ప్రభన్యూస్

Top 10 News: నేటి టాప్ పది వార్తలు మీకోసం.. రెండు నిమిషాల్లో చదివేయండి | తెలంగాణ వార్తలు


ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ.. సీఆర్‌పీఎఫ్‌ జవాన్లతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంతర్గత శత్రువుల పట్ల భద్రతా బలగాలు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నక్సలిజం, ఉగ్రవాదంపై పోరులో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల త్యాగాలను గుర్తుచేసుకున్నారు. మావోయిస్టు తీవ్రవాదంపై దశాబ్దాల పోరులో సాధించిన విజయంతో ఈ దీపావళి ప్రత్యేకమైందని పేర్కొన్నారు. ఈ విజయం వెనుక భద్రతా బలగాలు, పోలీసుల త్యాగాలు, అంకితభావం ఉన్నాయని ప్రధాని కొనియాడారు. దేశప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

2.అయోధ్యలో కనులపండువగా దీపోత్సవం

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య నగరం దీపాల కాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోయింది. దీపావళి సందర్భంగా నిర్వహించిన పదో దీపోత్సవంలో సరయు నది తీరంలోని 56 ఘాట్‌లపై సుమారు 30 లక్షల ప్రమిదలను వెలిగించారు. రామ్‌లీలా ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, డ్రోన్‌, లేజర్‌ షోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకలకు ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌, గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ హాజరయ్యారు. అంతకుముందు నగరంలో నిర్వహించిన శోభాయాత్ర వైభవంగా సాగింది.

3. విచిత్ర వేషధారణతో కేటీఆర్ తిరుగుతున్నాడు

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. సొంత చెల్లెలు కవితనే ఇంటి నుంచి బయటకు గెంటేశారని ఆరోపిస్తూ, మహిళా సాధికారత గురించి మాట్లాడే అర్హత కేటీఆర్‌కు లేదన్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో స్వయం సహాయక సంఘాల మహిళలతో నిర్వహించిన సమ్మేళనంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.కేటీఆర్‌ గడ్డం పెంచుకుని వింత వేషధారణతో గ్రామాల్లో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. పదేళ్ల బీఆర్ఎస్‌ పాలనలో మహిళలకు చేసిన మేలేమిటో చెప్పాలని రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

4. మోదీ పాలనలో అంతా విధ్వంసమే

గత 12 ఏళ్ల మోదీ పాలనలో దేశ మౌలిక లక్షణాలు, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ సంస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయని కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోపించారు. ఈ నెల 10న విడుదల కానున్న తన ఆత్మకథ బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్ నేపథ్యంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం మారిన తర్వాత కూడా దేశ వ్యవస్థలను తిరిగి గాడిలో పెట్టేందుకు చాలా సమయం పడుతుందని అభిప్రాయపడ్డారు.

భారత ప్రజలు తిరిగి సుపరిపాలనను స్వాగతిస్తారని సోనియా గాంధీ ఆశాభావం వ్యక్తం చేశారు.

5. జ్ఞానేశ్‌‌కు పదవిలేకపోతే మోదీ పని అయిపోయినట్లే: దీప్కే

కేంద్రంలో ప్రభుత్వ మార్పునకు ప్రజలు సిద్ధంగా ఉండాలని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే పిలుపునిచ్చారు. 2029 లోక్‌సభ ఎన్నికల్లో మోదీ ప్రభుత్వం ఓటమి పాలవుతుందని ఆయన జోస్యం చెప్పారు. కొచ్చిన్‌లో సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌కు వ్యతిరేకంగా నిర్వహించిన నిరసన సభలో ప్రసంగిస్తూ, ఎన్నికల వ్యవస్థ స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా పనిచేయాలంటే ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నిసార్లు అరెస్టు చేసినా జాతీయ జెండాను ఎగురవేస్తూనే ఉంటానని దీప్కే స్పష్టం చేశారు. ఈ నిరసన ప్రదర్శనకు సినీనటుడు ప్రకాశ్‌రాజ్‌ నేతృత్వం వహించారు.

