మూడు రోజుల ముందు రిలీజైన రణబాలి సినిమాకు ఆహా, ఓహో అనే రేంజ్‌లో రివ్యూలు రాలేదు కానీ.. డీసెంట్ టాక్ తెచ్చుకుంది. కొద్దిగా లాగ్ అనిపించింది కానీ ఇలాంటి సినిమాలు ఖచ్చితంగా థియేటర్‌లోనే చూడాలి. రణబాలి రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు. ఇందులో కామెడీ, రొమాన్స్, ఎంటర్‌టైన్‌మెంట్ కంటే చరిత్ర, కరువు, బ్రిటీష్ పాలన, అన్యాయాన్ని ఎదిరించే ఓ వ్యక్తి ప్రయాణానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఫస్టాఫ్, విజువల్స్, రష్మిక నటన, విజయ్ మేకోవర్ మాములుగా లేదు.

