ప్రభన్యూస్

Chiranjeevi: గ్రాఫిక్స్ కోసమే ఇంత ఆలస్యమా? మెగాస్టార్ ‘విశ్వంభర’పై రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

చిరంజీవి లైనప్‌లో విశ్వంభర సినిమా ఒకటుందని కూడా జనాలు మర్చిపోతున్నారు. అసలు అప్పుడెప్పుడో 2023లో పట్టాలెక్కిన ఈ సినిమా ప్యాసింజర్ ట్రైన్ కంటే మెల్లిగా ప్రయాణం సాగిస్తుంది.

News18
News18

చిరంజీవి లైనప్‌లో విశ్వంభర సినిమా ఒకటుందని కూడా జనాలు మర్చిపోతున్నారు. అసలు అప్పుడెప్పుడో 2023లో పట్టాలెక్కిన ఈ సినిమా ప్యాసింజర్ ట్రైన్ కంటే మెల్లిగా ప్రయాణం సాగిస్తుంది. ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లు వచ్చినప్పుడు ప్యాసింజర్ ట్రైన్‌లకు ఎలా బ్రేకులు పడతాయో.. మన శంకర వరప్రసాద్ సినిమా రాగానే, విశ్వంభరకు బ్రేకులు పడ్డాయి. నిజానికి అన్ని కుదిరితే ఎప్పుడో ఈ సినిమా రిలీజ్ కావాలి. కానీ పలు కారణాల వల్ల పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది.

దాదాపు రెండొందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫాంటసీ సినిమాగా రూపొందుతుంది. పంచభూతాలను ఏకం చేసే ఓ కాలచక్రాన్ని పోస్టర్‌లో చూపిస్తూ ప్రీ లుక్ తోనే సినిమాపై తిరుగులేని క్యూరియాసిటీ క్రియేట్‌ చేశారు మేకర్స్. ఆ తర్వాత రిలీజైన టీజర్ మాత్రం నెక్స్ట్ లెవల్‌లో అనిపించింది. అసలు ఒక్కో షాట్, ఒక్కో సీన్ గూస్‌బంప్స్ తెప్పించింది. ప్రతి సీన్ విజువల్‌గా ఆకట్టుకునేలా ఉంది. గతంలో వచ్చిన వీఎఫ్ఎక్స్‌పై విమర్శలు ఎదురైనప్పటికీ.. టీజర్‌‌ టైమ్ వరకు మాత్రం ఆ లోపాలు సరిచేసుకున్నట్టుగా కనిపించింది. కాగా.. ఈ సినిమా రిలీజ్‌పై రాజీవ్ కనకాల తాజాగా స్పందించాడు..

‘విశ్వంభర’ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్, కంప్యూటర్ గ్రాఫిక్స్‌కు అత్యంత ప్రాధాన్యం ఉందని రాజీవ్ కనకాల తెలిపారు. ఈ సినిమాలోని విజువల్స్ ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో చిత్రబృందం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని వివరించారు. చిరంజీవి వంటి స్టార్ హీరో నటిస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకులు భారీ స్థాయిలో ఆశలు పెట్టుకుంటారని, ఆ అంచనాలకు తగ్గట్టుగా సినిమా ఉండాలని పేర్కొన్నారు.

ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష కథానాయికగా నటిస్తున్నారు. ఆషికా రంగనాథన్, సురభి, ఇషా చావ్లా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ ప్రతినాయకుడిగా నటిస్తుండగా, రాజీవ్ కనకాల కూడా ఓ ముఖ్యమైన పాత్రలో ప్రేక్షకులను అలరించనున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. విక్రమ్ రెడ్డి, వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తుండగా, చోటా కె. నాయుడు ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఏఎస్ ప్రకాశ్ కళా దర్శకత్వం వహిస్తున్నారు.