6.ఈ20.. 420గా మారింది

ఈ20 పెట్రోల్‌లో ఇథనాల్‌ శాతం ఎంత కలుపుతున్నారో కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేశారు. కర్ణాటకలో ఏడు జిల్లాల్లో సేకరించిన 14 నమూనాల్లో 11 నమూనాల్లో ఇథనాల్‌ శాతం 20కి మించి ఉందని, కొన్నింటిలో 30 శాతం దాటిందని ఈ20 కాస్త 420 అవుతోందని! ఆయన పేర్కొన్నారు. పెట్రోల్‌ బంకుల్లో ఇథనాల్‌ శాతాన్ని తెలిపే లేబుళ్లు లేకపోవడంపై ప్రశ్నించారు. అధిక ఇథనాల్‌ కలపడం వల్ల వాహనదారులు నష్టపోతున్నారని ఆరోపించారు. 20 శాతానికి మించి ఇథనాల్‌ కలుపుతున్న చమురు కంపెనీలపై చర్యలు ఎప్పుడు తీసుకుంటారని కేంద్రాన్ని ప్రశ్నిస్తూ, ఈ అంశంపై ప్రధాని మోదీతో బహిరంగ చర్చకు రాహుల్‌ గాంధీ సవాల్‌ విసిరారు.

7.అప్పట్లో సోషల్ మీడియా లేకపోవడం మా అదృష్టం

సోషల్ మీడియా ప్రస్తుత తరానికి అత్యంత క్రూరమైనదని, దాని ప్రభావం నుంచి తప్పించుకునే మార్గం లేదని హీరో అక్కినేని నాగార్జున వ్యాఖ్యానించారు. తమ రోజుల్లో సోషల్ మీడియా లేకపోవడం అదృష్టమని పేర్కొన్నారు. ‘ఇట్లు అర్జున’ సినిమా యువతరానికి బాగా నచ్చుతుందని అన్నారు. నాగార్జున సమర్పణలో మహేశ్ ఉప్పల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వెంకీ కుడుముల నిర్మించారు. ఇందులో అనీష్ హీరోగా నటించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు ప్రచారం కల్పిస్తున్న చిత్రబృందం.. నవంబర్ 13న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.

8.బాలీవుడ్‌, సౌత్ చిత్ర పరిశ్రమల మధ్య అదే తేడా

దక్షిణాది, హిందీ చిత్ర పరిశ్రమల మధ్య ఉన్న పని విధానాల్లో తేడాలను వివరించారు నటి కీర్తి సురేశ్‌. బాలీవుడ్‌లో సినిమా నిర్మాణానికి ముందు ప్రీ ప్రొడక్షన్‌కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారని, దక్షిణాది చిత్ర పరిశ్రమలో మాత్రం పనితీరు మరింత సహజంగా, స్పాంటేనియస్‌గా సాగుతుందని కీర్తి సురేశ్‌ తెలిపారు. బాలీవుడ్‌లో స్క్రిప్ట్ రీడింగ్స్‌, నటీనటులకు శిక్షణ, పరస్పర సమన్వయం వంటి ప్రీ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం కేటాయిస్తారని తెలిపారు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో మాత్రం సహజత్వానికి ప్రాధాన్యత ఉంటుందని, కొన్నిసార్లు షూటింగ్ రోజే సహనటులను కలుస్తామని చెప్పారు.

9.అవార్డు అందుకున్నాడు.. వెంటనే ఇచ్చేశాడు

టీమిండియా బ్యాటర్ కేఎల్‌ రాహుల్‌ మైదానంలోనే కాకుండా బయట కూడా తన పెద్ద మనసు చాటుకున్నారు. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో ఆటతీరుకు లభించిన పురస్కారాన్ని స్టేడియం సిబ్బందికి బహుమతిగా ఇచ్చారు. తనకు దక్కిన అవార్డును మహిళా సిబ్బందికి అందించి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. రాహుల్‌ చేసిన ఈ పనిపై అభిమానులు, క్రికెట్‌ ప్రేమికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

10.మళ్లీ..ఇరాన్‌పై అమెరికా దాడులు

శాంతి చర్చలు కొనసాగుతున్న వేళ అమెరికా సైన్యం ఇరాన్‌పై పరిమిత దాడులకు పాల్పడింది. ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థను లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. ఖ్వెష్మ్‌ ద్వీపంలోని సుజా ప్రాంతంలో రెండు భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు ఇరాన్ వెల్లడించింది. ఈ సైనిక చర్య ఐదు నిమిషాల్లోనే ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. అణ్వాయుధం సాధించకుండా ఇరాన్‌ను అడ్డుకోకపోయి ఉంటే ఇజ్రాయెల్‌తో పాటు పశ్చిమాసియా ప్రాంతమే భౌగోళిక పటంలో ఉండేది కాదని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 08 November 2026, 7:43 pm Digital Edition : Prabhanews
Top 10 News: నేటి టాప్ పది వార్తలు మీకోసం.. రెండు నిమిషాల్లో చదివేయండి | తెలంగాణ వార్తలు

