పర్సనల్ లోన్ తీసుకోవాలనుకునే వారికి పైసాబజార్ కీలకమైన అప్‌డేట్ ఇచ్చింది. తన ఇన్‌స్టంట్ పర్సనల్ లోన్ ప్రోగ్రామ్‌ను మరింత బలోపేతం చేసింది. ఇందులో భాగంగా మొత్తం 18 బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీంతో అర్హత ఉన్న కస్టమర్లు కేవలం రెండు గంటల్లోనే పర్సనల్ లోన్ డబ్బులు తమ అకౌంట్‌లో పొందే అవకాశం కల్పిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, యెస్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్, పూనావాలా ఫిన్‌కార్ప్, ఫెడరల్ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, టాటా క్యాపిటల్, హీరో ఫిన్‌కార్ప్ వంటి ప్రముఖ సంస్థలు ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా ఉన్నాయి. వీటిలో ఆరు ప్రముఖ బ్యాంకులు కూడా ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)