‘విశ్వంభర’ విడుదల తేదీపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. వీఎఫ్ఎక్స్ పనులు పూర్తయిన తర్వాతే సినిమా రిలీజ్‌పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ‘విశ్వంభర’ ఆలస్యానికి ప్రధాన కారణం విజువల్ ఎఫెక్ట్స్ పనులేనని రాజీవ్ కనకాల వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోంది. అయితే మెగాస్టార్ అభిమానులు మాత్రం ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చిరంజీవిని మరోసారి అద్భుతమైన ఫాంటసీ ప్రపంచంలో చూడాలనే వారి కోరికను ‘విశ్వంభర’ ఎంతవరకు నెరవేరుస్తుందో చూడాలి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 03 November 2026, 9:57 pm Digital Edition : Prabhanews
Chiranjeevi: గ్రాఫిక్స్ కోసమే ఇంత ఆలస్యమా? మెగాస్టార్ ‘విశ్వంభర’పై రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Nov 03, 2026 9:39 PM ISTచిరంజీవి లైనప్‌లో విశ్వంభర సినిమా ఒకటుందని కూడా జనాలు మర్చిపోతున్నారు. అసలు అప్పుడెప్పుడో 2023లో పట్టాలెక్కిన ఈ సినిమా ప్యాసింజర్ ట్రైన్ కంటే మెల్లిగా ప్రయాణం సాగిస్తుంది. News18చిరంజీవి లైనప్‌లో విశ్వంభర సినిమా ఒకటుందని కూడా జనాలు మర్చిపోతున్నారు. అసలు అప్పుడెప్పుడో 2023లో పట్టాలెక్కిన ఈ సినిమా ప్యాసింజర్ ట్రైన్ కంటే మెల్లిగా ప్రయాణం సాగిస్తుంది. ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లు వచ్చినప్పుడు ప్యాసింజర్ ట్రైన్‌లకు ఎలా బ్రేకులు పడతాయో.. మన శంకర వరప్రసాద్ సినిమా రాగానే, విశ్వంభరకు బ్రేకులు పడ్డాయి. నిజానికి అన్ని కుదిరితే ఎప్పుడో ఈ సినిమా రిలీజ్ కావాలి. కానీ పలు కారణాల వల్ల పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది.దాదాపు రెండొందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫాంటసీ సినిమాగా రూపొందుతుంది. పంచభూతాలను ఏకం చేసే ఓ కాలచక్రాన్ని పోస్టర్‌లో చూపిస్తూ ప్రీ లుక్ తోనే సినిమాపై తిరుగులేని క్యూరియాసిటీ క్రియేట్‌ చేశారు మేకర్స్. ఆ తర్వాత రిలీజైన టీజర్ మాత్రం నెక్స్ట్ లెవల్‌లో అనిపించింది. అసలు ఒక్కో షాట్, ఒక్కో సీన్ గూస్‌బంప్స్ తెప్పించింది. ప్రతి సీన్ విజువల్‌గా ఆకట్టుకునేలా ఉంది. గతంలో వచ్చిన వీఎఫ్ఎక్స్‌పై విమర్శలు ఎదురైనప్పటికీ.. టీజర్‌‌ టైమ్ వరకు మాత్రం ఆ లోపాలు సరిచేసుకున్నట్టుగా కనిపించింది. కాగా.. ఈ సినిమా రిలీజ్‌పై రాజీవ్ కనకాల తాజాగా స్పందించాడు..‘విశ్వంభర’ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్, కంప్యూటర్ గ్రాఫిక్స్‌కు అత్యంత ప్రాధాన్యం ఉందని రాజీవ్ కనకాల తెలిపారు. ఈ సినిమాలోని విజువల్స్ ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో చిత్రబృందం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని వివరించారు. చిరంజీవి వంటి స్టార్ హీరో నటిస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకులు భారీ స్థాయిలో ఆశలు పెట్టుకుంటారని, ఆ అంచనాలకు తగ్గట్టుగా సినిమా ఉండాలని పేర్కొన్నారు.ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష కథానాయికగా నటిస్తున్నారు. ఆషికా రంగనాథన్, సురభి, ఇషా చావ్లా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ ప్రతినాయకుడిగా నటిస్తుండగా, రాజీవ్ కనకాల కూడా ఓ ముఖ్యమైన పాత్రలో ప్రేక్షకులను అలరించనున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. విక్రమ్ రెడ్డి, వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తుండగా, చోటా కె. నాయుడు ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఏఎస్ ప్రకాశ్ కళా దర్శకత్వం వహిస్తున్నారు.‘విశ్వంభర’ విడుదల తేదీపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. వీఎఫ్ఎక్స్ పనులు పూర్తయిన తర్వాతే సినిమా రిలీజ్‌పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ‘విశ్వంభర’ ఆలస్యానికి ప్రధాన కారణం విజువల్ ఎఫెక్ట్స్ పనులేనని రాజీవ్ కనకాల వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోంది. అయితే మెగాస్టార్ అభిమానులు మాత్రం ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చిరంజీవిని మరోసారి అద్భుతమైన ఫాంటసీ ప్రపంచంలో చూడాలనే వారి కోరికను ‘విశ్వంభర’ ఎంతవరకు నెరవేరుస్తుందో చూడాలి.మరింత చదవండి

Source link