ఇంజిన్ విషయంలోనూ మార్పులు చోటుచేసుకోవచ్చని తెలుస్తోంది. కొత్త వాగన్ఆర్లో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు, 1.2 లీటర్ ఇంజిన్‌కు బదులుగా కొత్త Z-సిరీస్ మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్‌ను అందించే అవకాశం ఉంది. ముఖ్యంగా Z12 ఇంజిన్ తక్కువ బరువు, సున్నితమైన పనితీరు, మెరుగైన ఇంధన సామర్థ్యానికి పేరుగాంచినట్లు సమాచారం. అయితే, ఏ ఇంజిన్ ఎంపికలను ఖరారు చేశారనే దానిపై అధికారిక స్పష్టత లేదు.

