ప్రభన్యూస్

Hydrogen Train: దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలు సేవలు మొదలు.. ! సేఫ్టీ, సెక్యూరిటీ విషయంలో ఇదే మేలు |


Last Updated:

భారత రైల్వే చరిత్రలో సరికొత్త మైలురాయి నమోదైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్‌లో దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత ప్యాసింజర్ రైలును జెండా ఊపి అధికారికంగా ప్రారంభించారు.

News18
News18

భారత రైల్వే చరిత్రలో సరికొత్త విప్లవం మొదలైంది. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్‌లో దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత ప్యాసింజర్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ విజయంతో ప్రపంచంలోనే హైడ్రోజన్ రైళ్లు నడుపుతున్న కొన్ని ప్రత్యేక దేశాల జాబితాలో భారతదేశం చేరింది. పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో రూపొందిన ఈ రైలు పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది జింద్ – సోనిపట్ మధ్య ఉన్న 89 కిలోమీటర్ల మార్గంలో ప్రయాణిస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర హైడ్రోజన్ రైళ్లతో పోలిస్తే ఇది చాలా పొడవైనది. ఇందులో 10 కోచ్‌లు ఉన్నాయి, దాదాపు 2,600 మంది ప్రయాణికులు కూర్చోవచ్చు. ఈ రైలు గరిష్టంగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా 3,200 హార్స్‌పవర్ సామర్థ్యంతో డిజైన్ చేశారు.

ఈ రైలు డీజిల్, విద్యుత్ తీగలతో పనిలేకుండా తన సొంతంగా విద్యుత్‌ను తయారు చేసుకుంటుంది. ఇందులో అమర్చిన ప్రోటాన్ ఎక్స్ఛేంజ్ మెంబ్రేన్ (PEM) ఫ్యూయల్ సెల్ ద్వారా హైడ్రోజన్, గాలిలోని ఆక్సిజన్ కలిసి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల పొగ రాదు, కేవలం నీటి ఆవిరి, వేడి మాత్రమే బయటకు వస్తాయి. ఈ రైలు కోసం జింద్‌లో దేశంలోనే అతిపెద్ద రైల్వే హైడ్రోజన్ రీఫ్యూయలింగ్ కేంద్రాన్ని నిర్మించారు. నీటి నుండి హైడ్రోజన్‌ను వేరు చేసి 500 బార్ ఒత్తిడితో నిల్వ చేస్తారు.

ప్రయాణికుల భద్రత కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన కఠినమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. రైలులో హైడ్రోజన్ లీక్ డిటెక్టర్లు, ఫ్లేమ్ డిటెక్టర్లు, ఆటోమేటిక్ షట్‌డౌన్ సిస్టమ్స్ ఏర్పాటు చేశారు. జర్మనీకి చెందిన ‘TÜV SÜD’ సంస్థ దీనికి భద్రతా ధృవీకరణ ఇచ్చింది. బ్రేకింగ్ సిస్టమ్, రైడ్ స్టెబిలిటీ పరీక్షలు పూర్తయ్యాకే దీనికి అనుమతి లభించింది. వంద శాతం రైల్వే విద్యుద్దీకరణ దిశగా సాగుతున్న భారత్‌కు ఈ క్లీన్ ఎనర్జీ రైలు ఒక మైలురాయిగా నిలుస్తుంది.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 18 July 2026, 11:47 am Digital Edition : Prabhanews
Hydrogen Train: దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలు సేవలు మొదలు.. ! సేఫ్టీ, సెక్యూరిటీ విషయంలో ఇదే మేలు |

Last Updated:Jul 17, 2026 12:04 PM ISTభారత రైల్వే చరిత్రలో సరికొత్త మైలురాయి నమోదైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్‌లో దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత ప్యాసింజర్ రైలును జెండా ఊపి అధికారికంగా ప్రారంభించారు.News18భారత రైల్వే చరిత్రలో సరికొత్త విప్లవం మొదలైంది. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్‌లో దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత ప్యాసింజర్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ విజయంతో ప్రపంచంలోనే హైడ్రోజన్ రైళ్లు నడుపుతున్న కొన్ని ప్రత్యేక దేశాల జాబితాలో భారతదేశం చేరింది. పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో రూపొందిన ఈ రైలు పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది జింద్ - సోనిపట్ మధ్య ఉన్న 89 కిలోమీటర్ల మార్గంలో ప్రయాణిస్తుంది.ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర హైడ్రోజన్ రైళ్లతో పోలిస్తే ఇది చాలా పొడవైనది. ఇందులో 10 కోచ్‌లు ఉన్నాయి, దాదాపు 2,600 మంది ప్రయాణికులు కూర్చోవచ్చు. ఈ రైలు గరిష్టంగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా 3,200 హార్స్‌పవర్ సామర్థ్యంతో డిజైన్ చేశారు.ఈ రైలు డీజిల్, విద్యుత్ తీగలతో పనిలేకుండా తన సొంతంగా విద్యుత్‌ను తయారు చేసుకుంటుంది. ఇందులో అమర్చిన ప్రోటాన్ ఎక్స్ఛేంజ్ మెంబ్రేన్ (PEM) ఫ్యూయల్ సెల్ ద్వారా హైడ్రోజన్, గాలిలోని ఆక్సిజన్ కలిసి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల పొగ రాదు, కేవలం నీటి ఆవిరి, వేడి మాత్రమే బయటకు వస్తాయి. ఈ రైలు కోసం జింద్‌లో దేశంలోనే అతిపెద్ద రైల్వే హైడ్రోజన్ రీఫ్యూయలింగ్ కేంద్రాన్ని నిర్మించారు. నీటి నుండి హైడ్రోజన్‌ను వేరు చేసి 500 బార్ ఒత్తిడితో నిల్వ చేస్తారు.ప్రయాణికుల భద్రత కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన కఠినమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. రైలులో హైడ్రోజన్ లీక్ డిటెక్టర్లు, ఫ్లేమ్ డిటెక్టర్లు, ఆటోమేటిక్ షట్‌డౌన్ సిస్టమ్స్ ఏర్పాటు చేశారు. జర్మనీకి చెందిన 'TÜV SÜD' సంస్థ దీనికి భద్రతా ధృవీకరణ ఇచ్చింది. బ్రేకింగ్ సిస్టమ్, రైడ్ స్టెబిలిటీ పరీక్షలు పూర్తయ్యాకే దీనికి అనుమతి లభించింది. వంద శాతం రైల్వే విద్యుద్దీకరణ దిశగా సాగుతున్న భారత్‌కు ఈ క్లీన్ ఎనర్జీ రైలు ఒక మైలురాయిగా నిలుస్తుంది.Click here to add News18 as your preferred news source on Google. బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.Location :Hyderabad,TelanganaFirst Published :Jul 17, 2026 12:02 PM ISTమరింత చదవండి

Source link