ప్రభన్యూస్

Less oil cooking tips: ఎక్కువ నూనె పోయాల్సిన అవసరం లేదు.. కూరలు అడుగున అంటుకోకుండా చేసే సింపుల్ చిట్కాలు ఇవే! | లైఫ్ స్టైల్


Last Updated:

వంట రుచి మారిపోవడమే కాకుండా, గిన్నెను శుభ్రం చేయడం కూడా పెద్ద పనిగా మారుతుంది. ఈ సమస్యను తగ్గించుకోవడానికి కొందరు నూనె ఎక్కువగా పోస్తుంటారు. కానీ ప్రతిరోజూ ఎక్కువ నూనె వాడటం ఆరోగ్యానికి మంచిది కాదు. అయితే కొన్ని చిన్న చిట్కాలు పాటిస్తే తక్కువ నూనెతోనే కూరలు అడుగున అంటుకోకుండా, రుచిగా వండుకోవచ్చు.

News18
News18

వంట చేసేటప్పుడు చాలామందికి ఎదురయ్యే సాధారణ సమస్య కూరలు కడాయి అడుగున అంటుకుని మాడిపోవడం. ఎంత జాగ్రత్తగా వంట చేసినా కొన్నిసార్లు కూర అడుగుపట్టేస్తుంది. దీనివల్ల వంట రుచి మారిపోవడమే కాకుండా, గిన్నెను శుభ్రం చేయడం కూడా పెద్ద పనిగా మారుతుంది. ఈ సమస్యను తగ్గించుకోవడానికి కొందరు నూనె ఎక్కువగా పోస్తుంటారు. కానీ ప్రతిరోజూ ఎక్కువ నూనె వాడటం ఆరోగ్యానికి మంచిది కాదు. అయితే కొన్ని చిన్న చిట్కాలు పాటిస్తే తక్కువ నూనెతోనే కూరలు అడుగున అంటుకోకుండా, రుచిగా వండుకోవచ్చు.

కడాయికి కొద్దిగా నూనె పట్టించండి

ఏదైనా కూర వండే ముందు కడాయిలో కొద్దిగా నూనె వేసి దాని అడుగు భాగం మొత్తం పట్టేలా చేయాలి. ఇందుకోసం చిన్న చెంచా లేదా సిలికాన్ బ్రష్ ఉపయోగించవచ్చు. ఇలా చేయడం వల్ల కూరగాయలు, మసాలాలు నేరుగా పాత్రకు అంటుకునే అవకాశం తగ్గుతుంది. ముఖ్యంగా కూర వండే పాత్రను బట్టి నూనె పరిమాణాన్ని నిర్ణయించుకోవాలి. ఎక్కువ నూనె పోయాల్సిన అవసరం లేదు.

మసాలాలు మాడిపోకుండా ఇలా చేయండి

ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలాలు వేయించేటప్పుడు అవి కడాయికి అంటుకుంటున్నట్లు అనిపిస్తే ఒకటి లేదా రెండు చెంచాల నీళ్లు చల్లాలి. దీనివల్ల మసాలాలు తేమగా ఉండి త్వరగా మాడిపోకుండా ఉంటాయి. అయితే పొడి కూరలు చేసేటప్పుడు నీళ్లు మరీ ఎక్కువగా పోయకూడదు. అవసరమైనంత మాత్రమే చల్లాలి. అలాగే మసాలాలు వేసిన తర్వాత మధ్యమధ్యలో గరిటెతో కలుపుతూ ఉండాలి.

టమాటా గుజ్జు ఉపయోగించండి

గ్రేవీ కూరలు తయారు చేసేటప్పుడు టమాటాలను ముక్కలుగా వేయడానికి బదులుగా గుజ్జుగా చేసి ఉపయోగించవచ్చు. టమాటా గుజ్జు కూరకు మంచి చిక్కదనాన్ని, తేమను అందిస్తుంది. దీనివల్ల మసాలాలు పొడిగా మారి అడుగున అంటుకునే అవకాశం తగ్గుతుంది. అవసరాన్ని బట్టి కొద్దిగా నీళ్లు కూడా కలుపుకోవచ్చు.

