పల్సర్ N250SSలో అడ్జస్టబుల్ లివర్లు, యూఎస్బీ టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్, హజార్డ్ స్విచ్, పానిక్ బ్రేక్ అలర్ట్ వంటి సదుపాయాలనూ చేర్చారు. కొత్త ఇంజిన్ సెటప్, ఆరు గేర్లు, టీఎఫ్టీ స్క్రీన్, నావిగేషన్, ఎలక్ట్రానిక్ థ్రోటిల్ వంటి మార్పులు ఈ బైక్‌ను సాధారణ N250 మోడల్‌కు భిన్నంగా నిలబెడుతున్నాయి. ఢిల్లీలో రూ.1,59,406 ఎక్స్‌షోరూమ్ ధరతో అందుబాటులోకి వచ్చిన ఈ కొత్త పల్సర్, అదనపు సాంకేతిక సదుపాయాలు కోరుకునే బైక్ ప్రియులను ఆకట్టుకునే లక్ష్యంతో వచ్చింది.

