ప్రభన్యూస్

Cancer Medicines: క్యాన్సర్ మందుల ధరలు తగ్గనున్నాయి.. ఏకంగా 137 ఔషధాలపై కేంద్రం కొత్త రూల్స్ | బిజినెస్


Last Updated:

Cancer Medicines: క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే 137 రకాల నాన్-షెడ్యూల్డ్ ఔషధాలపై వాణిజ్య మార్జిన్‌ను 30 శాతానికి పరిమితం చేసింది. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన వెల్లడించింది. ఈ చర్యతో ప్రస్తుతం ఉన్న ధరల నిర్మాణాన్ని బట్టి కొన్ని ఔషధాల గరిష్ఠ రిటైల్ ధరలు (MRP) 70 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. ఈ కొత్త నిబంధనలు నవంబర్ 9 నుంచి అమల్లోకి రానున్నాయి.

News18
News18

క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే 137 రకాల నాన్-షెడ్యూల్డ్ ఔషధాలపై వాణిజ్య మార్జిన్‌ను 30 శాతానికి పరిమితం చేసింది. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన వెల్లడించింది. ఈ చర్యతో ప్రస్తుతం ఉన్న ధరల నిర్మాణాన్ని బట్టి కొన్ని ఔషధాల గరిష్ఠ రిటైల్ ధరలు (MRP) 70 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. ఈ కొత్త నిబంధనలు నవంబర్ 9 నుంచి అమల్లోకి రానున్నాయి.

క్యాన్సర్ చికిత్సకు దీర్ఘకాలం పాటు మందులు వాడాల్సి రావడంతో రోగులు, వారి కుటుంబాలపై భారీగా ఆర్థిక భారం పడుతుంది. ముఖ్యంగా ఖరీదైన ఔషధాల కొనుగోలు కోసం ప్రతి నెలా గణనీయమైన మొత్తాన్ని ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఔషధాల పంపిణీ, రిటైల్ విక్రయాల్లో అధిక వాణిజ్య మార్జిన్లను నియంత్రించడం ద్వారా రోగులకు మందులు తక్కువ ధరకు అందుబాటులోకి తీసుకురావడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశం.

NPPA ఎలా నిర్ణయం తీసుకుంది?

కేంద్ర ఔషధాల శాఖ పరిధిలో పనిచేసే NPPA, డ్రగ్స్ (ప్రైస్ కంట్రోల్) ఆర్డర్ (DPCO), 2013లోని పేరా 19 కింద ట్రేడ్ మార్జిన్ రేషనలైజేషన్ (TMR) విధానాన్ని అమలు చేసింది. దీనికి సంబంధించి శనివారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (DGHS) పరిధిలో ఏర్పాటైన నిపుణుల కమిటీ సిఫార్సుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీలో ప్రముఖ క్యాన్సర్ నిపుణులు, వైద్యులు, ఆసుపత్రుల ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు ఉన్నారు. వారి సిఫార్సుల మేరకు 137 ఔషధాలను ఈ ధరల నియంత్రణ పరిధిలోకి తీసుకొచ్చారు. అవసరాన్ని బట్టి ఈ జాబితాను భవిష్యత్తులో ఎప్పటికప్పుడు సవరించనున్నారు.

గతంలోనూ ధరల తగ్గింపు చర్యలు..

క్యాన్సర్ ఔషధాల ధరలను తగ్గించేందుకు NPPA గతంలోనూ ఇలాంటి చర్యలు చేపట్టింది. 2019లో ప్రారంభించిన పైలట్ కార్యక్రమంలో 42 రకాల క్యాన్సర్ మందులపై వాణిజ్య మార్జిన్లను 30 శాతానికి పరిమితం చేసింది. ఈ చర్యతో 526 బ్రాండ్ల ఔషధాల గరిష్ఠ రిటైల్ ధరలు కొన్ని సందర్భాల్లో 90 శాతం వరకు తగ్గినట్లు అధికారిక ప్రకటన పేర్కొంది. ఇప్పుడు ఆ విధానాన్ని మరింత విస్తరించి, పెద్ద సంఖ్యలో క్యాన్సర్ ఔషధాలకు వర్తింపజేస్తున్నారు.

తగ్గిన ధరలనే వసూలు చేయాలి..

కొత్త నిబంధనల ప్రకారం ఔషధ తయారీ కంపెనీలు సవరించిన ధరల జాబితాలను తమ అధికారిక వెబ్‌సైట్లలో ప్రచురించాలి. రిటైలర్లు, ఆసుపత్రులకు కూడా ఈ వివరాలను తెలియజేయాలి. నవంబర్ 9 నుంచి మందుల దుకాణాలు, ఆసుపత్రులు సవరించిన ధరల ప్రకారమే రోగుల నుంచి డబ్బులు వసూలు చేయాలి. అంతేకాకుండా, తమ ఫార్మసీల్లో కొత్త ధరలను స్పష్టంగా ప్రదర్శించాలి. క్యాన్సర్ మందుల్లో గణనీయమైన వాటాను నేరుగా కొనుగోలు చేసే ఆసుపత్రులు తమ వెబ్‌సైట్లలోనూ సవరించిన ధరలను ప్రముఖంగా చూపించాలి. కొత్త ధరలు అమలయ్యేలా చూసే బాధ్యత కూడా ఆయా ఆసుపత్రులపై ఉంటుంది.

