Last Updated:
పిల్లలందరూ కలిసి చూసే ఓ మంచి సినిమా ఈ మధ్య కాలంలో రాలేదు. పిల్లల కోసం మంచి సందేశం ఇచ్చేలా ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ మూవీని తెరకెక్కించారు అని టాలీవుడ్ సీనియర్ నటుడు తణికెళ్ల భరణి అన్నారు.
నమో జయం ప్రొడక్షన్స్ బ్యానర్ పై దివ్య ప్రవీణ్ బొలిశెట్టి నిర్మాణంలో జాతీయ అవార్డు గ్రహీత నవీన్ దేశబోయిన తెరకెక్కించిన చిత్రం ‘జయంత్ అండ్ ది జింగో పెన్’. ఈ సినిమాలో మాస్టర్ జయంత్ బొలిశెట్టి, మన శంకర వర ప్రసాద్ ఫేమ్ ఊహా రెడ్డి, సత్యం రాజేష్, ఆశిష్ గాంధీ, మానస రాధాకృష్ణన్, తనికెళ్ల భరణి, కాశీ విశ్వనాథ్, మానిక్ రెడ్డి, అశోక్ కుమార్, శ్రీకాంత్ రెడ్డి, తెలుగు ఎక్స్పరిమెంట్స్ సాయి కృష్ణ తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. బాలల దినోత్సవం సందర్భంగా ఈ మూవీని నవంబర్ 14న విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు.
‘పిల్లలందరూ కలిసి చూసే ఓ మంచి సినిమా ఈ మధ్య కాలంలో రాలేదు. పిల్లల కోసం మంచి సందేశం ఇచ్చేలా ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ మూవీని తెరకెక్కించారు. దివ్య గారు, ప్రవీణ్ గారు ఈ మూవీని గొప్పగా నిర్మించారు. జయంత్ అద్భుతమైన కుర్రాడు. పిల్లాడికి బంగారు భవిష్యత్తు ఉంది. రానున్న కాలంలో మంచి నటుడు అవుతాడని కచ్చితంగా చెప్పగలను. మంచి సందేశంతో నవీన్ ఈ మూవీని తెరకెక్కించారు. ఇలాంటి మంచి చిత్రం కచ్చితంగా విజయం అవ్వాలి.. కచ్చితంగా సక్సెస్ అవుతుంది’ అంటూ ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని తెలిపారు తణికెళ్ల భరణి.
‘పిల్లలతో చేసే మంచి చిత్రాలు ఎప్పుడూ సక్సెస్ అవుతాయి. ఈ సినిమాలో జయంత్ గొప్పగా నటించాడని అర్థం అవుతోంది. ప్రవీణ్ గారు మల్టీటాలెంటెడ్‌గా కనిపిస్తున్నారు. నవీన్ గారు ఈ మూవీని గొప్పగా తెరకెక్కించినట్టు అనిపిస్తోంది. ఒకప్పుడు మన దగ్గర ఏడాదికి యాభైకి పైగా పిల్లల చిత్రాలు వస్తుండేవి. ఇలాంటి మంచి సినిమాల్ని అందరూ ఆదరించాలి’ అని కేఎల్ దామోదర్ ప్రసాద్ అన్నారు.
‘‘జయంత్ అండ్ ది జింగో పెన్’ లాంటి చిత్రాన్ని నిర్మించడం గొప్ప విషయం. పిల్లల కోసం మంచి సందేశంతో సినిమాని నిర్మించిన ప్రవీణ్ గారికి ధన్యవాదాలు. నేను లెక్కల మాస్టారుగా పని చేశాను. ఇలాంటి మంచి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఇలాంటి మంచి మూవీని పిల్లలు, పేరెంట్స్, టీచర్స్ ఇలా అందరూ చూడాలి. పిల్లల్లో ఉండే ప్రత్యేకమైన ప్రతిభను గుర్తించి వాటికి తగ్గట్టుగా మార్గదర్శకం చేయాలి. ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి అన్నారు.