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ.. సీఆర్‌పీఎఫ్‌ జవాన్లతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంతర్గత శత్రువుల పట్ల భద్రతా బలగాలు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నక్సలిజం, ఉగ్రవాదంపై పోరులో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల త్యాగాలను గుర్తుచేసుకున్నారు. మావోయిస్టు తీవ్రవాదంపై దశాబ్దాల పోరులో సాధించిన విజయంతో ఈ దీపావళి ప్రత్యేకమైందని పేర్కొన్నారు. ఈ విజయం వెనుక భద్రతా బలగాలు, పోలీసుల త్యాగాలు, అంకితభావం ఉన్నాయని ప్రధాని కొనియాడారు. దేశప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.2.అయోధ్యలో కనులపండువగా దీపోత్సవం ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య నగరం దీపాల కాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోయింది. దీపావళి సందర్భంగా నిర్వహించిన పదో దీపోత్సవంలో సరయు నది తీరంలోని 56 ఘాట్‌లపై సుమారు 30 లక్షల ప్రమిదలను వెలిగించారు. రామ్‌లీలా ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, డ్రోన్‌, లేజర్‌ షోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకలకు ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌, గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ హాజరయ్యారు. అంతకుముందు నగరంలో నిర్వహించిన శోభాయాత్ర వైభవంగా సాగింది.3. విచిత్ర వేషధారణతో కేటీఆర్ తిరుగుతున్నాడు తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. సొంత చెల్లెలు కవితనే ఇంటి నుంచి బయటకు గెంటేశారని ఆరోపిస్తూ, మహిళా సాధికారత గురించి మాట్లాడే అర్హత కేటీఆర్‌కు లేదన్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో స్వయం సహాయక సంఘాల మహిళలతో నిర్వహించిన సమ్మేళనంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.కేటీఆర్‌ గడ్డం పెంచుకుని వింత వేషధారణతో గ్రామాల్లో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. పదేళ్ల బీఆర్ఎస్‌ పాలనలో మహిళలకు చేసిన మేలేమిటో చెప్పాలని రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.4. మోదీ పాలనలో అంతా విధ్వంసమేగత 12 ఏళ్ల మోదీ పాలనలో దేశ మౌలిక లక్షణాలు, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ సంస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయని కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోపించారు. ఈ నెల 10న విడుదల కానున్న తన ఆత్మకథ బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్ నేపథ్యంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం మారిన తర్వాత కూడా దేశ వ్యవస్థలను తిరిగి గాడిలో పెట్టేందుకు చాలా సమయం పడుతుందని అభిప్రాయపడ్డారు.భారత ప్రజలు తిరిగి సుపరిపాలనను స్వాగతిస్తారని సోనియా గాంధీ ఆశాభావం వ్యక్తం చేశారు.5. జ్ఞానేశ్‌‌కు పదవిలేకపోతే మోదీ పని అయిపోయినట్లే: దీప్కే కేంద్రంలో ప్రభుత్వ మార్పునకు ప్రజలు సిద్ధంగా ఉండాలని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే పిలుపునిచ్చారు. 2029 లోక్‌సభ ఎన్నికల్లో మోదీ ప్రభుత్వం ఓటమి పాలవుతుందని ఆయన జోస్యం చెప్పారు. కొచ్చిన్‌లో సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌కు వ్యతిరేకంగా నిర్వహించిన నిరసన సభలో ప్రసంగిస్తూ, ఎన్నికల వ్యవస్థ స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా పనిచేయాలంటే ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నిసార్లు అరెస్టు చేసినా జాతీయ జెండాను ఎగురవేస్తూనే ఉంటానని దీప్కే స్పష్టం చేశారు. ఈ నిరసన ప్రదర్శనకు సినీనటుడు ప్రకాశ్‌రాజ్‌ నేతృత్వం వహించారు.6.