ఒకేసారి ఎన్ని లైట్స్, ఫ్యాన్లు యూజ్ చేయవచ్చంటే?
జీనస్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ఇన్వర్టర్‌తో ఎలాంటి ఉపకరణాలు ఉపయోగించవచ్చంటే.. ఒక విధానంలో 2 ఫ్యాన్లు, 4 ఎల్‌ఈడీ బల్బులు, 2 ఎల్‌ఈడీ ట్యూబ్‌లైట్లు, ఒక టీవీ, 2 ల్యాప్‌టాప్‌లు, ఒక వైఫై రూటర్, ఒక కూలర్, ఒక ఫ్రిజ్, 2 ఫోన్ ఛార్జర్లు ఉపయోగించవచ్చు. మరో కాంబినేషన్‌లో 3 ఫ్యాన్లు, 2 బల్బులు, 3 ట్యూబ్‌లైట్లు, ఒక టీవీ, ఒక కంప్యూటర్, ఒక వైఫై రూటర్, ఒక ఫ్రిజ్, 2 ఫోన్ ఛార్జర్లను చూపించారు. ఇంకొక వినియోగ విధానంలో 3 ఫ్యాన్లు, 3 బల్బులు, 4 ట్యూబ్‌లైట్లు, ఒక టీవీ, ఒక కంప్యూటర్, ఒక వైఫై రూటర్, ఒక కూలర్, 2 ఫోన్ ఛార్జర్లను ఉపయోగించవచ్చని సూచించారు. నాలుగో కాంబినేషన్‌లో 2 ఫ్యాన్లు, 3 బల్బులు, 2 ట్యూబ్‌లైట్లు, ఒక టీవీ, ఒక కంప్యూటర్, ఒక వైఫై రూటర్, 2 ఫోన్ ఛార్జర్లు, ఒక ప్రింటర్‌ను చూపించారు. ఇవి తయారీదారు ఇచ్చిన ప్రామాణిక ఉపకరణాల ఆధారంగా రూపొందించిన సూచనాత్మక కాంబినేషన్లు మాత్రమే. వాస్తవంగా ఒకేసారి ఎన్ని పరికరాలు పనిచేస్తాయనేది మొత్తం లోడ్, ఇన్వర్టర్ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి కొనుగోలు చేసే ముందు మీ ఇంట్లోని ఉపకరణాల విద్యుత్ వినియోగాన్ని పరిశీలించడం మంచిది.(Image Credit: Flipkart)

