బంగారం, వెండి అంటే వెంటనే మనకు గుర్తొచ్చేది ఆభరణాలే. కానీ ఈ విలువైన లోహాలు కేవలం నగలకే పరిమితం కాలేదు. మనం రోజూ ఉపయోగించే మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల్లోనూ కొద్దిమొత్తంలో బంగారం, వెండి ఉంటాయి. అంతేకాదు.. కొన్ని వైద్య పరికరాలు, ప్రత్యేక గృహోపకరణాలు, సోలార్ ప్యానెల్స్ తయారీలోనూ వీటిని ఉపయోగిస్తారు. మీ ఇంట్లో పాడైపోయిన ఎలక్ట్రానిక్ వస్తువుల్లో కూడా ఈ విలువైన లోహాలు ఉండవచ్చు. బంగారాన్ని ఆభరణాల తయారీకే కాకుండా ఎలక్ట్రానిక్స్ రంగంలోనూ విస్తృతంగా ఉపయోగిస్తారు. విద్యుత్‌ను ప్రసారం చేయగలగడం, తుప్పు పట్టకుండా ఉండటం వంటి లక్షణాల కారణంగా ఎలక్ట్రానిక్ పరికరాల్లోని కొన్ని కనెక్టర్లు, కాంటాక్టులు, సర్క్యూట్ బోర్డుల భాగాలకు బంగారాన్ని ఉపయోగిస్తారు. ముఖ్యంగా కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల మదర్‌బోర్డులు, ప్రాసెసర్లు, ర్యామ్ కనెక్టర్లు, ఇతర ఎలక్ట్రానిక్ కనెక్షన్లలో బంగారం ఉండవచ్చు. అయితే పరికరం మోడల్, తయారీ సంవత్సరం, ఉపయోగించిన విడిభాగాలను బట్టి బంగారం పరిమాణం మారుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)

