Last Updated:
హర్యానాలోని పంచకుల సంస్కృతి మోడల్ స్కూల్లో మూడో తరగతి బాలుడు కేజీ చదువుతున్న చిన్నారిపై రాళ్లు, పూలకుండీతో దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన బాలికను చండీగఢ్ పీజీఐ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు విచారణ చేపట్టారు.
హర్యానా రాష్ట్రంలోని పంచకుల సెక్టార్ 20 పరిధిలో ఉన్న సంస్కృతి మోడల్ స్కూల్లో అత్యంత భయానక ఘటన చోటుచేసుకుంది. మూడో తరగతి చదువుతున్న ఒక బాలుడు, ప్రత్యేక అవసరాలు కలిగిన కేజీ చిన్నారిపై రాళ్లు, ఇటుకలు, పూలకుండీతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. తలపై బలంగా దెబ్బలు తగలడంతో ఆ చిన్నారి అక్కడికక్కడే స్పృహ కోల్పోయింది. బాలిక కిందపడిపోయిన తర్వాత కూడా ఆ బాలుడు దాడి ఆపకుండా కొంత దూరం ఈడ్చుకెళ్లడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగిస్తోంది.
రక్తపు మడుగులో ఉన్న చిన్నారిని పాఠశాల సిబ్బంది వెంటనే సెక్టార్ 6 సివిల్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి అత్యంత విషమంగా మారడంతో మెరుగైన వైద్యం నిమిత్తం చండీగఢ్ పీజీఐ ఆసుపత్రిలోని ఐసీయూకి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. చిన్నారి ప్రాణాల కోసం వైద్యులు తీవ్రంగా పోరాడుతున్నారు.
ఈ దారుణానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు బయటకు రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల ఆవరణలో ఇంత జరుగుతున్నా సిబ్బంది పర్యవేక్షణ లోపించడంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సమాచారం అందుకున్న సెక్టార్ 20 ఎస్హెచ్‌ఓ యశ్‌దీప్, దర్యాప్తు అధికారి ప్రదీప్ కుమార్ తమ బృందంతో కలిసి పాఠశాలకు చేరుకున్నారు.
CCTV from Sanskriti Model School in Sector 20, Panchkula, shows a Class 3 student allegedly attacking a KG girl with special needs with stones and a flowerpot. The girl is now in critical condition at PGI Chandigarh
According to reports, the assault continued even after she lost consciousness. She was first taken to the Civil Hospital in Sector 6 and then referred to PGIPolice have reached the school, are gathering details from the management and are questioning the parents of the accused child. The incident has raised serious questions about children’s safety and the school’s monitoring system
#panchkula #ʜᴀʀʏᴀɴᴀ #schoolsafety #childsafety
— News18 (@CNNnews18) October 31, 2026
ఘటన పూర్వాపరాలను తెలుసుకునేందుకు పోలీసులు పాఠశాల యాజమాన్యాన్ని విచారిస్తున్నారు. దాడికి పాల్పడిన బాలుడి మానసిక స్థితిని అర్థం చేసుకునేందుకు ఆ విద్యార్థి తల్లిదండ్రులను కూడా పిలిపించి ప్రశ్నిస్తున్నారు. స్కూల్ క్యాంపస్‌లో విద్యార్థుల రక్షణపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

