ఈ సందర్భంగా విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. బేబీ పరిణితతో సినిమా చేయాలనే ఉద్దేశంతోనే దర్శకుడు, నిర్మాత పుట్టారేమో అనిపిస్తోందని సరదాగా వ్యాఖ్యానించారు. తెలుగు సినిమా చరిత్రలో పరిణితకు ప్రత్యేకమైన పేజీ ఉండబోతోందని అన్నారు. దర్శకుడు శరత్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించి ఉంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. హీరో రజత్ రాఘవ్‌కు ఈ చిత్రం మంచి పేరు, డబ్బు తీసుకురావాలని ఆకాంక్షించారు. ‘డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్’ పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పారు.
హీరో రజత్ రాఘవ్ మాట్లాడుతూ.. విజయేంద్ర ప్రసాద్‌తో కలిసి వేదికను పంచుకుని తొమ్మిదేళ్లు అవుతోందని గుర్తుచేసుకున్నారు. ఆయన తనపై నమ్మకంతో ‘శ్రీవల్లి’ సినిమాలో అవకాశం ఇచ్చారని, తనకు గుర్తింపు రావడానికి ఆయన అందించిన ప్రోత్సాహం ఎంతో ఉపయోగపడిందని తెలిపారు. హాసిని సుధీర్ సెట్స్‌లో ఎంతో సరదాగా ఉంటారని చెప్పారు. ‘డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్’ సినిమా రోలర్ కోస్టర్ రైడ్‌లా సాగుతుందని, కుటుంబ విలువలను చాటిచెప్పే ఈ కథ ప్రతి కుటుంబానికి కనెక్ట్ అవుతుందని రజత్ పేర్కొన్నారు.
దర్శకుడు శరత్ మాట్లాడుతూ.. రజత్తో తనకు ఎనిమిదేళ్ల స్నేహం ఉందని, తాను చెప్పిన కథ నచ్చడంతో ఆయన ఈ ప్రాజెక్ట్‌కు అండగా నిలిచారని తెలిపారు. సినిమా ప్రయాణంలో రజత్ ఎప్పుడూ తనకు మద్దతుగా ఉన్నారని చెప్పారు. నిర్మాత డి. దీపక్ కూడా ఎక్కడా వెనుకడుగు వేయకుండా సహకరించారని వెల్లడించారు. ప్రతి ఆర్టిస్ట్ తనకు ఎంతో సపోర్ట్ చేశారని, సినిమా షూటింగ్ మొత్తం పిక్నిక్లా సరదాగా సాగిందని, అందరూ అద్భుతంగా నటించారని అన్నారు.
నిర్మాత డి. దీపక్ మాట్లాడుతూ.. ‘డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్’ తన తొలి సినిమా అని తెలిపారు. షూటింగ్ సమయంలో సెట్స్‌లో ఎప్పుడూ పండుగ వాతావరణం కనిపించేదని చెప్పారు. తమ చిత్ర టీజర్ విడుదల కార్యక్రమానికి వచ్చి ప్రోత్సహించిన విజయేంద్ర ప్రసాద్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమా నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుందని వెల్లడించారు.
హాసిని సుధీర్ దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు తెలుపుతూ, శరత్ ఎంతో అంకితభావంతో వేగంగా సినిమాను పూర్తి చేశారని ప్రశంసించారు. బేబీ పరిణిత, మాస్టర్ బన్నీ చక్కగా నటించారని చెప్పారు. నటుడు రాకేష్ కూడా చిత్ర బృందం ఎంతో కష్టపడి ఈ సినిమాను రూపొందించిందని తెలిపారు. బేబీ పరిణిత షూటింగ్ సమయంలో అందరూ తనకు ఎంతో సహకరించారని చెప్పగా, మాస్టర్ బన్నీ పిల్లలకు తల్లిదండ్రులే మొదటి స్నేహితులని పేర్కొన్నారు.
కుటుంబ బంధాలు, తల్లిదండ్రులు, పిల్లల మధ్య స్నేహానికి ప్రాధాన్యతనిస్తూ రూపొందిన ‘డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్’ నవంబర్ 27న థియేటర్లలో విడుదల కానుంది.
తారాగణం: రజత్ రాఘవ్, కాజల్ చౌదరి, హాసిని సుధీర్, బేబీ పరిణిత రుద్రరాజు తదితరులు.
సాంకేతిక బృందం: వెన్నెల సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై డి. దీపక్ నిర్మిస్తున్నారు. శరత్ రచన, దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. సంగీతం ఆర్.హెచ్. విక్రమ్, సినిమాటోగ్రఫీ కుశ్వంత్ కుమార్, కాస్ట్యూమ్ డిజైనర్ మానస వర్మ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కృష్ణ వర్ధన్. పీఆర్ఓ మాడూరి మధు.
