ప్రభన్యూస్

Elon Musk: ఎలాన్ మస్క్ మామూలోడు కాదు బాబోయ్.. మధ్యంతర ఎన్నికలకు ఏకంగా రూ.3,710 కోట్ల ఫండింగ్! |


Last Updated:

అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థుల విజయానికి ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ 442 మిలియన్ డాలర్లకు (దాదాపు రూ.3,710 కోట్లు) పైగా విరాళాలు ఇచ్చి అమెరికా చరిత్రలోనే అత్యంత భారీ రాజకీయ దాతగా రికార్డు సృష్టించారు.

News18
News18

అమెరికాలో నవంబర్ 3న జరగనున్న మధ్యంతర ఎన్నికల ప్రచారంలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సరికొత్త చరిత్ర సృష్టించారు. రిపబ్లికన్ పార్టీ ప్రచారం కోసం ఆయన ఏకంగా 442 మిలియన్ డాలర్లకు (దాదాపు రూ.3,710 కోట్లు) పైగా భారీ విరాళాలు అందించారు. ఈ భారీ మొత్తంతో అమెరికా రాజకీయ చరిత్రలోనే అత్యధికంగా ఎన్నికల విరాళాలు ఇచ్చిన ఏకైక వ్యక్తిగా మస్క్ రికార్డుకెక్కారని ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ నివేదికలు స్పష్టం చేశాయి. కేవలం అక్టోబర్ మొదటి పక్షం రోజుల్లోనే ఆయన తన ‘అమెరికా పీఏసీ’ (America PAC) సంస్థకు 74.8 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.628 కోట్లు) బదిలీ చేశారు. ఆయన సంస్థ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇంక్ మరో 1.98 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.16.6 కోట్లు) జతచేయడంతో ఈ నెలలోనే మొత్తం విరాళాలు 77 మిలియన్ డాలర్లకు (దాదాపు రూ.646 కోట్లు) చేరాయి.

కీలక సెనేట్ స్థానాలపై గురి

రిపబ్లికన్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా మస్క్ స్థాపించిన అమెరికా పీఏసీ నిధుల ప్రవాహాన్ని కొనసాగిస్తోంది. ఈ సంస్థ ఇప్పటివరకు దాదాపు 68.6 మిలియన్ డాలర్లను (దాదాపు రూ.576 కోట్లు) తీవ్ర పోటీ ఉన్న సెనేట్ స్థానాల్లో ప్రచారానికి వెచ్చించింది. ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించడం, డిజిటల్ ప్రచారం నిర్వహించడంపైనే ఈ బృందం ప్రధానంగా దృష్టి సారించింది.

ముఖ్యంగా టెక్సాస్ సెనేట్ ఎన్నికల్లో డెమొక్రాటిక్ నేత జేమ్స్ తలారికోను ఓడించేందుకు 27.9 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.234 కోట్లు), రిపబ్లికన్ అభ్యర్థి కెన్ పాక్స్టన్ మద్దతు కోసం 4.8 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.40 కోట్లు) ఖర్చు చేశారు. ఒహియోలో 9.3 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.78 కోట్లు), మిచిగాన్‌లో 7.7 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.64 కోట్లు), అయోవాలో 2.7 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.22 కోట్లు), మైనేలో 2.1 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.17 కోట్లు) ఖర్చు పెట్టి డెమొక్రాట్లను అడ్డుకుంటున్నారు.

గత సెప్టెంబర్ చివరి నాటికే మస్క్ 366 మిలియన్ డాలర్లకు (దాదాపు రూ.3,074 కోట్లు) పైగా విరాళాలు సమకూర్చారు. ఇందులో భాగంగా రిపబ్లికన్ సెనేట్ లీడర్‌షిప్ ఫండ్‌కు ఏకంగా 158 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.1,327 కోట్లు) బదిలీ చేశారు. ప్రస్తుతం ఫోర్బ్స్ గణాంకాల ప్రకారం 909.8 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.76.4 లక్షల కోట్లు) సంపదతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్న మస్క్, రాజకీయాల్లోనూ తన తిరుగులేని ప్రభావాన్ని చాటుకుంటున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 24 October 2026, 9:59 pm Digital Edition : Prabhanews
Elon Musk: ఎలాన్ మస్క్ మామూలోడు కాదు బాబోయ్.. మధ్యంతర ఎన్నికలకు ఏకంగా రూ.3,710 కోట్ల ఫండింగ్! |

