సికింద్రాబాద్, సిర్పూర్ కాగజ్నగర్, హైదరాబాద్ మధ్య నడిచే ప్రత్యేక రైళ్లలో కూడా బెర్తులు అందుబాటులో ఉన్నాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. రైలు నంబర్ 07711 సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్నగర్ స్పెషల్ రైలు ప్రతిరోజూ నడుస్తుంది. ఈ రైలులో నవంబర్ 8వ తేదీన 438 బెర్తులు, నవంబర్ 9వ తేదీన 551 బెర్తులు, నవంబర్ 10వ తేదీన 547 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా, రైలు నంబర్ 07712 సిర్పూర్ కాగజ్నగర్-హైదరాబాద్ స్పెషల్ రైలు కూడా ప్రతిరోజూ నడుస్తుంది. ఈ రైలులో నవంబర్ 7వ తేదీన 535 బెర్తులు, నవంబర్ 8వ తేదీన 543 బెర్తులు, నవంబర్ 9వ తేదీన 76 బెర్తులు, నవంబర్ 10వ తేదీన 453 బెర్తులు అందుబాటులో ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)