ధరలను ఎక్కడ తనిఖీ చేయవచ్చు?

క్యాన్సర్ మందుల కొత్త ధరలను తెలుసుకోవాలనుకునే వినియోగదారులు NPPA అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ‘ఫార్మా సాహి దామ్’ మొబైల్ యాప్‌ను ఉపయోగించవచ్చు. మందుల దుకాణంలో వసూలు చేస్తున్న ధరను అధికారిక జాబితాతో పోల్చి చూసుకోవచ్చు. నిబంధనలు సక్రమంగా అమలవుతున్నాయో లేదో పర్యవేక్షించేందుకు రాష్ట్ర డ్రగ్ కంట్రోలర్లకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఔషధ తయారీదారులు, డీలర్లు, రిటైలర్లు, ఆసుపత్రులు, వైద్య సంస్థలు నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.

మందుల కొరత రాకుండా ప్రత్యేక జాగ్రత్తలు..

ఔషధాల ధరలను తగ్గించే క్రమంలో వాటి ఉత్పత్తి, సరఫరాకు ఆటంకం కలగకుండా కూడా NPPA చర్యలు తీసుకుంది. అధిక వాణిజ్య మార్జిన్లను నియంత్రించడమే ఈ నిర్ణయం లక్ష్యమని, చట్టబద్ధమైన ఉత్పత్తి రాబడిని దెబ్బతీయడం లేదా కృత్రిమ కొరత సృష్టించడం ఉద్దేశం కాదని స్పష్టం చేసింది. రోగులకు అవసరమైన మందులు నిరంతరంగా అందుబాటులో ఉండేలా నోటిఫై చేసిన ఔషధాల ఉత్పత్తి, సరఫరా స్థాయులను కొనసాగించాలని ఔషధ కంపెనీలను ఆదేశించింది. ఈ చర్యలు సక్రమంగా అమలైతే క్యాన్సర్ చికిత్స ఖర్చులు తగ్గి, దేశవ్యాప్తంగా రోగులకు కొంత ఆర్థిక ఉపశమనం లభించే అవకాశం ఉంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 18 October 2026, 10:30 am Digital Edition : Prabhanews
Cancer Medicines: క్యాన్సర్ మందుల ధరలు తగ్గనున్నాయి.. ఏకంగా 137 ఔషధాలపై కేంద్రం కొత్త రూల్స్ | బిజినెస్

