Last Updated:
రైతులకు బీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది. ఇది కాంగ్రెస్‌కి మరింత సమస్యగా మారింది. ఇలా అవకాశం వచ్చిన ప్రతిచోటా బీఆర్ఎస్ వచ్చి వాలిపోతోంది. ప్రభుత్వ వ్యతిరేకతను పెంచుతోంది. దాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటోంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాలుగా మారుతోంది.
శంషాబాద్.. బహదూర్‌గూడలో టెన్షన్ వాతావరణం ఉంది. బుల్లెట్ ట్రైన్ కోసం 600 ఎకరాల భూములు ఇచ్చేందుకు రైతుల నిరాకరించారు. ఐతే.. ఆ భూములను తీసుకునేందుకు హైడ్రా అధికారులు భారీ సంఖ్యలో వచ్చారు. దాంతో రైతులు బలంగా ప్రతిఘటించడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
ఐదు రోజులుగా ఈ అంశంపై రైతులు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. తమకు స్పష్టమైన హామీ ఇచ్చాకే భూములు తీసుకోవాలని వారు చెబుతున్నారు.
మరోవైపు రైతులకు బీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది. ఇది కాంగ్రెస్‌కి మరింత సమస్యగా మారింది. ఇలా అవకాశం వచ్చిన ప్రతిచోటా బీఆర్ఎస్ వచ్చి వాలిపోతోంది. ప్రభుత్వ వ్యతిరేకతను పెంచుతోంది. దాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటోంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాలుగా మారుతోంది.
భూముల సేకరణ విషయంలో రైతులతో కూలంకషంగా చర్చించి, వారి మద్దతు పొంది తీసుకుంటే బాగుంటుంది. బలవంతంగా తీసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. బుల్లెట్ రైలు ప్రాజెక్టుకి భూములు ఇస్తే.. ఆ ప్రాజెక్టు రావడానికి 10ఏళ్లకు పైగా టైమ్ పడుతుందనీ.. అందువల్ల తమకు స్పష్టమైన హామీ, భరోసా, తమ భవిష్యత్తుకి గ్యారెంటీ ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. అలాంటి హామీ వచ్చే వరకూ భూములు ఇచ్చేది లేదంటున్నారు.
Hyderabad,Telangana

