ప్రభన్యూస్

Scene Review: సీన్ మూవీ రివ్యూ.. సూర్య కొత్త సినిమా ఎలా ఉందంటే..! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, మలయాళ డైరెక్టర్ జీతూ మాధవన్ కాంబినేషన్‌లో వచ్చిన కొత్త చిత్రం ‘సీన్’. ఈ రోజే విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

News18
News18

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, మలయాళ డైరెక్టర్ జీతూ మాధవన్ కాంబినేషన్‌లో వచ్చిన కొత్త చిత్రం ‘సీన్’ (Seen). మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. చాలా కాలం తర్వాత క్యూట్ హీరోయిన్ నజ్రియా ఈ సినిమాతో రీఎంట్రీ ఇవ్వడం, మలయాళ యంగ్ సెన్సేషన్ (ప్రేమలు ఫేమ్) నస్లెన్ తొలిసారిగా తమిళంలో విలన్‌గా డెబ్యూ చేయడం ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. ప్రమోషనల్ కంటెంట్ కూడా విశేషంగా ఆకట్టుకోవడంతో నేడే (నవంబర్ 6) థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా, ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఇప్పుడు చూద్దాం.

కథ:

కంటి చూపు మందగించే వ్యాధితో బాధపడుతున్న డీఎస్పీ ప్రేమ్ రాజ్ (సూర్య) తన పోలీసు ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకుంటాడు. సరిగ్గా అదే సమయంలో నగరంలో జరిగే వరుస దారుణ హత్యలు పోలీసులకు సవాల్‌గా మారుతాయి. దీంతో డిపార్ట్‌మెంట్ రిక్వెస్ట్ మేరకు ప్రేమ్ రాజ్ మళ్లీ విధుల్లోకి దిగుతాడు. కంటి చూపు పూర్తిగా మందగించినప్పటికీ, తన అపారమైన అనుభవం, జ్ఞాపకశక్తితో పాటు, తన కళ్లుగా నిలిచే మాయ (నజ్రియా) సహాయంతో ఈ కేసును దర్యాప్తు చేయడం ప్రారంభిస్తాడు. ఈ వరుస హత్యల వెనుక ఉన్న విచిత్రమైన, అత్యంత ప్రమాదకరమైన సీరియల్ కిల్లర్ ఈశ్వరన్ (నస్లెన్). ప్రేమ్ రాజ్ కు – ఈశ్వరన్‌ కు మధ్య జరిగే మైండ్ గేమ్‌లో ఎవరు గెలిచారు? ఈశ్వరన్ ఈ హత్యలు ఎందుకు చేస్తున్నాడు? అనేది వెండితెరపై చూడాల్సిందే.

నటీనటుల పనితీరు:

ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేసే సూర్య.. తన స్టార్‌డమ్‌ను పక్కనపెట్టి, డీఎస్పీ ప్రేమ్ రాజ్ అనే ఒక విభిన్నమైన, సవాల్‌తో కూడిన పాత్రలో జీవించేశారు. కంటి చూపు లేని వ్యక్తిగా ఆయన పడే ఇబ్బందులు, హావభావాలు, డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ సినిమాకు అతిపెద్ద బలం. ఇక సీరియల్ కిల్లర్ ఈశ్వరన్ పాత్రలో నస్లెన్ నటన సర్ప్రైజింగ్‌గా ఉంటుంది. పైకి అమాయకుడిలా కనిపిస్తూనే లోపల క్రూరమైన చేష్టలతో భయపెట్టే పాత్రలో ఒదిగిపోయాడు. ప్రేమ్ రాజ్‌కు అండగా నిలిచే మాయ పాత్రలో నజ్రియా తన సహజ నటనతో కట్టిపడేసింది. మిగతా నటీనటులు తమ పరిధి మేర ఆకట్టుకున్నారు.

విశ్లేషణ:

దర్శకుడు జీతు మాధవన్ తన మార్క్ మేకింగ్ చూపించాడు. ఒక సీరియస్ క్రైమ్ థ్రిల్లర్ కు ‘డార్క్ కామెడీ’ని జోడించి నడిపించిన విధానం కొత్తగా అనిపిస్తుంది. కాకపోతే గతంలో వచ్చిన కొన్ని కథలను మిక్స్ చేసి మిక్సీలో వేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. అక్కడక్కగా లాజిక్ లేని సీన్లు, బోర్ కొట్టించే సన్నివేశాలు ఉన్నాయి. మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా సంగీతం, ముఖ్యంగా నేపథ్య సంగీతం (BGM) సినిమా మూడ్ ను ఎలివేట్ చేస్తూ కథకు ప్రాణం పోసింది. కంటి చూపు లేని వ్యక్తి కోణంలో సినిమాటోగ్రాఫర్ కెమెరాను వాడిన తీరు విజువల్ గా సినిమా స్థాయిని పెంచింది. ఎడిటింగ్ విషయంలో సెకండాఫ్‌లో కాస్త ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది.

ఫైనల్ గా చెప్పాలంటే.. ప్రేక్షకులను నవ్విస్తూనే ఉత్కంఠకు గురిచేసే ‘సీన్’ ఇది.

