Salt Turmeric Rice Vastu: హిందూ సంప్రదాయంలో వంటిల్లు కేవలం ఆహారం తయారుచేసే స్థలం మాత్రమే కాదని, సాక్షాత్తు అన్నపూర్ణాదేవి కొలువై ఉండే పరమ పవిత్ర ప్రదేశమని ప్రముఖ వేద జ్యోతిష్య మరియు వాస్తు నిపుణులు ప్రశాంత్ వివరిస్తున్నారు. వంటింట్లో మనం నిత్యం వాడే దినుసులు, వస్తువులకు విశేషమైన దైవిక శక్తులు ఉంటాయని వాస్తు శాస్త్రం చెబుతోందని స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా ఉప్పు, పసుపు, బియ్యం ఈ మూడింటిని సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపాలుగా, అష్టైశ్వర్యాలకు ప్రతీకలుగా పూజిస్తారని తెలుపుతున్నారు. పూర్వకాలం నుండి గృహప్రవేశం చేసే సమయంలో లేదా కొత్త ఇంట్లోకి అడుగుపెట్టేటప్పుడు ముందుగా ఈ మూడు వస్తువులనే ఇంట్లోకి తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తోందని పేర్కొంటున్నారు. అయితే వీటిని భద్రపరిచే దిశ, వాడే పాత్రలు, నిర్వహణ పద్ధతుల్లో పొరపాట్లు జరిగితే తీవ్రమైన వాస్తు దోషాలు, ఆర్థిక నష్టాలు చుట్టుముడతాయని హెచ్చరిస్తున్నారు. ఇంట్లో సుఖశాంతులు, ధనధాన్యాలు వర్ధిల్లడానికి ఉప్పు, పసుపు, బియ్యాన్ని ఎక్కడ, ఎలా ఉంచాలో తెలిపే ఆ 5 ప్రధాన వాస్తు నియమాలు ఇప్పుడు తెలుసుకుందాం.

