ప్రభన్యూస్

Bigg Boss: బిగ్‌బాస్ హౌస్‌లో ప్రేమకథ.. కన్నీళ్లు పెట్టుకుని కూతురిని తీసుకెళ్లిన తల్లిదండ్రులు! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

బిగ్‌బాస్ షోలో పుట్టే ప్రేమ నిజమైనదా? లేక ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సృష్టించే ట్రాక్‌నా? అనే ప్రశ్నకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు. కొందరు కంటెస్టెంట్లు షో హైప్ కోసం ప్రేమికుల్లా నటిస్తుంటే.. మరికొందరు మాత్రం నిజంగానే తోటి కంటెస్టెంట్లపై ప్రేమ పెంచుకుంటారు.

News18
News18

బిగ్‌బాస్ షోలో పుట్టే ప్రేమ నిజమైనదా? లేక ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సృష్టించే ట్రాక్‌నా? అనే ప్రశ్నకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు. కొందరు కంటెస్టెంట్లు షో హైప్ కోసం ప్రేమికుల్లా నటిస్తుంటే.. మరికొందరు మాత్రం నిజంగానే తోటి కంటెస్టెంట్లపై ప్రేమ పెంచుకుంటారు. అయితే మలయాళ బిగ్‌బాస్ తాజా సీజన్‌లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. ప్రేమలో పడిన ఓ అమ్మాయి కోసం ఏకంగా ఆమె తల్లిదండ్రులే బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చి కన్నీళ్లు పెట్టుకోవడం ఈ వ్యవహారంలో అసలైన ట్విస్ట్‌గా మారింది.

మలయాళంలో ప్రస్తుతం బిగ్‌బాస్ 8వ సీజన్ ప్రసారమవుతోంది. ఈ షోకు మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇందులో కంటెస్టెంట్‌గా పాల్గొంటున్న నేహా ఫాతిమా.. మరో కంటెస్టెంట్ సంతోష్ రాజ్ అలియాస్ తషిపై తన ప్రేమను వ్యక్తం చేసింది. షోలోనే అతడికి ప్రపోజ్ చేసిన నేహా.. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనే తన మనసులోని మాటను వెల్లడించింది.

సాధారణంగా బిగ్‌బాస్ షోలో ప్రేమకథలు, రొమాంటిక్ ట్రాక్‌లు కొత్తేమీ కాదు. ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచేందుకు ఇలాంటి వ్యవహారాలను నిర్వాహకులు ఎక్కువగా హైలైట్ చేస్తుంటారు. అయితే నేహా ఫాతిమా, సంతోష్ రాజ్ మధ్య సాగుతున్న ప్రేమ వ్యవహారం ఈసారి షోలో ప్రధాన ఆకర్షణగా మారింది. వీరిద్దరి మధ్య జరిగే సంభాషణలు, ప్రేమకు సంబంధించిన అంశాలను ఎపిసోడ్‌లలో ఆసక్తికరంగా చూపిస్తున్నారు.

ఇదిలా ఉండగా, షోలో జరుగుతున్న పరిణామాలను గమనించిన నేహా ఫాతిమా తల్లిదండ్రులు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. నేరుగా బిగ్‌బాస్ హౌస్‌కు వచ్చి తమ కూతురిని ఇంటికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో వారు కన్నీళ్లు పెట్టుకోవడం, నేహా భావోద్వేగానికి గురికావడం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఒకవైపు తల్లిదండ్రులు, మరోవైపు కుమార్తె, ఆమె ప్రేమించిన వ్యక్తి.. ఇలా భావోద్వేగాలతో కూడిన సన్నివేశాన్ని హోస్ట్ మోహన్ లాల్ నడిపించారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వ్యవహారం నిజంగా జరిగినదేనా? లేక షో రేటింగ్‌లు, ప్రచారం కోసం రూపొందించిన స్క్రిప్టెడ్ డ్రామానా? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. గతంలో బిగ్‌బాస్‌లో ఎన్నో ప్రేమకథలు కనిపించినప్పటికీ, ఇలా తల్లిదండ్రులు స్వయంగా షోలోకి వచ్చి కూతురిని తీసుకెళ్లడం మాత్రం ప్రేక్షకులకు కొత్తగా అనిపిస్తోంది.

