ప్రభన్యూస్

Ramayana Yash Dubbing: రావణుడి పాత్రకు డబ్బింగ్ చెప్పడానికి చుక్కలు కనిపించాయ్.. శరద్ కేల్కర్ షాకింగ్ కామెంట్స్! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

Ramayana Yash Dubbing: ‘రామాయణ’ సినిమాలో యష్ పోషించిన రావణుడి పాత్రకు హిందీలో డబ్బింగ్ చెప్పిన శరద్ కేల్కర్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

News18
News18

Ramayana Yash Ravana Dubbing: భారతీయ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విజువల్ వండర్ ‘రామాయణ’. నితీష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా, కన్నడ రాకింగ్ స్టార్ యష్ రావణుడిగా నటించిన ఈ భారీ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టిస్తోంది. అయితే హిందీ వెర్షన్‌లో యష్ పోషించిన రావణాసురుడి పాత్రకు ప్రముఖ నటుడు, ‘బాహుబలి’ ఫేమ్ వాయిస్ ఆర్టిస్ట్ శరద్ కేల్కర్ డబ్బింగ్ చెప్పారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన శరద్ కేల్కర్.. యష్ పాత్రకు డబ్బింగ్ చెప్పడం తన కెరీర్‌లోనే అత్యంత కష్టతరమైన అనుభవమని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు ఆయన ఎందుకు అంత ఇబ్బంది పడ్డారో ఇప్పుడు చూద్దాం!

యష్ కన్నడ యాస వల్లే డబ్బింగ్ అవసరం పడింది: యష్ పాత్రకు తనే ఎందుకు డబ్బింగ్ చెప్పాల్సి వచ్చిందో శరద్ కేల్కర్ క్లారిటీ ఇచ్చారు. “యష్ హిందీ బాగానే మాట్లాడతారు. కానీ ఆయన మాతృభాష కన్నడ కావడం వల్ల, హిందీ పదాలు పలికేటప్పుడు కాస్త కన్నడ యాస, రిథమ్ లో తేడా కనిపించింది. రావణుడి లాంటి పవర్‌ఫుల్ పాత్రకు పర్ఫెక్ట్ హిందీ డిక్షన్ ఉండాలని డైరెక్టర్ నితీష్ తివారీ టీమ్ భావించింది. అందుకే హిందీ వెర్షన్‌కు నన్ను డబ్బింగ్ చెప్పమని అడిగారు. కన్నడలో మాత్రం యష్ తన సొంత గొంతుతో అద్భుతంగా డబ్బింగ్ చెప్పుకున్నారు” అని శరద్ తెలిపారు.

కెరీర్‌లోనే అత్యంత అలసిపోయిన డబ్బింగ్ ఇదే! రావణుడి పాత్రకు వాయిస్ ఇవ్వడం అస్సలు సులభం కాలేదని శరద్ కేల్కర్ చెప్పుకొచ్చారు:

అసాధారణ నటన: “యష్ రావణుడి పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. ఆయన కెరీర్‌లోనే ఇది అత్యంత కష్టమైన పాత్ర. అంతటి ఇంటెన్స్ యాక్టింగ్‌కు తగ్గట్టుగా నా గొంతును మ్యాచ్ చేయడానికి చాలా కష్టపడ్డాను. నా కెరీర్‌లోనే అత్యంత అలసిపోయిన డబ్బింగ్ సెషన్స్ ఇవే.”

పది తలలతో మాట్లాడే సీన్ హైలైట్: “రావణుడు చాలా తెలివైనవాడు, ఎక్కడా తడబాటు లేని వాడు. కానీ యుద్ధానికి వెళ్లాలా వద్దా అని తన పది తలలతో చర్చించుకునే ఒక సన్నివేశంలో మాత్రమే కాస్త సందేహంతో కనిపిస్తాడు. ఆ సీన్‌లో యష్ నటన, నితీష్ తివారీ టేకింగ్ నాకు బాగా నచ్చాయి” అని ప్రశంసించారు.

