ప్రభన్యూస్

Sreeleela: రజినీకాంత్ సినిమాలో శ్రీలీల.. యంగ్ హీరోయిన్‌కి క్రేజీ ఆఫర్ | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

టాలీవుడ్‌ యంగ్ హీరోయిన్ శ్రీలీలకు క్రేజీ ఆఫర్ దక్కింది. రజినీకాంత్ హీరోగా భారీ ఎత్తున రూపొందుతున్న ‘ధర్మన్’ మూవీలో శ్రీలీల భాగం కాబోతోంది.

News18
News18

సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా, అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ ‘ధర్మన్’. ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్‌డేట్‌ను మేకర్స్ తాజాగా పంచుకున్నారు. టాలీవుడ్‌ యంగ్ హీరోయిన్ శ్రీలీల ఈ భారీ ప్రాజెక్టులో భాగమైనట్లు అధికారికంగా ప్రకటించారు. “షీ హ్యాస్ గాట్ ది స్పార్క్.. షీ హ్యాస్ గాట్ ది పటాకా” అంటూ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ సంస్థ సోషల్ మీడియా వేదికగా ఓ ప్రత్యేక గ్లింప్స్‌ను విడుదల చేస్తూ ఆమెకు ఘన స్వాగతం పలికింది.

యూనివర్సల్ హీరో కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ సంయుక్తంగా రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, టర్మరిక్ మీడియా బ్యానర్లపై ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రంలో రజనీకాంత్ ‘ది డెడ్లీ డాక్టర్’ అనే పవర్‌ఫుల్ వైద్యుడి పాత్రలో, చేతిలో రక్తంతో తడిసిన స్కాల్పెల్ పట్టుకుని కనిపించనున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అగ్ర తారాగణం నటిస్తోంది. లేడీ సూపర్ స్టార్ నయనతార ఆరోసారి రజనీతో స్క్రీన్ షేర్ చేసుకోనుండగా, టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నెగెటివ్ షేడ్స్ ఉన్న కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.

‘ఓ మై కడవులే’, ‘డ్రాగన్’ వంటి చిత్రాలతో ఆకట్టుకున్న యువ దర్శకుడు అశ్వత్ మారిముత్తు ఈ చిత్రాన్ని ఒక స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా మలుస్తున్నారు. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ, ప్రదీప్ ఈ. రాఘవ్ ఎడిటింగ్ బాధ్యతలు చూస్తుండగా, అన్బరివ్ మాస్టర్స్ యాక్షన్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు.

ఇక శ్రీలీల విషయానికొస్తే.. ఈమె వరుస తమిళ ప్రాజెక్టులతో కోలీవుడ్‌లో బిజీగా మారుతోంది. ధనుష్ సరసన ‘ఓం’, అజిత్ సరసన ‘డేర్ డెవిల్’ చిత్రాల్లో నటిస్తున్న శ్రీలీల, ఇప్పుడు ఏకంగా రజనీకాంత్ సినిమాలో అవకాశం దక్కించుకోవడంతో అక్కడ తన స్థానాన్ని పదిలం చేసుకున్నట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. రెడ్ జెయింట్ మూవీస్ పంపిణీ చేస్తున్న ‘ధర్మన్’ ఏప్రిల్ 2027లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 04 November 2026, 3:27 pm Digital Edition : Prabhanews
Sreeleela: రజినీకాంత్ సినిమాలో శ్రీలీల.. యంగ్ హీరోయిన్‌కి క్రేజీ ఆఫర్ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Nov 04, 2026 3:07 PM ISTటాలీవుడ్‌ యంగ్ హీరోయిన్ శ్రీలీలకు క్రేజీ ఆఫర్ దక్కింది. రజినీకాంత్ హీరోగా భారీ ఎత్తున రూపొందుతున్న 'ధర్మన్' మూవీలో శ్రీలీల భాగం కాబోతోంది. News18సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా, అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ 'ధర్మన్'. ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్‌డేట్‌ను మేకర్స్ తాజాగా పంచుకున్నారు. టాలీవుడ్‌ యంగ్ హీరోయిన్ శ్రీలీల ఈ భారీ ప్రాజెక్టులో భాగమైనట్లు అధికారికంగా ప్రకటించారు. "షీ హ్యాస్ గాట్ ది స్పార్క్.. షీ హ్యాస్ గాట్ ది పటాకా" అంటూ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ సంస్థ సోషల్ మీడియా వేదికగా ఓ ప్రత్యేక గ్లింప్స్‌ను విడుదల చేస్తూ ఆమెకు ఘన స్వాగతం పలికింది.యూనివర్సల్ హీరో కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ సంయుక్తంగా రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, టర్మరిక్ మీడియా బ్యానర్లపై ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రంలో రజనీకాంత్ 'ది డెడ్లీ డాక్టర్' అనే పవర్‌ఫుల్ వైద్యుడి పాత్రలో, చేతిలో రక్తంతో తడిసిన స్కాల్పెల్ పట్టుకుని కనిపించనున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అగ్ర తారాగణం నటిస్తోంది. లేడీ సూపర్ స్టార్ నయనతార ఆరోసారి రజనీతో స్క్రీన్ షేర్ చేసుకోనుండగా, టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నెగెటివ్ షేడ్స్ ఉన్న కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.'ఓ మై కడవులే', 'డ్రాగన్' వంటి చిత్రాలతో ఆకట్టుకున్న యువ దర్శకుడు అశ్వత్ మారిముత్తు ఈ చిత్రాన్ని ఒక స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా మలుస్తున్నారు. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ, ప్రదీప్ ఈ. రాఘవ్ ఎడిటింగ్ బాధ్యతలు చూస్తుండగా, అన్బరివ్ మాస్టర్స్ యాక్షన్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు.ఇక శ్రీలీల విషయానికొస్తే.. ఈమె వరుస తమిళ ప్రాజెక్టులతో కోలీవుడ్‌లో బిజీగా మారుతోంది. ధనుష్ సరసన 'ఓం', అజిత్ సరసన 'డేర్ డెవిల్' చిత్రాల్లో నటిస్తున్న శ్రీలీల, ఇప్పుడు ఏకంగా రజనీకాంత్ సినిమాలో అవకాశం దక్కించుకోవడంతో అక్కడ తన స్థానాన్ని పదిలం చేసుకున్నట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. రెడ్ జెయింట్ మూవీస్ పంపిణీ చేస్తున్న 'ధర్మన్' ఏప్రిల్ 2027లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.మరింత చదవండి

Source link