ఈ రోజుల్లో ఆధునిక ఇళ్లు, కార్యాలయాలు, హోటళ్లు, షాపింగ్ మాల్స్‌లోని వాష్‌రూమ్‌లలో ఫ్లష్ ట్యాంక్‌పై రెండు బటన్లు కనిపిస్తుంటాయి. ఒకటి చిన్నగా, మరొకటి పెద్దగా ఉంటుంది. అయితే ఈ రెండు బటన్లు ఎందుకు ఇచ్చారో చాలామందికి తెలియదు. కొందరు ఏదో ఒక బటన్ నొక్కేస్తుంటారు. మరికొందరు రెండింటినీ ఒకేసారి నొక్కుతుంటారు. కానీ ఈ చిన్న పొరపాటు వల్ల అవసరానికి మించి నీరు వృథా అయ్యే అవకాశం ఉంది. నిజానికి ఈ రెండు బటన్ల వెనుక నీటిని ఆదా చేసే ప్రత్యేక సాంకేతికత దాగి ఉంది. దీన్నే డ్యూయల్ ఫ్లష్ సిస్టమ్ అంటారు.

