2026లో బంగారం ధరల పరిస్థితి ఎలా ఉంది?
2026 జనవరి 28న అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్సుకు 5,419 డాలర్ల రికార్డు స్థాయికి చేరుకుంది. అయితే, అక్టోబర్ 23 నాటికి ధర 4,007 డాలర్లకు పడిపోయింది. అంటే రికార్డు గరిష్ట స్థాయి నుంచి 26 శాతానికి పైగా తగ్గింది. ఈ స్థాయి పతనం బంగారం మార్కెట్లో పెట్టుబడిదారుల అంచనాలు ఎంత వేగంగా మారుతున్నాయో తెలియజేస్తోంది. ధరలు మరింత తగ్గుతాయా, మళ్లీ పెరుగుతాయా అనే సందిగ్ధంలో పెట్టుబడిదారులు ఉన్నారు. భారతదేశంలోనూ బంగారం ధరల్లో ఇదే తరహా మార్పులు కనిపించాయి. జనవరి 29న మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బంగారం ధర 10 గ్రాములకు రూ.1,76,306 రికార్డు స్థాయికి చేరింది. ఆ తర్వాత కేవలం మూడు రోజుల్లోనే ధర రూ.1,47,878కు పడిపోయింది. ఈ ఏడాది జూన్ 25న ధర రూ.1,39,843 కనిష్ట స్థాయిని తాకింది. అక్టోబర్ 22న సుమారు రూ.1,42,800 వద్ద కొనసాగింది. ఈ గణాంకాలు దేశీయ మార్కెట్లోనూ పసిడి ధరలు గరిష్ట స్థాయుల నుంచి గణనీయంగా తగ్గినట్లు సూచిస్తున్నాయి.