‘‘జయంత్ అండ్ ది జింగో పెన్’ ఎమోషనల్ స్టోరీ. ఇలాంటి మంచి చిత్రాన్ని అందరూ చూసి సపోర్ట్ చేయాలి. చిల్డ్రెన్స్ డే స్పెషల్‌గా నవంబర్ 14న మా సినిమా రాబోతోంది’ అని నిర్మాత దివ్య ప్రవీణ్ బొలిశెట్టి అన్నారు. ‘‘జయంత్ అండ్ ది జింగో పెన్’ చిత్రంలో ట్యూన్స్, డైలాగ్స్, పాటలు రాసే అవకాశం రావడం నా అదృష్టం. మాకు మంచి సంగీతాన్ని అందించిన మోహిత్ గారికి, మంచి విజువల్స్ ఇచ్చిన కెమెరామెన్ ఆండ్రూ గారికి థాంక్స్. మలయాళం నుంచి రీమేక్ రైట్స్ తీసుకుని.. ఈ సినిమాని ఇక్కడకు వరకు తీసుకు వచ్చే క్రమంలో సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఇదొక మంచి మ్యూజికల్, మెసెజ్ ఓరియెంటెడ్ బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలుస్తుందని ఆశిస్తున్నాను. మా సినిమాని రిలీజ్ చేస్తున్న ఏషియన్ సురేష్ గారికి థాంక్స్. బాలల దినోత్సవం సందర్భంగా మా మూవీ నవంబర్ 14న రాబోతోంది. అందరూ తప్పకుండా చూడండి’ అని ప్రవీణ్ బొలిశెట్టి అన్నారు.
‘‘జయంత్ అండ్ ది జింగో పెన్’ చిత్రంలో నేను ఒక డిఫరెంట్ పాత్రను పోషించాను. జయంత్‌కి మంచి భవిష్యత్ ఉంది. ఇందులో సాంగ్స్ ఎంతో ఫ్రెష్‌గా ఉంటాయి. బాలల దినోత్సవం సందర్భంగా నవంబర్ 14న ఈ చిత్రం రాబోతోంది. హిందీలో ‘తారే జమీన్ పర్’ ఉంది.. తెలుగులో ఇకపై ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ ఉంటుంది. ఇలాంటి చిత్రాలు చాలా అరుదుగా వస్తుంటాయి. పిల్లలు, పేరెంట్స్ అందరూ కలిసి ఈ సినిమాని చూడండి’ అని ఆశిష్ గాంధీ అన్నారు.
దర్శకుడు నవీన్ దేశబోయిన తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ ‘‘జయంత్ అండ్ ది జింగో పెన్’ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్‌లో దివ్య గారు, ప్రవీణ్ గారు ఎంతో సహకరించారు. ఈ మధ్య పిల్లలకు సంబంధించిన చిత్రాలు రావడం లేదు. జయంత్ గొప్ప ఆర్టిస్ట్. ఎంత పెద్ద డైలాగ్ అయినా సరే సింగిల్ టేక్‌లో చెప్పేస్తుంటాడు. డైలాగ్ డెలివరీ, డిక్షన్‌లోనూ వేరియేషన్స్ చూపిస్తుంటాడు. మోహిత్ మంచి మ్యూజిక్ అందించాడు. ఈ చిత్రంలో ప్రవీణ్ గారి సాహిత్యం, బాణీ, మాటలు గొప్పగా ఉంటాయి. సినిమాకి యాభై శాతం క్రెడిట్ నాది, మిగతా యాభై శాతం ప్రవీణ్ గారిదే. ఇలాంటి మంచి సినిమాల్ని ప్రోత్సహించడం మన అందరి సామాజిక బాధ్యత’ అని అన్నారు.
‘‘జయంత్ అండ్ ది జింగో పెన్’ చిత్రంతో నన్ను తెరపైకి తీసుకు వస్తున్న మా తల్లిదండ్రులకు థాంక్స్. ఇంత మంచి అవకాశం ఇచ్చిన నవీన్ అన్నకి థాంక్స్. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఈ మూవీలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. పిల్లలు, టీచర్స్, పేరెంట్స్ అందరూ తప్పకుండా ఈ సినిమాని చూడాలి. చిల్డ్రెన్స్ డే స్పెషల్‌గా నవంబర్ 14న మా మూవీని రిలీజ్ చేస్తున్నాం. అందరూ మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు. బేబీ ఊహ మాట్లాడుతూ .. ‘‘జయంత్ అండ్ ది జింగో పెన్’ చిత్రంలో అవకాశం ఇచ్చిన దివ్య గారు, ప్రవీణ్ గారికి థాంక్స్. మా సినిమా నవంబర్ 14న రాబోతోంది. అందరూ తప్పకుండా చూండి’ అని మాస్టర్ జయంత్ అన్నారు.