మంటను నియంత్రించడం ముఖ్యం

వంట చేసేటప్పుడు మంటను ఎప్పుడూ ఎక్కువగా ఉంచకూడదు. ముందుగా కడాయిని మీడియం మంటపై వేడి చేసి, ఆ తర్వాత నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాతే తాలింపు గింజలు, ఉల్లిపాయలు లేదా కూరగాయలు వేయాలి. ఎక్కువ మంటపై వండితే కూర త్వరగా మాడిపోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నాన్‌స్టిక్ పాత్రలను ఖాళీగా ఎక్కువసేపు అధిక మంటపై వేడి చేయకూడదు.

వంట చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి

కూరను కడాయిలో వేసి అలాగే వదిలేయకుండా మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. పాత్ర అడుగున కూర అంటుకుంటున్నట్లు అనిపిస్తే మంట తగ్గించి కొద్దిగా నీళ్లు చల్లాలి. నాన్‌స్టిక్ పాత్రల్లో వంట చేసేటప్పుడు చెక్క లేదా సిలికాన్ గరిటెలను ఉపయోగించడం మంచిది. లోహపు గరిటెలతో గీకడం వల్ల పాత్రపై ఉండే పూత దెబ్బతినవచ్చు.

ఇక కూర వండటానికి సరైన పరిమాణంలో పాత్రను ఎంచుకోవడం కూడా ముఖ్యం. మరీ చిన్న పాత్రలో ఎక్కువ కూర వేస్తే సమానంగా ఉడకదు. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే నూనెను ఎక్కువగా ఉపయోగించకుండానే కూరలు అడుగున అంటుకోకుండా రుచిగా తయారు చేసుకోవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 02 November 2026, 6:39 pm Digital Edition : Prabhanews
Less oil cooking tips: ఎక్కువ నూనె పోయాల్సిన అవసరం లేదు.. కూరలు అడుగున అంటుకోకుండా చేసే సింపుల్ చిట్కాలు ఇవే! | లైఫ్ స్టైల్

