐ, క్వాంటం టెక్నాలజీ యుగం ప్రారంభమైందని,తన విధానాల వల్లే స్థానిక ఎన్నికల్లో కూటమి ఓటు శాతం పెరిగిందని, ప్రజలకు మంచి చేస్తే వారే ఆశీర్వదిస్తారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.2.ఏపీలో తొలి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలుఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. తొలి విడత ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ నవంబర్‌ 15న ప్రారంభం కానుంది. అభ్యర్థులు నవంబర్‌ 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. నవంబర్‌ 18న నామినేషన్ల పరిశీలన చేపడతారు. తిరస్కరణకు గురైన నామినేషన్లపై అప్పీల్‌ చేసుకునేందుకు నవంబర్‌ 19, 20 తేదీల్లో అవకాశం కల్పించారు.3.భారత్‌ సమిట్‌ను విపక్షాలు అనవసకంగా వ్యతిరేకిస్తున్నాయిభారత్‌ సమిట్‌ను విపక్షాలు గుడ్డిగా వ్యతిరేకిస్తున్నాయని తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ ప్రత్యేకతలు, అనుకూలతలను ప్రపంచానికి పరిచయం చేయడమే సమిట్‌ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. భారత్‌ సమిట్‌పై కిషన్‌రెడ్డి, రామచందర్‌రావు, కేసీఆర్‌ ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారో అర్థం కావడం లేదని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. వాతావరణ మార్పులు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులపై సమిట్‌లో చర్చిస్తున్నామని తెలిపారు.4.ఎల్‌నినోతో హెల్త్‌ ఎమర్జెన్సీ..డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక ఎల్‌నినో ప్రభావంతో పిల్లలు, గర్భిణులు, వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు తీవ్రంగా ప్రభావితమయ్యే ప్రమాదం ఉందని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. మురికివాడలు, మారుమూల ప్రాంతాల్లో నివసించేవారికి తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య సేవలు అందుబాటులో లేకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోందని పేర్కొంది. వ్యవసాయ కూలీలు, నిర్మాణ కార్మికులు, వీధి వ్యాపారులు వడగాలుల బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. వాతావరణ మార్పులు అత్యవసర పరిస్థితులుగా మారకముందే ముందస్తు చర్యలు చేపట్టాలని డబ్ల్యూహెచ్‌ఓ సూచించింది.5.బంగాళాఖాతంలో అల్పపీడనం..ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.నవంబర్‌ 15 నాటికి ఇది వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలో రాబోయే రెండు రోజుల పాటు చలి తీవ్రత మరింత పెరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉష్ణోగ్రతలు అకస్మాత్తుగా తగ్గడం వల్ల సీజనల్ ఫ్లూ, శ్వాసకోశ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ బి. రవీందర్ నాయక్ హెచ్చరించారు.6. నా మొబైల్‌ను ట్యాప్‌ చేస్తున్నారు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణలు చేశారు. తన మొబైల్‌ను ట్యాప్‌ చేస్తున్నారని, అందుకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని వెల్లడించారు. ఈ అంశంపై ప్రధానితో బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్‌ విసిరారు. మూడేళ్ల క్రితం కూడా పెగాసస్‌ స్పైవేర్‌తో ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్‌ చేస్తున్నారని రాహుల్‌ ఆరోపించగా, కేంద్ర ప్రభుత్వం అప్పట్లో ఆ ఆరోపణలను ఖండించింది.7. అల్లు స్నేహారెడ్డికి అరుదైన గౌరవం ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ భార్య, వ్యాపారవేత్త అల్లు స్నేహారెడ్డికి కళా, సాంస్కృతిక రంగాల్లో అరుదైన గౌరవం దక్కింది. ఆమె ప్రతిష్ఠాత్మక బౌలీ ఆర్ట్‌ సంఘం కల్చర్‌ అండ్‌ హెరిటేజ్‌ విభాగానికి ఫౌండింగ్‌ చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. భారత్‌లోనే తొలిసారిగా నిర్వహించనున్న స్టెప్‌వెల్‌ ఆర్ట్‌ బినాలే ఉద్యమానికి ఆమె ప్రధాన సారథిగా వ్యవహరించనున్నారు.8. అప్పుడు కన్నీళ్లు ఆగలేదు ‘రామాయణ’ చిత్రంలో సీత పాత్రలో కనిపించిన నటి సాయిపల్లవి షూటింగ్‌ సమయంలో ఎదురైన భావోద్వేగ అనుభవాన్ని పంచుకున్నారు. ఓ సన్నివేశం పూర్తయిన తర్వాత తన డైలాగ్‌ కోచ్‌ వచ్చి పాదాలకు నమస్కరించారని తెలిపారు. ఆ అనూహ్య సంఘటనతో తాను భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నట్లు సాయిపల్లవి గుర్తుచేసుకున్నారు. తన డైలాగ్‌ కోచ్‌ చేసిన పనికి ఆశ్చర్యపోయానని నటి సాయిపల్లవి తెలిపారు. తనను సాయిపల్లవిగా కాకుండా, ప్రతిరోజూ పూజించే పాత్రలోనే ఆమె చూశారని వెల్లడించారు. ఆ పాత్రపై ఉన్న భక్తి, ప్రేమతోనే తన పాదాలకు నమస్కరించారని, ఆ సంఘటన తనను భావోద్వేగానికి గురిచేసిందని సాయిపల్లవి పేర్కొన్నారు.9. బ్యాటర్లపై గంభీర్‌ అసంతృప్తి న్యూజిలాండ్‌తో నాలుగో వన్డేలో భారత జట్టు 89 పరుగులకే కుప్పకూలడంపై హెడ్‌కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ అసహనం వ్యక్తం చేశాడు. మాట్‌ హెన్రీ బౌలింగ్‌లో ఆడలేని బంతులేమీ లేవని, బ్యాటర్ల వైఫల్యమే ఓటమికి కారణమని పేర్కొన్నాడు.తొలి పది ఓవర్లలో బ్యాటర్లు జాగ్రత్తగా ఆడాల్సిందని, మంచి లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో హెన్రీ బౌలింగ్‌ చేశాడని తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఏ బంతినైనా ఎదుర్కొనే సామర్థ్యం బ్యాటర్లకు ఉండాలని, ఇంత తక్కువ స్కోరుకే ఆలౌట్‌ కావడం ఆందోళనకరమని గంభీర్‌ వ్యాఖ్యానించాడు.10. ఇరాన్‌తో ఒప్పందం అవసరం లేదు ఇరాన్‌తో ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం అమెరికాకు ఇక లేదని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. చాలా కాలం క్రితమే ఆ పరిస్థితిని అధిగమించామని ‘ట్రూత్ సోషల్’లో పేర్కొన్నారు. భారీ మొత్తంలో ఇరాన్ డబ్బును, హర్మూజ్ జలసంధిని తమ నియంత్రణలోకి తీసుకున్నామని ట్రంప్ తన పోస్టులో రాశారు.

Source link