Last Updated:
ఈ ఏడాది అత్యంత భారీ అంచనాల నడుమ భారతీయ చలనచిత్ర పరిశ్రమ ఉత్కంఠగా ఎదురుచూసిన మోస్ట్ అవేటెడ్ మూవీ జైలర్ 2 నేడు (అక్టోబర్ 15న) ప్రపంచవ్యాప్తంగా అట్టహాసంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఓటీటీ డీటెయిల్స్ చూద్దామా..
సూపర్ స్టార్ రజనీకాంత్, టాలెంటెడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్లో గతంలో వచ్చిన ‘జైలర్’ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. రజనీకాంత్ లోని అసలైన స్వాగ్‌ను, హీరోయిజాన్ని నెల్సన్ అద్భుతంగా ప్రెజెంట్ చేసి అభిమానులకు పూనకాలు తెప్పించాడు. ఆ భారీ బ్లాక్ బస్టర్ కు సీక్వెల్ గా తెరకెక్కిన చిత్రం ‘జైలర్ 2’. ఈ ఏడాది అత్యంత భారీ అంచనాల నడుమ భారతీయ చలనచిత్ర పరిశ్రమ ఉత్కంఠగా ఎదురుచూసిన ఈ మోస్ట్ అవేటెడ్ మూవీ నేడు (అక్టోబర్ 15న) ప్రపంచవ్యాప్తంగా అట్టహాసంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో పండుగ వాతావరణం నెలకొన్న ఈ తరుణంలో, సినిమా ఓటీటీ రైట్స్, స్ట్రీమింగ్ వివరాలపై సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
‘జైలర్ 2’ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు నెల్సన్ ఓ భారీ తారాగణాన్ని రంగంలోకి దించాడు. ఎస్జే సూర్య, మలయాళ నటుడు సూరజ్ వెంజారమూడు, బాలీవుడ్ సీనియర్ స్టార్ మిథున్ చక్రవర్తి, రమ్యకృష్ణ, విద్యా బాలన్, యోగి బాబు, మిర్నా మీనన్ తదితరులు ఈ చిత్రంలో అత్యంత కీలక పాత్రలు పోషించారు. మొదటి భాగంలో గెస్ట్ రోల్స్ తో మ్యాజిక్ చేసినట్టే.. ఈ సీక్వెల్ లో ఏకంగా మోహన్‌లాల్, శివరాజ్ కుమార్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, జాకీష్రాఫ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి వంటి సూపర్ స్టార్స్ అతిథి పాత్రల్లో అలరించారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రఖ్యాత నిర్మాత కళానిధి మారన్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అనిరుధ్ రవిచందర్ తనదైన మార్క్ బీజీఎంతో మరోసారి థియేటర్లను హోరెత్తిస్తుండగా.. విజయ్ కార్తీక్ కణ్ణన్ విజువల్స్, ఆర్ నిర్మల్ ఎడిటింగ్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి.
సినిమా బడ్జెట్, బిజినెస్ లెక్కలు చూస్తే కళ్లు చెదరక మానవు. నటీనటులు, సాంకేతిక నిపుణుల భారీ పారితోషికాలు, అద్భుతమైన ప్రొడక్షన్ వాల్యూస్, మరియు విస్తృతమైన పబ్లిసిటీ ఖర్చులు అన్నీ కలుపుకుని ఏకంగా రూ. 350 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించినట్లు కోలీవుడ్ ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. తలైవా క్రేజ్ కు తగ్గట్టుగానే సినిమాకు ఊహించని స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తమిళనాడు థియేట్రికల్ హక్కులు రూ. 125 కోట్లు పలకగా.. తెలుగు రాష్ట్రాల్లో రూ. 41 కోట్లు, కర్ణాటకలో రూ. 26 కోట్లు, కేరళతో పాటు మిగతా భారతీయ మార్కెట్లలో రూ. 30 కోట్లు, ఇక ఓవర్సీస్లో ఏకంగా రూ. 80 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది. మొత్తంగా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా జైలర్ 2 చిత్రం రూ. 302 కోట్ల భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ కంప్లీట్ చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ సాధించి క్లీన్ హిట్ గా నిలవాలంటే రూ. 304 కోట్ల షేర్ అంటే దాదాపు రూ. 600 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టాల్సి ఉంటుంది.
ఇదిలా ఉంటే, జైలర్ 2 డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం ప్రముఖ ఓటీటీ సంస్థలు తీవ్రంగా పోటీ పడగా.. చివరకు గ్లోబల్ దిగ్గజం ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ రికార్డు ధరకు హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం. థియేటర్లలో విడుదలైన 4 వారాల తర్వాతే ఈ చిత్రాన్ని ఓటీటీలో అందుబాటులోకి తీసుకురావాలని నిర్మాతలు, ప్రైమ్ వీడియో ప్రతినిధుల మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. దీని ప్రకారం చూసుకుంటే, నవంబర్ మధ్యలో జైలర్ 2 డిజిటల్ వేదికగా స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశం ఉంది. అయితే, బాక్సాఫీస్ వద్ద సినిమా సాధించే కలెక్షన్ల రన్ ఆధారంగా ఈ తేదీలో స్వల్ప మార్పులు ఉండొచ్చు. సినిమా బ్లాక్ బస్టర్ రన్ కొనసాగిస్తే స్ట్రీమింగ్ మరింత ఆలస్యం అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. దీనిపై ప్రైమ్ వీడియో సంస్థ త్వరలోనే అధికారిక ప్రకటన చేయనుంది.

