ప్రభన్యూస్

Keerthy Suresh: జనవరి 12 విడుదల.. కీర్తి సురేశ్ ఫస్ట్ లుక్ రిలీజ్, ఆమె రోల్ ఏంటో తెలుసా? | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

కీర్తి సురేశ్ పుట్టినరోజు సందర్భంగా (అక్టోబర్ 17) అభిమానులకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ మల్టీస్టారర్ ‘జనవరి 12 విడుదల’ నుంచి కీర్తి సురేశ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ వదిలారు.

News18
News18

టాలీవుడ్ స్టార్ హీరోయిన్, జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేశ్ పుట్టినరోజు సందర్భంగా (అక్టోబర్ 17) అభిమానులకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ మల్టీస్టారర్ ‘జనవరి 12 విడుదల’ నుంచి కీర్తి సురేశ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ భారీ చిత్రంలో కీర్తి సురేశ్ ‘లతా రెడ్డి’ అనే పవర్‌ఫుల్ అండ్ ఎనర్జిటిక్ పాత్రలో నటిస్తున్నారు. పల్లెటూరి వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఉన్న ఆమె ఊరమాస్, ఎనర్జిటిక్ లుక్ ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

సంక్రాంతి పండుగ అంటేనే కుటుంబ సమేతంగా చూసే వినోదాత్మక చిత్రాలకు పెట్టింది పేరు. ఇదే సెంటిమెంట్‌ను పునరావృతం చేస్తూ అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని పూర్తిస్థాయి మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా మలుస్తున్నారు. గతంలో వెంకటేష్ – అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన ‘F2’, ‘F3’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాలు సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవడానికి ఈ సూపర్ హిట్ కాంబినేషన్ మరోసారి ముస్తాబవుతోంది. ఈ చిత్రంలో వెంకటేష్ ‘లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డి’ అనే డిఫరెంట్ రోల్‌లో నటిస్తుండగా, నందమూరి కల్యాణ్ రామ్‌కు జోడీగా కృతి శెట్టి నటిస్తోంది. కథలో వెంకటేష్, కల్యాణ్ రామ్ మధ్య వచ్చే “బావ – బావమరిది” సెంటిమెంట్, కామెడీ సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా నిలవనున్నాయని సమాచారం.

ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సెప్టెంబర్ నెలలో మైసూర్‌లో కీలక సన్నివేశాలు చిత్రీకరించిన చిత్ర యూనిట్, ఇప్పుడు అందమైన ఊటీలో తదుపరి భారీ షెడ్యూల్‌ను జరుపుకుంటోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీపడకుండా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా, సురేష్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా సమర్పిస్తున్నాయి. ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.

విడుదలకు ముందే విపరీతమైన బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2027 జనవరి 12న సంక్రాంతి కానుకగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో లతా రెడ్డిగా కీర్తి సురేశ్ మార్క్ యాక్టింగ్, ఇద్దరు స్టార్ హీరోల టైమింగ్, అనిల్ రావిపూడి కామెడీ టేకింగ్ వెరసి.. ఈ సంక్రాంతికి ప్రేక్షకులకు పూర్తిస్థాయి వినోదాల విందు పంచడం ఖాయంగా కనిపిస్తోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 17 October 2026, 2:58 pm Digital Edition : Prabhanews
Keerthy Suresh: జనవరి 12 విడుదల.. కీర్తి సురేశ్ ఫస్ట్ లుక్ రిలీజ్, ఆమె రోల్ ఏంటో తెలుసా? | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 17, 2026 2:44 PM ISTకీర్తి సురేశ్ పుట్టినరోజు సందర్భంగా (అక్టోబర్ 17) అభిమానులకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ మల్టీస్టారర్ 'జనవరి 12 విడుదల' నుంచి కీర్తి సురేశ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ వదిలారు. News18టాలీవుడ్ స్టార్ హీరోయిన్, జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేశ్ పుట్టినరోజు సందర్భంగా (అక్టోబర్ 17) అభిమానులకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ మల్టీస్టారర్ 'జనవరి 12 విడుదల' నుంచి కీర్తి సురేశ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ భారీ చిత్రంలో కీర్తి సురేశ్ 'లతా రెడ్డి' అనే పవర్‌ఫుల్ అండ్ ఎనర్జిటిక్ పాత్రలో నటిస్తున్నారు. పల్లెటూరి వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఉన్న ఆమె ఊరమాస్, ఎనర్జిటిక్ లుక్ ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.సంక్రాంతి పండుగ అంటేనే కుటుంబ సమేతంగా చూసే వినోదాత్మక చిత్రాలకు పెట్టింది పేరు. ఇదే సెంటిమెంట్‌ను పునరావృతం చేస్తూ అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని పూర్తిస్థాయి మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా మలుస్తున్నారు. గతంలో వెంకటేష్ - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన 'F2', 'F3' సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాలు సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవడానికి ఈ సూపర్ హిట్ కాంబినేషన్ మరోసారి ముస్తాబవుతోంది. ఈ చిత్రంలో వెంకటేష్ 'లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డి' అనే డిఫరెంట్ రోల్‌లో నటిస్తుండగా, నందమూరి కల్యాణ్ రామ్‌కు జోడీగా కృతి శెట్టి నటిస్తోంది. కథలో వెంకటేష్, కల్యాణ్ రామ్ మధ్య వచ్చే "బావ - బావమరిది" సెంటిమెంట్, కామెడీ సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా నిలవనున్నాయని సమాచారం.ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సెప్టెంబర్ నెలలో మైసూర్‌లో కీలక సన్నివేశాలు చిత్రీకరించిన చిత్ర యూనిట్, ఇప్పుడు అందమైన ఊటీలో తదుపరి భారీ షెడ్యూల్‌ను జరుపుకుంటోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీపడకుండా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా, సురేష్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా సమర్పిస్తున్నాయి. ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.
Happy Birthday @KeerthyOfficial 🤗🥳😀
It’s been a delight watching you bring your signature spark, warmth and effortless charm to LATHA REDDY in #January12Vidudala.Wishing you a beautiful year ahead✨ https://t.co/yyVPVh73fh— Anil Ravipudi (@AnilRavipudi) October 17, 2026విడుదలకు ముందే విపరీతమైన బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2027 జనవరి 12న సంక్రాంతి కానుకగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో లతా రెడ్డిగా కీర్తి సురేశ్ మార్క్ యాక్టింగ్, ఇద్దరు స్టార్ హీరోల టైమింగ్, అనిల్ రావిపూడి కామెడీ టేకింగ్ వెరసి.. ఈ సంక్రాంతికి ప్రేక్షకులకు పూర్తిస్థాయి వినోదాల విందు పంచడం ఖాయంగా కనిపిస్తోంది.మరింత చదవండి

Source link