రేటింగ్: 2.25



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 06 November 2026, 6:54 pm Digital Edition : Prabhanews
Scene Review: సీన్ మూవీ రివ్యూ.. సూర్య కొత్త సినిమా ఎలా ఉందంటే..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Nov 06, 2026 3:58 PM ISTకోలీవుడ్ స్టార్ హీరో సూర్య, మలయాళ డైరెక్టర్ జీతూ మాధవన్ కాంబినేషన్‌లో వచ్చిన కొత్త చిత్రం 'సీన్'. ఈ రోజే విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. News18కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, మలయాళ డైరెక్టర్ జీతూ మాధవన్ కాంబినేషన్‌లో వచ్చిన కొత్త చిత్రం 'సీన్' (Seen). మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. చాలా కాలం తర్వాత క్యూట్ హీరోయిన్ నజ్రియా ఈ సినిమాతో రీఎంట్రీ ఇవ్వడం, మలయాళ యంగ్ సెన్సేషన్ (ప్రేమలు ఫేమ్) నస్లెన్ తొలిసారిగా తమిళంలో విలన్‌గా డెబ్యూ చేయడం ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. ప్రమోషనల్ కంటెంట్ కూడా విశేషంగా ఆకట్టుకోవడంతో నేడే (నవంబర్ 6) థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా, ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఇప్పుడు చూద్దాం.కథ:కంటి చూపు మందగించే వ్యాధితో బాధపడుతున్న డీఎస్పీ ప్రేమ్ రాజ్ (సూర్య) తన పోలీసు ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకుంటాడు. సరిగ్గా అదే సమయంలో నగరంలో జరిగే వరుస దారుణ హత్యలు పోలీసులకు సవాల్‌గా మారుతాయి. దీంతో డిపార్ట్‌మెంట్ రిక్వెస్ట్ మేరకు ప్రేమ్ రాజ్ మళ్లీ విధుల్లోకి దిగుతాడు. కంటి చూపు పూర్తిగా మందగించినప్పటికీ, తన అపారమైన అనుభవం, జ్ఞాపకశక్తితో పాటు, తన కళ్లుగా నిలిచే మాయ (నజ్రియా) సహాయంతో ఈ కేసును దర్యాప్తు చేయడం ప్రారంభిస్తాడు. ఈ వరుస హత్యల వెనుక ఉన్న విచిత్రమైన, అత్యంత ప్రమాదకరమైన సీరియల్ కిల్లర్ ఈశ్వరన్ (నస్లెన్). ప్రేమ్ రాజ్ కు - ఈశ్వరన్‌ కు మధ్య జరిగే మైండ్ గేమ్‌లో ఎవరు గెలిచారు? ఈశ్వరన్ ఈ హత్యలు ఎందుకు చేస్తున్నాడు? అనేది వెండితెరపై చూడాల్సిందే.నటీనటుల పనితీరు:ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేసే సూర్య.. తన స్టార్‌డమ్‌ను పక్కనపెట్టి, డీఎస్పీ ప్రేమ్ రాజ్ అనే ఒక విభిన్నమైన, సవాల్‌తో కూడిన పాత్రలో జీవించేశారు. కంటి చూపు లేని వ్యక్తిగా ఆయన పడే ఇబ్బందులు, హావభావాలు, డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ సినిమాకు అతిపెద్ద బలం. ఇక సీరియల్ కిల్లర్ ఈశ్వరన్ పాత్రలో నస్లెన్ నటన సర్ప్రైజింగ్‌గా ఉంటుంది. పైకి అమాయకుడిలా కనిపిస్తూనే లోపల క్రూరమైన చేష్టలతో భయపెట్టే పాత్రలో ఒదిగిపోయాడు. ప్రేమ్ రాజ్‌కు అండగా నిలిచే మాయ పాత్రలో నజ్రియా తన సహజ నటనతో కట్టిపడేసింది. మిగతా నటీనటులు తమ పరిధి మేర ఆకట్టుకున్నారు.విశ్లేషణ:దర్శకుడు జీతు మాధవన్ తన మార్క్ మేకింగ్ చూపించాడు. ఒక సీరియస్ క్రైమ్ థ్రిల్లర్ కు 'డార్క్ కామెడీ'ని జోడించి నడిపించిన విధానం కొత్తగా అనిపిస్తుంది. కాకపోతే గతంలో వచ్చిన కొన్ని కథలను మిక్స్ చేసి మిక్సీలో వేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. అక్కడక్కగా లాజిక్ లేని సీన్లు, బోర్ కొట్టించే సన్నివేశాలు ఉన్నాయి. మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా సంగీతం, ముఖ్యంగా నేపథ్య సంగీతం (BGM) సినిమా మూడ్ ను ఎలివేట్ చేస్తూ కథకు ప్రాణం పోసింది. కంటి చూపు లేని వ్యక్తి కోణంలో సినిమాటోగ్రాఫర్ కెమెరాను వాడిన తీరు విజువల్ గా సినిమా స్థాయిని పెంచింది. ఎడిటింగ్ విషయంలో సెకండాఫ్‌లో కాస్త ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది.ఫైనల్ గా చెప్పాలంటే.. ప్రేక్షకులను నవ్విస్తూనే ఉత్కంఠకు గురిచేసే 'సీన్' ఇది.రేటింగ్: 2.25మరింత చదవండి

Source link