Last Updated:Oct 24, 2026 9:57 PM ISTఅమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థుల విజయానికి ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ 442 మిలియన్ డాలర్లకు (దాదాపు రూ.3,710 కోట్లు) పైగా విరాళాలు ఇచ్చి అమెరికా చరిత్రలోనే అత్యంత భారీ రాజకీయ దాతగా రికార్డు సృష్టించారు.News18అమెరికాలో నవంబర్ 3న జరగనున్న మధ్యంతర ఎన్నికల ప్రచారంలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సరికొత్త చరిత్ర సృష్టించారు. రిపబ్లికన్ పార్టీ ప్రచారం కోసం ఆయన ఏకంగా 442 మిలియన్ డాలర్లకు (దాదాపు రూ.3,710 కోట్లు) పైగా భారీ విరాళాలు అందించారు. ఈ భారీ మొత్తంతో అమెరికా రాజకీయ చరిత్రలోనే అత్యధికంగా ఎన్నికల విరాళాలు ఇచ్చిన ఏకైక వ్యక్తిగా మస్క్ రికార్డుకెక్కారని ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ నివేదికలు స్పష్టం చేశాయి. కేవలం అక్టోబర్ మొదటి పక్షం రోజుల్లోనే ఆయన తన ‘అమెరికా పీఏసీ’ (America PAC) సంస్థకు 74.8 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.628 కోట్లు) బదిలీ చేశారు. ఆయన సంస్థ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇంక్ మరో 1.98 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.16.6 కోట్లు) జతచేయడంతో ఈ నెలలోనే మొత్తం విరాళాలు 77 మిలియన్ డాలర్లకు (దాదాపు రూ.646 కోట్లు) చేరాయి.కీలక సెనేట్ స్థానాలపై గురిరిపబ్లికన్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా మస్క్ స్థాపించిన అమెరికా పీఏసీ నిధుల ప్రవాహాన్ని కొనసాగిస్తోంది. ఈ సంస్థ ఇప్పటివరకు దాదాపు 68.6 మిలియన్ డాలర్లను (దాదాపు రూ.576 కోట్లు) తీవ్ర పోటీ ఉన్న సెనేట్ స్థానాల్లో ప్రచారానికి వెచ్చించింది. ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించడం, డిజిటల్ ప్రచారం నిర్వహించడంపైనే ఈ బృందం ప్రధానంగా దృష్టి సారించింది.ముఖ్యంగా టెక్సాస్ సెనేట్ ఎన్నికల్లో డెమొక్రాటిక్ నేత జేమ్స్ తలారికోను ఓడించేందుకు 27.9 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.234 కోట్లు), రిపబ్లికన్ అభ్యర్థి కెన్ పాక్స్టన్ మద్దతు కోసం 4.8 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.40 కోట్లు) ఖర్చు చేశారు. ఒహియోలో 9.3 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.78 కోట్లు), మిచిగాన్‌లో 7.7 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.64 కోట్లు), అయోవాలో 2.7 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.22 కోట్లు), మైనేలో 2.1 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.17 కోట్లు) ఖర్చు పెట్టి డెమొక్రాట్లను అడ్డుకుంటున్నారు.గత సెప్టెంబర్ చివరి నాటికే మస్క్ 366 మిలియన్ డాలర్లకు (దాదాపు రూ.3,074 కోట్లు) పైగా విరాళాలు సమకూర్చారు. ఇందులో భాగంగా రిపబ్లికన్ సెనేట్ లీడర్‌షిప్ ఫండ్‌కు ఏకంగా 158 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.1,327 కోట్లు) బదిలీ చేశారు. ప్రస్తుతం ఫోర్బ్స్ గణాంకాల ప్రకారం 909.8 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.76.4 లక్షల కోట్లు) సంపదతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్న మస్క్, రాజకీయాల్లోనూ తన తిరుగులేని ప్రభావాన్ని చాటుకుంటున్నారు.మరింత చదవండి

Source link