ప్రభన్యూస్

Rajanna Siricilla: రాజన్న ఆలయానికి కొత్త రూపు.. మరో వెయ్యేళ్లు నిలిచేలా భారీ నిర్మాణ పనులు..! | తెలంగాణ వార్తలు


శనివారం వేములవాడలో రాజన్న ఆలయంతో పాటు బద్ది పోచమ్మ ఆలయ విస్తరణ పనులను ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ కలిసి పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులు మరింత వేగంగా పూర్తి చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. శృంగేరి పీఠం సూచనలు, ఆగమశాస్త్రం ప్రకారం ఆలయ విస్తరణ జరుగుతోందన్నారు. ప్రతి పనికి ప్రత్యేక గడువు నిర్ణయించి ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి, ఇతర మంత్రుల సహకారంతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వివరించారు.

ప్రస్తుతం అనిమిటి మండపం పరిధిలో అద్దాల మండపం, బ్రాహ్మణ సత్రం, నిత్య అన్నదాన సత్రం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. మరో వెయ్యేళ్లు నిలిచేలా రాజన్న ఆలయాన్ని శిలలతో, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నిర్మిస్తున్నామని చెప్పారు. ఆలయంలోని అంతరాలయానికి ఎలాంటి మార్పులు ఉండవని, ప్రాచీన వైభవం అలాగే కొనసాగుతుందని స్పష్టం చేశారు.

పనులు పూర్తయ్యాక భక్తులకు మరింత విశాలమైన దర్శన సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. ఆలయ అభివృద్ధితో పాటు వేములవాడ పట్టణాన్ని కూడా సమాంతరంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. రూ.47 కోట్లతో రోడ్ల విస్తరణ పనులు, రూ.6 కోట్లతో వంతెన నిర్మాణం కొనసాగుతున్నట్లు వెల్లడించారు.

రాజన్న ఆలయానికి అనుబంధంగా ఉన్న బద్ది పోచమ్మ ఆలయ అభివృద్ధికి రూ.20 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అలాగే నాంపల్లి గుట్టను ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే పనులు కూడా జరుగుతున్నాయని చెప్పారు. ఇప్పటికే అక్కడ ఎయిర్ ఫోర్స్ విమానాన్ని ఏర్పాటు చేశామని, భవిష్యత్తులో మరిన్ని ఆకర్షణలు తీసుకొస్తామని వెల్లడించారు.

భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణంలో అన్ని సౌకర్యాలు అందించాలన్న లక్ష్యంతో ఈ అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సంప్రదాయానికి ఎలాంటి భంగం కలగకుండా ఆధునిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.

దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ మాట్లాడుతూ.. ఆలయ విస్తరణ పనులను ప్రత్యక్షంగా పరిశీలించామని తెలిపారు. వచ్చే ఏడాదిలోగా ప్రధాన నిర్మాణ పనులు పూర్తి చేసి భక్తులకు మెరుగైన దర్శన సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు మరిన్ని అభివృద్ధి పనులకు కూడా అంచనాలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు.

ప్రస్తుతం నిర్మాణ పనుల కారణంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భీమేశ్వర ఆలయం ద్వారా ఆర్జిత సేవలు, దర్శన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. పనులు మరింత వేగంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు ఆదేశాలు ఇచ్చామని, ప్రస్తుతం దాదాపు 40 శాతం నిర్మాణం పూర్తైందని వెల్లడించారు.

రాజన్న ఆలయ విస్తరణ పూర్తయితే దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు మరింత సౌకర్యవంతమైన దర్శనం లభించడమే కాకుండా, వేములవాడ ఆధ్యాత్మిక, పర్యాటక రంగాల్లో మరింత గుర్తింపు పొందే అవకాశాలు ఉన్నాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 29 June 2026, 8:01 am Digital Edition : Prabhanews
Rajanna Siricilla: రాజన్న ఆలయానికి కొత్త రూపు.. మరో వెయ్యేళ్లు నిలిచేలా భారీ నిర్మాణ పనులు..! | తెలంగాణ వార్తలు

శనివారం వేములవాడలో రాజన్న ఆలయంతో పాటు బద్ది పోచమ్మ ఆలయ విస్తరణ పనులను ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ కలిసి పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులు మరింత వేగంగా పూర్తి చేయాలని సూచించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. శృంగేరి పీఠం సూచనలు, ఆగమశాస్త్రం ప్రకారం ఆలయ విస్తరణ జరుగుతోందన్నారు. ప్రతి పనికి ప్రత్యేక గడువు నిర్ణయించి ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి, ఇతర మంత్రుల సహకారంతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వివరించారు.ప్రస్తుతం అనిమిటి మండపం పరిధిలో అద్దాల మండపం, బ్రాహ్మణ సత్రం, నిత్య అన్నదాన సత్రం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. మరో వెయ్యేళ్లు నిలిచేలా రాజన్న ఆలయాన్ని శిలలతో, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నిర్మిస్తున్నామని చెప్పారు. ఆలయంలోని అంతరాలయానికి ఎలాంటి మార్పులు ఉండవని, ప్రాచీన వైభవం అలాగే కొనసాగుతుందని స్పష్టం చేశారు.పనులు పూర్తయ్యాక భక్తులకు మరింత విశాలమైన దర్శన సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. ఆలయ అభివృద్ధితో పాటు వేములవాడ పట్టణాన్ని కూడా సమాంతరంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. రూ.47 కోట్లతో రోడ్ల విస్తరణ పనులు, రూ.6 కోట్లతో వంతెన నిర్మాణం కొనసాగుతున్నట్లు వెల్లడించారు.రాజన్న ఆలయానికి అనుబంధంగా ఉన్న బద్ది పోచమ్మ ఆలయ అభివృద్ధికి రూ.20 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అలాగే నాంపల్లి గుట్టను ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే పనులు కూడా జరుగుతున్నాయని చెప్పారు. ఇప్పటికే అక్కడ ఎయిర్ ఫోర్స్ విమానాన్ని ఏర్పాటు చేశామని, భవిష్యత్తులో మరిన్ని ఆకర్షణలు తీసుకొస్తామని వెల్లడించారు.భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణంలో అన్ని సౌకర్యాలు అందించాలన్న లక్ష్యంతో ఈ అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సంప్రదాయానికి ఎలాంటి భంగం కలగకుండా ఆధునిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ మాట్లాడుతూ.. ఆలయ విస్తరణ పనులను ప్రత్యక్షంగా పరిశీలించామని తెలిపారు. వచ్చే ఏడాదిలోగా ప్రధాన నిర్మాణ పనులు పూర్తి చేసి భక్తులకు మెరుగైన దర్శన సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు మరిన్ని అభివృద్ధి పనులకు కూడా అంచనాలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు.ప్రస్తుతం నిర్మాణ పనుల కారణంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భీమేశ్వర ఆలయం ద్వారా ఆర్జిత సేవలు, దర్శన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. పనులు మరింత వేగంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు ఆదేశాలు ఇచ్చామని, ప్రస్తుతం దాదాపు 40 శాతం నిర్మాణం పూర్తైందని వెల్లడించారు.రాజన్న ఆలయ విస్తరణ పూర్తయితే దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు మరింత సౌకర్యవంతమైన దర్శనం లభించడమే కాకుండా, వేములవాడ ఆధ్యాత్మిక, పర్యాటక రంగాల్లో మరింత గుర్తింపు పొందే అవకాశాలు ఉన్నాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

Source link