ఈ20.. 420గా మారింది ఈ20 పెట్రోల్‌లో ఇథనాల్‌ శాతం ఎంత కలుపుతున్నారో కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేశారు. కర్ణాటకలో ఏడు జిల్లాల్లో సేకరించిన 14 నమూనాల్లో 11 నమూనాల్లో ఇథనాల్‌ శాతం 20కి మించి ఉందని, కొన్నింటిలో 30 శాతం దాటిందని ఈ20 కాస్త 420 అవుతోందని! ఆయన పేర్కొన్నారు. పెట్రోల్‌ బంకుల్లో ఇథనాల్‌ శాతాన్ని తెలిపే లేబుళ్లు లేకపోవడంపై ప్రశ్నించారు. అధిక ఇథనాల్‌ కలపడం వల్ల వాహనదారులు నష్టపోతున్నారని ఆరోపించారు. 20 శాతానికి మించి ఇథనాల్‌ కలుపుతున్న చమురు కంపెనీలపై చర్యలు ఎప్పుడు తీసుకుంటారని కేంద్రాన్ని ప్రశ్నిస్తూ, ఈ అంశంపై ప్రధాని మోదీతో బహిరంగ చర్చకు రాహుల్‌ గాంధీ సవాల్‌ విసిరారు.7.అప్పట్లో సోషల్ మీడియా లేకపోవడం మా అదృష్టంసోషల్ మీడియా ప్రస్తుత తరానికి అత్యంత క్రూరమైనదని, దాని ప్రభావం నుంచి తప్పించుకునే మార్గం లేదని హీరో అక్కినేని నాగార్జున వ్యాఖ్యానించారు. తమ రోజుల్లో సోషల్ మీడియా లేకపోవడం అదృష్టమని పేర్కొన్నారు. ‘ఇట్లు అర్జున’ సినిమా యువతరానికి బాగా నచ్చుతుందని అన్నారు. నాగార్జున సమర్పణలో మహేశ్ ఉప్పల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వెంకీ కుడుముల నిర్మించారు. ఇందులో అనీష్ హీరోగా నటించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు ప్రచారం కల్పిస్తున్న చిత్రబృందం.. నవంబర్ 13న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.8.బాలీవుడ్‌, సౌత్ చిత్ర పరిశ్రమల మధ్య అదే తేడాదక్షిణాది, హిందీ చిత్ర పరిశ్రమల మధ్య ఉన్న పని విధానాల్లో తేడాలను వివరించారు నటి కీర్తి సురేశ్‌. బాలీవుడ్‌లో సినిమా నిర్మాణానికి ముందు ప్రీ ప్రొడక్షన్‌కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారని, దక్షిణాది చిత్ర పరిశ్రమలో మాత్రం పనితీరు మరింత సహజంగా, స్పాంటేనియస్‌గా సాగుతుందని కీర్తి సురేశ్‌ తెలిపారు. బాలీవుడ్‌లో స్క్రిప్ట్ రీడింగ్స్‌, నటీనటులకు శిక్షణ, పరస్పర సమన్వయం వంటి ప్రీ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం కేటాయిస్తారని తెలిపారు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో మాత్రం సహజత్వానికి ప్రాధాన్యత ఉంటుందని, కొన్నిసార్లు షూటింగ్ రోజే సహనటులను కలుస్తామని చెప్పారు.9.అవార్డు అందుకున్నాడు.. వెంటనే ఇచ్చేశాడు టీమిండియా బ్యాటర్ కేఎల్‌ రాహుల్‌ మైదానంలోనే కాకుండా బయట కూడా తన పెద్ద మనసు చాటుకున్నారు. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో ఆటతీరుకు లభించిన పురస్కారాన్ని స్టేడియం సిబ్బందికి బహుమతిగా ఇచ్చారు. తనకు దక్కిన అవార్డును మహిళా సిబ్బందికి అందించి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. రాహుల్‌ చేసిన ఈ పనిపై అభిమానులు, క్రికెట్‌ ప్రేమికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.10.మళ్లీ..ఇరాన్‌పై అమెరికా దాడులు శాంతి చర్చలు కొనసాగుతున్న వేళ అమెరికా సైన్యం ఇరాన్‌పై పరిమిత దాడులకు పాల్పడింది. ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థను లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. ఖ్వెష్మ్‌ ద్వీపంలోని సుజా ప్రాంతంలో రెండు భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు ఇరాన్ వెల్లడించింది. ఈ సైనిక చర్య ఐదు నిమిషాల్లోనే ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. అణ్వాయుధం సాధించకుండా ఇరాన్‌ను అడ్డుకోకపోయి ఉంటే ఇజ్రాయెల్‌తో పాటు పశ్చిమాసియా ప్రాంతమే భౌగోళిక పటంలో ఉండేది కాదని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

Source link