Last Updated:Nov 02, 2026 5:53 PM ISTవంట రుచి మారిపోవడమే కాకుండా, గిన్నెను శుభ్రం చేయడం కూడా పెద్ద పనిగా మారుతుంది. ఈ సమస్యను తగ్గించుకోవడానికి కొందరు నూనె ఎక్కువగా పోస్తుంటారు. కానీ ప్రతిరోజూ ఎక్కువ నూనె వాడటం ఆరోగ్యానికి మంచిది కాదు. అయితే కొన్ని చిన్న చిట్కాలు పాటిస్తే తక్కువ నూనెతోనే కూరలు అడుగున అంటుకోకుండా, రుచిగా వండుకోవచ్చు.News18వంట చేసేటప్పుడు చాలామందికి ఎదురయ్యే సాధారణ సమస్య కూరలు కడాయి అడుగున అంటుకుని మాడిపోవడం. ఎంత జాగ్రత్తగా వంట చేసినా కొన్నిసార్లు కూర అడుగుపట్టేస్తుంది. దీనివల్ల వంట రుచి మారిపోవడమే కాకుండా, గిన్నెను శుభ్రం చేయడం కూడా పెద్ద పనిగా మారుతుంది. ఈ సమస్యను తగ్గించుకోవడానికి కొందరు నూనె ఎక్కువగా పోస్తుంటారు. కానీ ప్రతిరోజూ ఎక్కువ నూనె వాడటం ఆరోగ్యానికి మంచిది కాదు. అయితే కొన్ని చిన్న చిట్కాలు పాటిస్తే తక్కువ నూనెతోనే కూరలు అడుగున అంటుకోకుండా, రుచిగా వండుకోవచ్చు.కడాయికి కొద్దిగా నూనె పట్టించండిఏదైనా కూర వండే ముందు కడాయిలో కొద్దిగా నూనె వేసి దాని అడుగు భాగం మొత్తం పట్టేలా చేయాలి. ఇందుకోసం చిన్న చెంచా లేదా సిలికాన్ బ్రష్ ఉపయోగించవచ్చు. ఇలా చేయడం వల్ల కూరగాయలు, మసాలాలు నేరుగా పాత్రకు అంటుకునే అవకాశం తగ్గుతుంది. ముఖ్యంగా కూర వండే పాత్రను బట్టి నూనె పరిమాణాన్ని నిర్ణయించుకోవాలి. ఎక్కువ నూనె పోయాల్సిన అవసరం లేదు.మసాలాలు మాడిపోకుండా ఇలా చేయండిఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలాలు వేయించేటప్పుడు అవి కడాయికి అంటుకుంటున్నట్లు అనిపిస్తే ఒకటి లేదా రెండు చెంచాల నీళ్లు చల్లాలి. దీనివల్ల మసాలాలు తేమగా ఉండి త్వరగా మాడిపోకుండా ఉంటాయి. అయితే పొడి కూరలు చేసేటప్పుడు నీళ్లు మరీ ఎక్కువగా పోయకూడదు. అవసరమైనంత మాత్రమే చల్లాలి. అలాగే మసాలాలు వేసిన తర్వాత మధ్యమధ్యలో గరిటెతో కలుపుతూ ఉండాలి.టమాటా గుజ్జు ఉపయోగించండిగ్రేవీ కూరలు తయారు చేసేటప్పుడు టమాటాలను ముక్కలుగా వేయడానికి బదులుగా గుజ్జుగా చేసి ఉపయోగించవచ్చు. టమాటా గుజ్జు కూరకు మంచి చిక్కదనాన్ని, తేమను అందిస్తుంది. దీనివల్ల మసాలాలు పొడిగా మారి అడుగున అంటుకునే అవకాశం తగ్గుతుంది. అవసరాన్ని బట్టి కొద్దిగా నీళ్లు కూడా కలుపుకోవచ్చు.మంటను నియంత్రించడం ముఖ్యంవంట చేసేటప్పుడు మంటను ఎప్పుడూ ఎక్కువగా ఉంచకూడదు. ముందుగా కడాయిని మీడియం మంటపై వేడి చేసి, ఆ తర్వాత నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాతే తాలింపు గింజలు, ఉల్లిపాయలు లేదా కూరగాయలు వేయాలి. ఎక్కువ మంటపై వండితే కూర త్వరగా మాడిపోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నాన్‌స్టిక్ పాత్రలను ఖాళీగా ఎక్కువసేపు అధిక మంటపై వేడి చేయకూడదు.వంట చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరికూరను కడాయిలో వేసి అలాగే వదిలేయకుండా మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. పాత్ర అడుగున కూర అంటుకుంటున్నట్లు అనిపిస్తే మంట తగ్గించి కొద్దిగా నీళ్లు చల్లాలి. నాన్‌స్టిక్ పాత్రల్లో వంట చేసేటప్పుడు చెక్క లేదా సిలికాన్ గరిటెలను ఉపయోగించడం మంచిది. లోహపు గరిటెలతో గీకడం వల్ల పాత్రపై ఉండే పూత దెబ్బతినవచ్చు.ఇక కూర వండటానికి సరైన పరిమాణంలో పాత్రను ఎంచుకోవడం కూడా ముఖ్యం. మరీ చిన్న పాత్రలో ఎక్కువ కూర వేస్తే సమానంగా ఉడకదు. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే నూనెను ఎక్కువగా ఉపయోగించకుండానే కూరలు అడుగున అంటుకోకుండా రుచిగా తయారు చేసుకోవచ్చు.మరింత చదవండి

Source link