ఉక్రెయిన్‌కు స్టార్‌లింక్ సేవల విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, ఉక్రెయిన్‌కు స్టార్‌లింక్ యాక్సెస్‌ను ఎలాన్ మస్క్ పునరుద్ధరించినట్లు వెల్లడించారు. అయితే, ఈ అంశంపై తాను మస్క్‌తో మాట్లాడానా లేదా అనే ప్రశ్నకు ట్రంప్ స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. అంతకుముందు, అమెరికా అధికారులను ఉటంకిస్తూ వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఉక్రెయిన్ స్టార్‌లింక్ వినియోగంపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని ట్రంప్, మస్క్‌ను ఫోన్లో కోరినట్లు ఆ కథనం పేర్కొంది.
Source link
