ఇన్వర్టర్, ఇతర పరికరాల నాణ్యతను పట్టించుకోకపోవడం: సోలార్ ప్యానెల్స్ మాత్రమే రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్ కాదు. ఇన్వర్టర్, మౌంటింగ్ స్ట్రక్చర్, వైరింగ్, ఎలక్ట్రికల్ ప్రొటెక్షన్ పరికరాలు కూడా చాలా ముఖ్యం. అందుకే ఇన్వర్టర్ బ్రాండ్, మోడల్, సామర్థ్యం గురించి తెలుసుకోవాలి. ఏసీ, డీసీ ప్రొటెక్షన్ పరికరాలు, ఎర్తింగ్, సర్జ్ ప్రొటెక్షన్ ఏర్పాట్లు, వైరింగ్ నాణ్యత, సిస్టమ్ మానిటరింగ్ సదుపాయాలు, వారంటీ వివరాలు చెక్ చేసుకోవాలి. అలాగే ఆన్-గ్రిడ్, ఆఫ్-గ్రిడ్, హైబ్రిడ్ సోలార్ సిస్టమ్స్ మధ్య తేడా తెలుసుకోవాలి. సాధారణ ఆన్-గ్రిడ్ సోలార్ సిస్టమ్‌లో విద్యుత్ గ్రిడ్ సరఫరా ఆగిపోతే భద్రత కారణాల వల్ల సోలార్ సిస్టమ్ కూడా పనిచేయడం ఆగిపోతుంది. అదనపు బ్యాకప్ సదుపాయాలు ఏర్పాటు చేసుకుంటే తప్ప విద్యుత్ అందుబాటులో ఉండదు. మీ ప్రాంతంలో తరచూ కరెంట్ పోతుంటే, సోలార్ సిస్టమ్ ఎంచుకునే ముందే బ్యాకప్ అవసరాల గురించి ఇన్‌స్టాలర్‌తో మాట్లాడాలి. (ప్రతీకాత్మక చిత్రం)

