అరటి ఆకులకు మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. హోటళ్లు, రెస్టారెంట్లు, వివాహాలు, శుభకార్యాలు, ఇతర ప్రత్యేక కార్యక్రమాల్లో అరటి ఆకులను విస్తృతంగా ఉపయోగిస్తారు. దీంతో ప్రత్యేకంగా అరటి ఆకుల కోసం సాగు చేసే రైతుల సంఖ్య కూడా పెరుగుతోంది. సరైన రకం ఎంపిక చేసుకుని, శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేస్తే మంచి దిగుబడి, ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.