మరోవైపు సంతోష్ రాజ్ హిందువు కావడం వల్లే నేహా తల్లిదండ్రులు ఈ ప్రేమను వ్యతిరేకించారని సోషల్ మీడియాలో కొందరు చర్చిస్తున్నారు. అయితే ఈ వాదనపై స్పష్టత రావాల్సి ఉంది. మొత్తానికి బిగ్‌బాస్ హౌస్‌లో మొదలైన ఈ ప్రేమకథ.. ఇప్పుడు షో పరిధిని దాటి సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. నిజమైన ప్రేమనా? లేక మరో బిగ్‌బాస్ డ్రామానా? అనేది మాత్రం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 02 November 2026, 4:16 pm Digital Edition : Prabhanews
Bigg Boss: బిగ్‌బాస్ హౌస్‌లో ప్రేమకథ.. కన్నీళ్లు పెట్టుకుని కూతురిని తీసుకెళ్లిన తల్లిదండ్రులు! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Nov 02, 2026 4:04 PM ISTబిగ్‌బాస్ షోలో పుట్టే ప్రేమ నిజమైనదా? లేక ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సృష్టించే ట్రాక్‌నా? అనే ప్రశ్నకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు. కొందరు కంటెస్టెంట్లు షో హైప్ కోసం ప్రేమికుల్లా నటిస్తుంటే.. మరికొందరు మాత్రం నిజంగానే తోటి కంటెస్టెంట్లపై ప్రేమ పెంచుకుంటారు.News18బిగ్‌బాస్ షోలో పుట్టే ప్రేమ నిజమైనదా? లేక ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సృష్టించే ట్రాక్‌నా? అనే ప్రశ్నకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు. కొందరు కంటెస్టెంట్లు షో హైప్ కోసం ప్రేమికుల్లా నటిస్తుంటే.. మరికొందరు మాత్రం నిజంగానే తోటి కంటెస్టెంట్లపై ప్రేమ పెంచుకుంటారు. అయితే మలయాళ బిగ్‌బాస్ తాజా సీజన్‌లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. ప్రేమలో పడిన ఓ అమ్మాయి కోసం ఏకంగా ఆమె తల్లిదండ్రులే బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చి కన్నీళ్లు పెట్టుకోవడం ఈ వ్యవహారంలో అసలైన ట్విస్ట్‌గా మారింది.మలయాళంలో ప్రస్తుతం బిగ్‌బాస్ 8వ సీజన్ ప్రసారమవుతోంది. ఈ షోకు మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇందులో కంటెస్టెంట్‌గా పాల్గొంటున్న నేహా ఫాతిమా.. మరో కంటెస్టెంట్ సంతోష్ రాజ్ అలియాస్ తషిపై తన ప్రేమను వ్యక్తం చేసింది. షోలోనే అతడికి ప్రపోజ్ చేసిన నేహా.. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనే తన మనసులోని మాటను వెల్లడించింది.సాధారణంగా బిగ్‌బాస్ షోలో ప్రేమకథలు, రొమాంటిక్ ట్రాక్‌లు కొత్తేమీ కాదు. ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచేందుకు ఇలాంటి వ్యవహారాలను నిర్వాహకులు ఎక్కువగా హైలైట్ చేస్తుంటారు. అయితే నేహా ఫాతిమా, సంతోష్ రాజ్ మధ్య సాగుతున్న ప్రేమ వ్యవహారం ఈసారి షోలో ప్రధాన ఆకర్షణగా మారింది. వీరిద్దరి మధ్య జరిగే సంభాషణలు, ప్రేమకు సంబంధించిన అంశాలను ఎపిసోడ్‌లలో ఆసక్తికరంగా చూపిస్తున్నారు.ఇదిలా ఉండగా, షోలో జరుగుతున్న పరిణామాలను గమనించిన నేహా ఫాతిమా తల్లిదండ్రులు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. నేరుగా బిగ్‌బాస్ హౌస్‌కు వచ్చి తమ కూతురిని ఇంటికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో వారు కన్నీళ్లు పెట్టుకోవడం, నేహా భావోద్వేగానికి గురికావడం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఒకవైపు తల్లిదండ్రులు, మరోవైపు కుమార్తె, ఆమె ప్రేమించిన వ్యక్తి.. ఇలా భావోద్వేగాలతో కూడిన సన్నివేశాన్ని హోస్ట్ మోహన్ లాల్ నడిపించారు.ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వ్యవహారం నిజంగా జరిగినదేనా? లేక షో రేటింగ్‌లు, ప్రచారం కోసం రూపొందించిన స్క్రిప్టెడ్ డ్రామానా? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. గతంలో బిగ్‌బాస్‌లో ఎన్నో ప్రేమకథలు కనిపించినప్పటికీ, ఇలా తల్లిదండ్రులు స్వయంగా షోలోకి వచ్చి కూతురిని తీసుకెళ్లడం మాత్రం ప్రేక్షకులకు కొత్తగా అనిపిస్తోంది.మరోవైపు సంతోష్ రాజ్ హిందువు కావడం వల్లే నేహా తల్లిదండ్రులు ఈ ప్రేమను వ్యతిరేకించారని సోషల్ మీడియాలో కొందరు చర్చిస్తున్నారు. అయితే ఈ వాదనపై స్పష్టత రావాల్సి ఉంది. మొత్తానికి బిగ్‌బాస్ హౌస్‌లో మొదలైన ఈ ప్రేమకథ.. ఇప్పుడు షో పరిధిని దాటి సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. నిజమైన ప్రేమనా? లేక మరో బిగ్‌బాస్ డ్రామానా? అనేది మాత్రం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.మరింత చదవండి

Source link