ఈ కొత్త పోర్ట్‌ఫోలియోలో మొత్తం 28 కొత్త ఎస్‌కేయూలు (SKUలు) ఉన్నాయి. వీటిలో ఇండిపెండెన్స్ పవర్ అప్, ఇండిపెండెన్స్ బటర్ బ్లిస్, ఇండిపెండెన్స్ మిల్కీ పవర్, ఇండిపెండెన్స్ మేరీ ప్రైమ్, ఇండిపెండెన్స్ కోకో వనిల్లా అండ్ చాక్లెట్, ఇండిపెండెన్స్ క్రీమ్‌యమ్ ఆరెంజ్, ఇండిపెండెన్స్ క్రీమ్‌యమ్ చోకో, ఇండిపెండెన్స్ కోకో బోర్బన్, ఇండిపెండెన్స్ గ్లూకోజ్ బూస్ట్ ఉన్నాయి. ఈ బిస్కెట్లు వేర్వేరు ధరల్లో అందుబాటులో ఉంటాయి. మొదటిసారి కొనుగోలు చేసి రుచి చూడాలనుకునే వారి కోసం రూ.5 ట్రయల్ ప్యాక్స్ తీసుకొస్తున్నారు. రూ.10కు షేరింగ్ ప్యాక్స్ అందుబాటులో ఉంటాయి. కుటుంబ అవసరాల కోసం పెద్ద ప్యాక్స్‌ను రూ.40 నుంచి రూ.125 మధ్య ధరల్లో విక్రయించనున్నారు.
ఈ కొత్త ఉత్పత్తుల్లో ఇండిపెండెన్స్ పవర్ అప్, ఇండిపెండెన్స్ మిల్కీ పవర్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ముఖ్యంగా పవర్ అప్ బిస్కెట్‌లో పాలు, గ్లూకోజ్, ప్రోటీన్ కలిపి అందిస్తున్నారు. సాధారణంగా మార్కెట్లో లభించే రోజువారీ బిస్కెట్లకు భిన్నంగా ఈ ఉత్పత్తిని తీసుకొచ్చినట్లు కంపెనీ తెలిపింది. రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ డైరెక్టర్ టీ కృష్ణకుమార్ మాట్లాడుతూ.. “మా బిస్కెట్ వ్యాపారానికి తమిళనాడు చాలా కీలకమైన మార్కెట్. మారుతున్న కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టుగా కొత్త ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు వ్యాపారాన్ని విస్తరించడంపై మేం దృష్టి పెట్టాం. ఇప్పటికే చాలా ఇళ్లలో పాలతో తయారయ్యే బిస్కెట్లకు మంచి ఆదరణ ఉంది. ఈ అలవాటును దృష్టిలో పెట్టుకుని ఇండిపెండెన్స్ పవర్ అప్ బిస్కెట్లను తీసుకొస్తున్నాం. ఇందులో పాలు, గ్లూకోజ్, ప్రోటీన్‌ను ఒకే బిస్కెట్‌లో అందిస్తున్నాం. ఇది సాధారణ బిస్కెట్లకు భిన్నమైన ఉత్పత్తి.

మా మొత్తం బిస్కెట్ పోర్ట్‌ఫోలియో ‘Each Consumer, Each Occasion’ అనే ఆలోచనతో రూపొందింది. అంటే ప్రతి కస్టమర్ అవసరాన్ని, ప్రతి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని ఉత్పత్తులను అందించడమే మా లక్ష్యం. కస్టమర్ల అవసరాలను అర్థం చేసుకుని, వారికి ఉపయోగపడే ఉత్పత్తులను రూపొందించడం ద్వారా మరింత మెరుగైన విలువను అందించాలని భావిస్తున్నాం” అని తెలిపారు.
ఇండిపెండెన్స్ పవర్ అప్ బిస్కెట్‌ను మరింత మందికి చేరువ చేసేందుకు రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, అజిత్ కుమార్ రేసింగ్‌తో బ్రాండ్ అసోసియేషన్ కుదుర్చుకుంది. మోటార్‌స్పోర్ట్స్‌లో వేగం, పనితీరుకు ఉండే ప్రాధాన్యతకు అనుగుణంగా పవర్ అప్ బిస్కెట్‌ను ప్రత్యేకంగా ప్రమోట్ చేయాలని కంపెనీ భావిస్తోంది. ఈ భాగస్వామ్యం ద్వారా తమిళనాడులో బ్రాండ్‌కు మరింత గుర్తింపు తీసుకురావడంతో పాటు, కొత్త బిస్కెట్ల గురించి ఎక్కువ మంది కస్టమర్లకు అవగాహన కల్పించాలన్నది లక్ష్యం.
ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో అందుబాటులోకి కొత్త బిస్కెట్లు
కొత్త ఇండిపెండెన్స్ బిస్కెట్లను ఎక్కువ మంది కస్టమర్లకు అందుబాటులోకి తీసుకురావడానికి కంపెనీ విస్తృతమైన డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకోనుంది. సాధారణ కిరాణా దుకాణాలు, జాతీయ స్థాయి, ప్రాంతీయ మోడ్రన్ ట్రేడ్ స్టోర్లు, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్, రిలయన్స్ రిటైల్ స్టోర్లు, హోల్‌సేల్ మార్కెట్ల ద్వారా వీటిని విక్రయించనున్నారు. మొత్తంగా చూస్తే, 9 కొత్త వేరియంట్లు, రూ.5 నుంచి ప్రారంభమయ్యే ధరలు, విస్తృతమైన విక్రయ వ్యవస్థతో తమిళనాడులో తన బిస్కెట్ వ్యాపారాన్ని మరింత పెంచుకోవాలని రిలయన్స్ లక్ష్యంగా పెట్టుకుంది. రోజువారీ వినియోగం నుంచి కుటుంబ అవసరాల వరకు వివిధ రకాల కస్టమర్లను ఆకర్షించేలా ఈ కొత్త పోర్ట్‌ఫోలియోను అందుబాటులోకి తీసుకొస్తోంది.
