ప్రభన్యూస్

మానవత్వాన్ని చాటుకున్న యాక్టర్ దశరధ.. కమెడియన్ రామచంద్రకు ఆర్ధిక సాయం | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

‘వెంకీ’ సినిమా ద్వారా ప్రేక్షకులకు సుపరిచితమైన కమెడియన్ రామచంద్ర అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న దశరధ, ఆయనను పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు.

News18
News18

సినీ పరిశ్రమలో నటుడిగా తనదైన గుర్తింపు సంపాదించుకుంటున్న అయినబత్తిన దశరధ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. ‘వెంకీ’ సినిమా ద్వారా ప్రేక్షకులకు సుపరిచితమైన కమెడియన్ రామచంద్ర అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న దశరధ, ఆయనను పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. బ్రెయిన్ ట్యూమర్, పక్షవాతం సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందుతున్న రామచంద్రకు దశరధ ధైర్యం చెప్పారు. తోటి కళాకారుడి కష్టాన్ని అర్థం చేసుకుని, తన వంతు సహాయం అందించడం ద్వారా మానవత్వమే నిజమైన గొప్పతనమని చాటుకున్నారు.

ఈ సందర్భంగా దశరధ మాట్లాడుతూ.. సినీ పరిశ్రమలోని హీరోలు, హీరోయిన్లు, నటీనటులు, సాంకేతిక నిపుణులు, ఇతర కళాకారులంతా ఒక కుటుంబంలా ముందుకొచ్చి రామచంద్రకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఆయన చికిత్సకు మరింత సహాయం అందించే దిశగా ఈ విషయాన్ని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు గారి దృష్టికి తీసుకెళ్లేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని తెలిపారు. దశరధ చూపిన మానవత్వానికి రామచంద్ర కృతజ్ఞతలు తెలిపారు. అలాగే నటుడిగా దశరధ వెండితెర ప్రయాణం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ, అక్టోబర్ 30న విడుదల కానున్న ‘కిల్లర్’ సినిమా ఘనవిజయం సాధించాలని మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలిపారు.

కష్టాల్లో ఉన్న తోటి కళాకారులకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని దశరధ పేర్కొన్నారు. సినీ పరిశ్రమలో పరస్పర సహకారం, సానుభూతి, ఐక్యత మరింత పెరగాలని, రామచంద్ర త్వరగా కోలుకునేందుకు తెలుగు సినీ కుటుంబం తమ వంతు సహకారం అందించాలని ఆయన కోరారు. మానవత్వంతో చేసే చిన్న సహాయం కూడా ఒకరి జీవితంలో కొత్త ఆశను నింపగలదు అన్నారు. ప్రస్తుతం ‘కిల్లర్’ సినిమాలో నటిస్తూ, లైన్ ప్రొడ్యూసర్‌గా దశరధ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 30 న ఈ సినిమా రిలీజ్ కానుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 26 October 2026, 6:04 pm Digital Edition : Prabhanews
మానవత్వాన్ని చాటుకున్న యాక్టర్ దశరధ.. కమెడియన్ రామచంద్రకు ఆర్ధిక సాయం | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 26, 2026 6:02 PM IST‘వెంకీ’ సినిమా ద్వారా ప్రేక్షకులకు సుపరిచితమైన కమెడియన్ రామచంద్ర అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న దశరధ, ఆయనను పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు.
News18సినీ పరిశ్రమలో నటుడిగా తనదైన గుర్తింపు సంపాదించుకుంటున్న అయినబత్తిన దశరధ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. ‘వెంకీ’ సినిమా ద్వారా ప్రేక్షకులకు సుపరిచితమైన కమెడియన్ రామచంద్ర అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న దశరధ, ఆయనను పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. బ్రెయిన్ ట్యూమర్, పక్షవాతం సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందుతున్న రామచంద్రకు దశరధ ధైర్యం చెప్పారు. తోటి కళాకారుడి కష్టాన్ని అర్థం చేసుకుని, తన వంతు సహాయం అందించడం ద్వారా మానవత్వమే నిజమైన గొప్పతనమని చాటుకున్నారు.ఈ సందర్భంగా దశరధ మాట్లాడుతూ.. సినీ పరిశ్రమలోని హీరోలు, హీరోయిన్లు, నటీనటులు, సాంకేతిక నిపుణులు, ఇతర కళాకారులంతా ఒక కుటుంబంలా ముందుకొచ్చి రామచంద్రకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఆయన చికిత్సకు మరింత సహాయం అందించే దిశగా ఈ విషయాన్ని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు గారి దృష్టికి తీసుకెళ్లేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని తెలిపారు. దశరధ చూపిన మానవత్వానికి రామచంద్ర కృతజ్ఞతలు తెలిపారు. అలాగే నటుడిగా దశరధ వెండితెర ప్రయాణం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ, అక్టోబర్ 30న విడుదల కానున్న ‘కిల్లర్’ సినిమా ఘనవిజయం సాధించాలని మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలిపారు.కష్టాల్లో ఉన్న తోటి కళాకారులకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని దశరధ పేర్కొన్నారు. సినీ పరిశ్రమలో పరస్పర సహకారం, సానుభూతి, ఐక్యత మరింత పెరగాలని, రామచంద్ర త్వరగా కోలుకునేందుకు తెలుగు సినీ కుటుంబం తమ వంతు సహకారం అందించాలని ఆయన కోరారు. మానవత్వంతో చేసే చిన్న సహాయం కూడా ఒకరి జీవితంలో కొత్త ఆశను నింపగలదు అన్నారు. ప్రస్తుతం ‘కిల్లర్’ సినిమాలో నటిస్తూ, లైన్ ప్రొడ్యూసర్‌గా దశరధ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 30 న ఈ సినిమా రిలీజ్ కానుంది.మరింత చదవండి

Source link