Last Updated:Oct 18, 2026 10:29 AM ISTCancer Medicines: క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే 137 రకాల నాన్-షెడ్యూల్డ్ ఔషధాలపై వాణిజ్య మార్జిన్‌ను 30 శాతానికి పరిమితం చేసింది. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన వెల్లడించింది. ఈ చర్యతో ప్రస్తుతం ఉన్న ధరల నిర్మాణాన్ని బట్టి కొన్ని ఔషధాల గరిష్ఠ రిటైల్ ధరలు (MRP) 70 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. ఈ కొత్త నిబంధనలు నవంబర్ 9 నుంచి అమల్లోకి రానున్నాయి.
News18క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే 137 రకాల నాన్-షెడ్యూల్డ్ ఔషధాలపై వాణిజ్య మార్జిన్‌ను 30 శాతానికి పరిమితం చేసింది. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన వెల్లడించింది. ఈ చర్యతో ప్రస్తుతం ఉన్న ధరల నిర్మాణాన్ని బట్టి కొన్ని ఔషధాల గరిష్ఠ రిటైల్ ధరలు (MRP) 70 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. ఈ కొత్త నిబంధనలు నవంబర్ 9 నుంచి అమల్లోకి రానున్నాయి.క్యాన్సర్ చికిత్సకు దీర్ఘకాలం పాటు మందులు వాడాల్సి రావడంతో రోగులు, వారి కుటుంబాలపై భారీగా ఆర్థిక భారం పడుతుంది. ముఖ్యంగా ఖరీదైన ఔషధాల కొనుగోలు కోసం ప్రతి నెలా గణనీయమైన మొత్తాన్ని ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఔషధాల పంపిణీ, రిటైల్ విక్రయాల్లో అధిక వాణిజ్య మార్జిన్లను నియంత్రించడం ద్వారా రోగులకు మందులు తక్కువ ధరకు అందుబాటులోకి తీసుకురావడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశం.NPPA ఎలా నిర్ణయం తీసుకుంది?కేంద్ర ఔషధాల శాఖ పరిధిలో పనిచేసే NPPA, డ్రగ్స్ (ప్రైస్ కంట్రోల్) ఆర్డర్ (DPCO), 2013లోని పేరా 19 కింద ట్రేడ్ మార్జిన్ రేషనలైజేషన్ (TMR) విధానాన్ని అమలు చేసింది. దీనికి సంబంధించి శనివారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (DGHS) పరిధిలో ఏర్పాటైన నిపుణుల కమిటీ సిఫార్సుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీలో ప్రముఖ క్యాన్సర్ నిపుణులు, వైద్యులు, ఆసుపత్రుల ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు ఉన్నారు. వారి సిఫార్సుల మేరకు 137 ఔషధాలను ఈ ధరల నియంత్రణ పరిధిలోకి తీసుకొచ్చారు. అవసరాన్ని బట్టి ఈ జాబితాను భవిష్యత్తులో ఎప్పటికప్పుడు సవరించనున్నారు.గతంలోనూ ధరల తగ్గింపు చర్యలు..క్యాన్సర్ ఔషధాల ధరలను తగ్గించేందుకు NPPA గతంలోనూ ఇలాంటి చర్యలు చేపట్టింది. 2019లో ప్రారంభించిన పైలట్ కార్యక్రమంలో 42 రకాల క్యాన్సర్ మందులపై వాణిజ్య మార్జిన్లను 30 శాతానికి పరిమితం చేసింది. ఈ చర్యతో 526 బ్రాండ్ల ఔషధాల గరిష్ఠ రిటైల్ ధరలు కొన్ని సందర్భాల్లో 90 శాతం వరకు తగ్గినట్లు అధికారిక ప్రకటన పేర్కొంది. ఇప్పుడు ఆ విధానాన్ని మరింత విస్తరించి, పెద్ద సంఖ్యలో క్యాన్సర్ ఔషధాలకు వర్తింపజేస్తున్నారు.తగ్గిన ధరలనే వసూలు చేయాలి..కొత్త నిబంధనల ప్రకారం ఔషధ తయారీ కంపెనీలు సవరించిన ధరల జాబితాలను తమ అధికారిక వెబ్‌సైట్లలో ప్రచురించాలి. రిటైలర్లు, ఆసుపత్రులకు కూడా ఈ వివరాలను తెలియజేయాలి. నవంబర్ 9 నుంచి మందుల దుకాణాలు, ఆసుపత్రులు సవరించిన ధరల ప్రకారమే రోగుల నుంచి డబ్బులు వసూలు చేయాలి. అంతేకాకుండా, తమ ఫార్మసీల్లో కొత్త ధరలను స్పష్టంగా ప్రదర్శించాలి. క్యాన్సర్ మందుల్లో గణనీయమైన వాటాను నేరుగా కొనుగోలు చేసే ఆసుపత్రులు తమ వెబ్‌సైట్లలోనూ సవరించిన ధరలను ప్రముఖంగా చూపించాలి. కొత్త ధరలు అమలయ్యేలా చూసే బాధ్యత కూడా ఆయా ఆసుపత్రులపై ఉంటుంది.ధరలను ఎక్కడ తనిఖీ చేయవచ్చు?క్యాన్సర్ మందుల కొత్త ధరలను తెలుసుకోవాలనుకునే వినియోగదారులు NPPA అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ‘ఫార్మా సాహి దామ్’ మొబైల్ యాప్‌ను ఉపయోగించవచ్చు. మందుల దుకాణంలో వసూలు చేస్తున్న ధరను అధికారిక జాబితాతో పోల్చి చూసుకోవచ్చు. నిబంధనలు సక్రమంగా అమలవుతున్నాయో లేదో పర్యవేక్షించేందుకు రాష్ట్ర డ్రగ్ కంట్రోలర్లకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఔషధ తయారీదారులు, డీలర్లు, రిటైలర్లు, ఆసుపత్రులు, వైద్య సంస్థలు నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.మందుల కొరత రాకుండా ప్రత్యేక జాగ్రత్తలు..ఔషధాల ధరలను తగ్గించే క్రమంలో వాటి ఉత్పత్తి, సరఫరాకు ఆటంకం కలగకుండా కూడా NPPA చర్యలు తీసుకుంది. అధిక వాణిజ్య మార్జిన్లను నియంత్రించడమే ఈ నిర్ణయం లక్ష్యమని, చట్టబద్ధమైన ఉత్పత్తి రాబడిని దెబ్బతీయడం లేదా కృత్రిమ కొరత సృష్టించడం ఉద్దేశం కాదని స్పష్టం చేసింది. రోగులకు అవసరమైన మందులు నిరంతరంగా అందుబాటులో ఉండేలా నోటిఫై చేసిన ఔషధాల ఉత్పత్తి, సరఫరా స్థాయులను కొనసాగించాలని ఔషధ కంపెనీలను ఆదేశించింది. ఈ చర్యలు సక్రమంగా అమలైతే క్యాన్సర్ చికిత్స ఖర్చులు తగ్గి, దేశవ్యాప్తంగా రోగులకు కొంత ఆర్థిక ఉపశమనం లభించే అవకాశం ఉంది.మరింత చదవండి

Source link