ప్రభన్యూస్

Nvidia CEO: లక్షల కోట్ల కంపెనీకి బాస్.. అయినా ఆ బలహీనతతో చిక్కాడు.. ఇదేం పాడుబుద్ది సారూ! |


Last Updated:

Nvidia Ceo: గ్లోబల్ సెమీకండక్టర్ దిగ్గజం ‘ఎన్విడియా’ (Nvidia) వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) జెన్సన్ హువాంగ్‌ విదేశీ గూఢచర్య వలలో చిక్కుకున్నారనే వార్తలు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి.

ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్
ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్

బీజింగ్ తరఫున గూఢచర్యం చేస్తోందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న చైనా మహిళా వ్యాపారవేత్తతో ఆయన సంబంధాలపై తీవ్ర విమర్శలు, విచారణ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో, సమగ్ర అంశాలపై స్వతంత్ర విచారణ ప్రారంభించినట్లు ఎన్విడియా బోర్డు అధికారికంగా ప్రకటించింది. బయటి స్వతంత్ర న్యాయవాదుల సహకారంతో ఏర్పాటైన స్వతంత్ర డైరెక్టర్ల కమిటీ ఈ విచారణను పర్యవేక్షిస్తుందని కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది.

“ఎన్విడియా, దాని వాటాదారుల ప్రయోజనాలతో పాటు అమెరికా జాతీయ, ఆర్థిక భద్రతకే మా బోర్డు మొదటి ప్రాధాన్యత ఇస్తుంది. ఇప్పటివరకు మా వ్యాపార రహస్యాలు గానీ, అమెరికా జాతీయ భద్రత గానీ ప్రమాదంలో పడ్డాయని నమ్మేందుకు ఎలాంటి కారణం లేనప్పటికీ.. అందుబాటులో ఉన్న ప్రతి సమాచారాన్ని నిశితంగా పరిశీలించాలని బోర్డు నిర్ణయించింది” అని స్పష్టం చేసింది. ఈ విచారణకు జెన్సన్ హువాంగ్ పూర్తి మద్దతు ప్రకటించారని, సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొంది. అదే సమయంలో హువాంగ్ నాయకత్వంపై బోర్డు పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేసింది.

ఉద్యోగులకు క్షమాపణలు

అమెరికా నిఘా వర్గాలు చైనా ఇంటెలిజెన్స్ ఏజెంట్‌గా అనుమానిస్తున్న టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్‌తో వివాహేతర సంబంధం కొనసాగించినట్లు జెన్సన్ హువాంగ్ అంగీకరించారని ఫాక్స్ న్యూస్ కథనం వెలువరించిన వెంటనే బోర్డు ఈ విచారణ నిర్ణయాన్ని వెల్లడించింది. సంస్థ ఉద్యోగులకు పంపిన అంతర్గత సందేశంలో హువాంగ్ తన తప్పును ఒప్పుకుంటూ క్షమాపణలు చెప్పారు. “నేను నా భార్యకు ద్రోహం చేశాను. నా చర్యలు ఆమెను, మా పిల్లలను తీవ్రంగా బాధించాయి. నేను చేసిన పనికి ఎలాంటి సమర్థన లేదు” అని ఆయన ఆ సందేశంలో పేర్కొన్నారు.

ఫాక్స్ న్యూస్ నివేదిక ప్రకారం, ఆ మహిళను సింగపూర్ కేంద్రంగా నడిచే ‘మెగాస్పీడ్’ (Megaspeed) ఎగ్జిక్యూటివ్ ఆలిస్ హువాంగ్‌గా గుర్తించారు. ఆమె చైనా నిఘా విభాగంతో సంబంధాలు కలిగి ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, ట్రంప్ ప్రభుత్వ విధాన రూపకర్తల మధ్య పంచుకున్న అంతర్గత మెమోను ఉటంకిస్తూ.. చైనా మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ (MSS) ఆమెను గూఢచారిగా చేర్చుకుందని ‘ది న్యూయార్క్ టైమ్స్’ కథనాన్ని ప్రచురించింది.

వాషింగ్టన్‌లో రాజకీయ సెగ

చైనాకు అధునాతన సెమీకండక్టర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చిప్‌ల ఎగుమతిపై ఉన్న ఆంక్షలను సడలించాలని డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగాన్ని ఒప్పించేందుకు జెన్సన్ హువాంగ్ గత కొంతకాలంగా ప్రయత్నిస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో ఈ గూఢచర్య ఆరోపణలు తెరపైకి రావడం వాషింగ్టన్ రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపింది.

చైనా మహిళతో ఉన్న సంబంధాలు, భద్రతాపరమైన అంశాలపై వివరణ ఇవ్వాల్సిందిగా అమెరికా ప్రతినిధుల సభలోని ముగ్గురు రిపబ్లికన్ కమిటీ ఛైర్మన్లు హువాంగ్‌ను కోరారు. ఈ అంశంపై క్లోజ్డ్ డోర్ (రహస్య) సమావేశంలో వివరాలు వెల్లడించాలని వారు ఆదేశించారు. అయితే, ఈ ఆరోపణలను ఎన్విడియా ఖండిస్తూ.. ఇవన్నీ నిరాధారమైనవని పేర్కొంది. బోర్డు విచారణ ప్రారంభమైన నేపథ్యంలో టెక్ రంగంలో ఈ పరిణామాలు పెను ఆసక్తిని రేపుతున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 09 November 2026, 12:39 pm Digital Edition : Prabhanews
Nvidia CEO: లక్షల కోట్ల కంపెనీకి బాస్.. అయినా ఆ బలహీనతతో చిక్కాడు.. ఇదేం పాడుబుద్ది సారూ! |