యష్ సలహాలతో మరింత అద్భుతంగా.. డబ్బింగ్ సమయంలో యష్ తనతో ఎంతో స్నేహపూర్వకంగా ఉంటూ ఎన్నో సలహాలు ఇచ్చారని శరద్ గుర్తుచేసుకున్నారు. కొన్ని సన్నివేశాలను మరింత బెటర్‌గా ఎలా చేయవచ్చో ఇద్దరం కలిసి చర్చించుకుని పూర్తి చేశామని తెలిపారు. గతంలో ‘బాహుబలి’, ‘సలార్’ చిత్రాల్లో ప్రభాస్‌కు హిందీ వాయిస్ అందించిన శరద్ కేల్కర్.. ఇప్పుడు రావణుడి పాత్రకు కూడా తన గంభీరమైన గొంతుతో ప్రాణం పోశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 12 November 2026, 6:47 pm Digital Edition : Prabhanews
Ramayana Yash Dubbing: రావణుడి పాత్రకు డబ్బింగ్ చెప్పడానికి చుక్కలు కనిపించాయ్.. శరద్ కేల్కర్ షాకింగ్ కామెంట్స్! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Nov 12, 2026 6:34 PM ISTRamayana Yash Dubbing: 'రామాయణ' సినిమాలో యష్ పోషించిన రావణుడి పాత్రకు హిందీలో డబ్బింగ్ చెప్పిన శరద్ కేల్కర్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.News18Ramayana Yash Ravana Dubbing: భారతీయ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విజువల్ వండర్ ‘రామాయణ’. నితీష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా, కన్నడ రాకింగ్ స్టార్ యష్ రావణుడిగా నటించిన ఈ భారీ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టిస్తోంది. అయితే హిందీ వెర్షన్‌లో యష్ పోషించిన రావణాసురుడి పాత్రకు ప్రముఖ నటుడు, 'బాహుబలి' ఫేమ్ వాయిస్ ఆర్టిస్ట్ శరద్ కేల్కర్ డబ్బింగ్ చెప్పారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన శరద్ కేల్కర్.. యష్ పాత్రకు డబ్బింగ్ చెప్పడం తన కెరీర్‌లోనే అత్యంత కష్టతరమైన అనుభవమని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు ఆయన ఎందుకు అంత ఇబ్బంది పడ్డారో ఇప్పుడు చూద్దాం!యష్ కన్నడ యాస వల్లే డబ్బింగ్ అవసరం పడింది: యష్ పాత్రకు తనే ఎందుకు డబ్బింగ్ చెప్పాల్సి వచ్చిందో శరద్ కేల్కర్ క్లారిటీ ఇచ్చారు. "యష్ హిందీ బాగానే మాట్లాడతారు. కానీ ఆయన మాతృభాష కన్నడ కావడం వల్ల, హిందీ పదాలు పలికేటప్పుడు కాస్త కన్నడ యాస, రిథమ్ లో తేడా కనిపించింది. రావణుడి లాంటి పవర్‌ఫుల్ పాత్రకు పర్ఫెక్ట్ హిందీ డిక్షన్ ఉండాలని డైరెక్టర్ నితీష్ తివారీ టీమ్ భావించింది. అందుకే హిందీ వెర్షన్‌కు నన్ను డబ్బింగ్ చెప్పమని అడిగారు. కన్నడలో మాత్రం యష్ తన సొంత గొంతుతో అద్భుతంగా డబ్బింగ్ చెప్పుకున్నారు" అని శరద్ తెలిపారు.కెరీర్‌లోనే అత్యంత అలసిపోయిన డబ్బింగ్ ఇదే! రావణుడి పాత్రకు వాయిస్ ఇవ్వడం అస్సలు సులభం కాలేదని శరద్ కేల్కర్ చెప్పుకొచ్చారు:అసాధారణ నటన: "యష్ రావణుడి పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. ఆయన కెరీర్‌లోనే ఇది అత్యంత కష్టమైన పాత్ర. అంతటి ఇంటెన్స్ యాక్టింగ్‌కు తగ్గట్టుగా నా గొంతును మ్యాచ్ చేయడానికి చాలా కష్టపడ్డాను. నా కెరీర్‌లోనే అత్యంత అలసిపోయిన డబ్బింగ్ సెషన్స్ ఇవే."పది తలలతో మాట్లాడే సీన్ హైలైట్: "రావణుడు చాలా తెలివైనవాడు, ఎక్కడా తడబాటు లేని వాడు. కానీ యుద్ధానికి వెళ్లాలా వద్దా అని తన పది తలలతో చర్చించుకునే ఒక సన్నివేశంలో మాత్రమే కాస్త సందేహంతో కనిపిస్తాడు. ఆ సీన్‌లో యష్ నటన, నితీష్ తివారీ టేకింగ్ నాకు బాగా నచ్చాయి" అని ప్రశంసించారు.యష్ సలహాలతో మరింత అద్భుతంగా.. డబ్బింగ్ సమయంలో యష్ తనతో ఎంతో స్నేహపూర్వకంగా ఉంటూ ఎన్నో సలహాలు ఇచ్చారని శరద్ గుర్తుచేసుకున్నారు. కొన్ని సన్నివేశాలను మరింత బెటర్‌గా ఎలా చేయవచ్చో ఇద్దరం కలిసి చర్చించుకుని పూర్తి చేశామని తెలిపారు. గతంలో 'బాహుబలి', 'సలార్' చిత్రాల్లో ప్రభాస్‌కు హిందీ వాయిస్ అందించిన శరద్ కేల్కర్.. ఇప్పుడు రావణుడి పాత్రకు కూడా తన గంభీరమైన గొంతుతో ప్రాణం పోశారు.మరింత చదవండి

Source link