Last Updated:
1000 Rupee Note: రూ.1,000 నోటు మళ్లీ చెలామణిలోకి వస్తోందా? నవంబర్ 15 నుంచి కొత్త నోట్లు మార్కెట్లోకి వస్తాయంటూ సోషల్ మీడియాలో ఓ ఫొటో వైరల్ అవుతోంది. గుడి చిత్రం ఉన్న పసుపు రంగు నోటును ఆర్బీఐ విడుదల చేసిందని జరుగుతున్న ప్రచారంపై PIB ఫ్యాక్ట్ చెక్ కీలక స్పష్టత ఇచ్చింది. అసలు ఈ వార్తలో నిజమెంత? కొత్త రూ.1,000 నోటు వస్తోందా? తెలుసుకుందాం.
దేశంలో రూ.1,000 నోటు మళ్లీ చెలామణిలోకి రాబోతోందా? ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ విషయంపై చర్చ జరుగుతోంది. ఒక గుడి చిత్రం ఉన్న పసుపు రంగు రూ.1,000 నోటు ఫొటో వైరల్ అవుతోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఈ కొత్త నోటును విడుదల చేసిందని, నవంబర్ 15 నుంచి మార్కెట్లో అందుబాటులోకి వస్తుందని కొన్ని పోస్టుల్లో ప్రచారం చేస్తున్నారు. దీంతో చాలామంది ఈ సమాచారాన్ని నిజమని నమ్మి ఇతరులకు షేర్ చేస్తున్నారు. అయితే, ఈ వార్తలో నిజం లేదని కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పష్టం చేసింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చిత్రంలో గుడి బొమ్మతో కూడిన పసుపు రంగు రూ.1,000 నోటు కనిపిస్తోంది. ఈ నోటును ఆర్బీఐ కొత్తగా రూపొందించి విడుదల చేసిందని కొందరు ప్రచారం చేస్తున్నారు. అంతేకాకుండా, నవంబర్ 15 నుంచి ఈ నోట్లు మార్కెట్లోకి వస్తాయని పేర్కొంటున్నారు. ఈ సమాచారం నిజమా కాదా అని నిర్ధారించుకోకుండానే కొందరు పోస్టులను షేర్ చేయడంతో గందరగోళం ఏర్పడుతోంది. ముఖ్యంగా పాత రూ.1,000 నోట్ల రద్దు నేపథ్యంలో, ఈ నోటు మళ్లీ వస్తుందనే వార్త ప్రజల్లో ఆసక్తిని పెంచుతోంది.
వైరల్ అవుతున్న ఈ వార్తపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ స్పందించింది. కొత్త రూ.1,000 నోటును విడుదల చేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలాంటి ప్రకటన చేయలేదని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న వాదన పూర్తిగా నకిలీదని వెల్లడించింది. ఈ విషయాన్ని పీఐబీ తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా ప్రజలకు తెలియజేసింది. కాబట్టి గుడి చిత్రం ఉన్న కొత్త రూ.1,000 నోటు విడుదలైందనే వార్తను నమ్మవద్దని, అధికారిక సమాచారం లేకుండా ఇలాంటి పోస్టులను ఇతరులకు పంపవద్దని సూచించింది.
🚨 FAKE ₹1,000 NOTE ALERT!
Several social media posts claim that a new ₹1,000 note has been issued.#PIBFactCheck
❌ This claim is fake.
✅ The @RBI has made no announcement regarding the issuance of a new ₹1,000 note.
🔸 Verify information through official sources and do not share unverified claims.
💡 Come across suspicious content related to the Central Government? Report it to @PIBFactCheck.
📲 +91 8799711259
📩 factcheck@pib.gov.in— PIB Fact Check (@PIBFactCheck) October 27, 2026
ప్రస్తుతం ఆర్బీఐ జారీ చేస్తున్న సాధారణ కరెన్సీ నోట్లలో రూ.10, రూ.20, రూ.50, రూ.100, రూ.200, రూ.500 నోట్లు ఉన్నాయి. రూ.1 నోటును మాత్రం భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేస్తుంది. మరోవైపు, రూ.2, రూ.5 నోట్ల ముద్రణను ఆర్బీఐ చాలా కాలం క్రితమే నిలిపివేసింది. అయితే, గతంలో జారీ చేసిన ఈ నోట్లు ఎవరి దగ్గరైనా ఉంటే, అవి చట్టబద్ధంగా చెల్లుబాటులో ఉన్నంతవరకు వాటిని ఉపయోగించవచ్చు. నోట్ల ముద్రణ నిలిపివేయడం, వాటి చెల్లుబాటును రద్దు చేయడం రెండూ వేర్వేరు విషయాలు.
కరెన్సీ నోట్లకు సంబంధించిన వార్తలు ఆర్థిక లావాదేవీలపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో వాటిని నమ్మే ముందు జాగ్రత్తగా పరిశీలించాలి. కొత్త నోట్ల విడుదల, పాత నోట్ల రద్దు వంటి కీలక నిర్ణయాలపై ఆర్బీఐ అధికారిక వెబ్సైట్ లేదా ప్రభుత్వ ప్రకటనలను పరిశీలించడం మంచిది. అనుమానాస్పద సమాచారం కనిపిస్తే పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం ద్వారా కూడా నిర్ధారించుకోవచ్చు. నకిలీ వార్తలను గుర్తించినప్పుడు వాటిని మరింతగా వ్యాప్తి చేయకుండా ఉండాలి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అనుమానాస్పద సమాచారాన్ని పీఐబీ ఫ్యాక్ట్ చెక్కు +91 8799711259 నంబర్ లేదా factcheck@pib.gov.in ఈమెయిల్ ద్వారా నివేదించవచ్చు.
మొత్తంగా, గుడి చిత్రం ఉన్న కొత్త రూ.1,000 నోటును ఆర్బీఐ విడుదల చేసిందనే వార్తలో నిజం లేదు. నవంబర్ 15 నుంచి ఈ నోట్లు మార్కెట్లోకి వస్తాయనే ప్రచారానికీ అధికారిక ఆధారం లేదు. కాబట్టి సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ప్రతి సమాచారాన్ని నిజమని నమ్మకుండా, సంబంధిత అధికారిక సంస్థల ప్రకటనల ద్వారా నిర్ధారించుకోవాలి.