Last Updated:Nov 09, 2026 12:32 PM ISTNvidia Ceo: గ్లోబల్ సెమీకండక్టర్ దిగ్గజం 'ఎన్విడియా' (Nvidia) వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) జెన్సన్ హువాంగ్‌ విదేశీ గూఢచర్య వలలో చిక్కుకున్నారనే వార్తలు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి.ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్బీజింగ్ తరఫున గూఢచర్యం చేస్తోందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న చైనా మహిళా వ్యాపారవేత్తతో ఆయన సంబంధాలపై తీవ్ర విమర్శలు, విచారణ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో, సమగ్ర అంశాలపై స్వతంత్ర విచారణ ప్రారంభించినట్లు ఎన్విడియా బోర్డు అధికారికంగా ప్రకటించింది. బయటి స్వతంత్ర న్యాయవాదుల సహకారంతో ఏర్పాటైన స్వతంత్ర డైరెక్టర్ల కమిటీ ఈ విచారణను పర్యవేక్షిస్తుందని కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది."ఎన్విడియా, దాని వాటాదారుల ప్రయోజనాలతో పాటు అమెరికా జాతీయ, ఆర్థిక భద్రతకే మా బోర్డు మొదటి ప్రాధాన్యత ఇస్తుంది. ఇప్పటివరకు మా వ్యాపార రహస్యాలు గానీ, అమెరికా జాతీయ భద్రత గానీ ప్రమాదంలో పడ్డాయని నమ్మేందుకు ఎలాంటి కారణం లేనప్పటికీ.. అందుబాటులో ఉన్న ప్రతి సమాచారాన్ని నిశితంగా పరిశీలించాలని బోర్డు నిర్ణయించింది" అని స్పష్టం చేసింది. ఈ విచారణకు జెన్సన్ హువాంగ్ పూర్తి మద్దతు ప్రకటించారని, సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొంది. అదే సమయంలో హువాంగ్ నాయకత్వంపై బోర్డు పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేసింది.ఉద్యోగులకు క్షమాపణలుఅమెరికా నిఘా వర్గాలు చైనా ఇంటెలిజెన్స్ ఏజెంట్‌గా అనుమానిస్తున్న టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్‌తో వివాహేతర సంబంధం కొనసాగించినట్లు జెన్సన్ హువాంగ్ అంగీకరించారని ఫాక్స్ న్యూస్ కథనం వెలువరించిన వెంటనే బోర్డు ఈ విచారణ నిర్ణయాన్ని వెల్లడించింది. సంస్థ ఉద్యోగులకు పంపిన అంతర్గత సందేశంలో హువాంగ్ తన తప్పును ఒప్పుకుంటూ క్షమాపణలు చెప్పారు. "నేను నా భార్యకు ద్రోహం చేశాను. నా చర్యలు ఆమెను, మా పిల్లలను తీవ్రంగా బాధించాయి. నేను చేసిన పనికి ఎలాంటి సమర్థన లేదు" అని ఆయన ఆ సందేశంలో పేర్కొన్నారు.ఫాక్స్ న్యూస్ నివేదిక ప్రకారం, ఆ మహిళను సింగపూర్ కేంద్రంగా నడిచే 'మెగాస్పీడ్' (Megaspeed) ఎగ్జిక్యూటివ్ ఆలిస్ హువాంగ్‌గా గుర్తించారు. ఆమె చైనా నిఘా విభాగంతో సంబంధాలు కలిగి ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, ట్రంప్ ప్రభుత్వ విధాన రూపకర్తల మధ్య పంచుకున్న అంతర్గత మెమోను ఉటంకిస్తూ.. చైనా మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ (MSS) ఆమెను గూఢచారిగా చేర్చుకుందని 'ది న్యూయార్క్ టైమ్స్' కథనాన్ని ప్రచురించింది.వాషింగ్టన్‌లో రాజకీయ సెగచైనాకు అధునాతన సెమీకండక్టర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చిప్‌ల ఎగుమతిపై ఉన్న ఆంక్షలను సడలించాలని డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగాన్ని ఒప్పించేందుకు జెన్సన్ హువాంగ్ గత కొంతకాలంగా ప్రయత్నిస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో ఈ గూఢచర్య ఆరోపణలు తెరపైకి రావడం వాషింగ్టన్ రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపింది.చైనా మహిళతో ఉన్న సంబంధాలు, భద్రతాపరమైన అంశాలపై వివరణ ఇవ్వాల్సిందిగా అమెరికా ప్రతినిధుల సభలోని ముగ్గురు రిపబ్లికన్ కమిటీ ఛైర్మన్లు హువాంగ్‌ను కోరారు. ఈ అంశంపై క్లోజ్డ్ డోర్ (రహస్య) సమావేశంలో వివరాలు వెల్లడించాలని వారు ఆదేశించారు. అయితే, ఈ ఆరోపణలను ఎన్విడియా ఖండిస్తూ.. ఇవన్నీ నిరాధారమైనవని పేర్కొంది. బోర్డు విచారణ ప్రారంభమైన నేపథ్యంలో టెక్ రంగంలో ఈ పరిణామాలు పెను ఆసక్తిని రేపుతున్నాయి.మరింత చదవండి

Source link