ప్రభన్యూస్

Railways: రైల్వే శాఖ బిగ్ అనౌన్స్‌మెంట్.. పండగ చేసుకోనున్న భక్తులు! | బిజినెస్


Last Updated:

రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. రైల్వే శాఖ తీసుకున్న ఈ సరికొత్త నిర్ణయం చూశారా? భారీ ఊరట.

News18
News18

చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచే అతి ప్రాచీన పుణ్యక్షేత్రం మహోత్సవాలకు ముస్తాబవుతోంది. తెలంగాణ గడ్డపై దేదీప్యమానంగా వెలుగొందుతున్న ప్రసిద్ధ జైన మందిరం ఏకంగా 1400 ఏళ్ల వేడుకలకు సిద్ధమవుతున్న వేళ భక్తులకు అదిరిపోయే శుభవార్త అందింది. దేశవ్యాప్తంగా ఈ అపురూప ఘట్టాన్ని కనులారా వీక్షించేందుకు తరలివచ్చే వేలాది మంది సందర్శకుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్సవాలకు హాజరయ్యే ప్రయాణికుల కోసం ఆలేరు రైల్వే స్టేషన్‌లో పలు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు తాత్కాలిక హాల్టింగ్ సదుపాయం కల్పిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల పరిధిలోని కొలనుపాక జైన్ టెంపుల్‌కు దేశవ్యాప్తంగా ఎంతో విశిష్టమైన ఆధ్యాత్మిక చరిత్ర ఉంది. అత్యంత ప్రాచీన శ్వేతాంబర జైన పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం 1400 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా 2027 ఫిబ్రవరి 11 నుంచి 13వ తేదీ వరకు ఉత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ చారిత్రక వేడుకల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరాది రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు.

ఇది కూడా చదవండి: అన్న వదిలేసిన భార్యతో తమ్ముడి కాపురం.. ఆ కోరిక ఎక్కడికి దారి తీసిందో తెలుసా? స్టోరీలో మరో ట్విస్ట్!

ఈ అనూహ్యమైన రద్దీని ముందుగానే అంచనా వేసిన రైల్వే శాఖ ప్రయాణికుల కోసం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రధానంగా వరంగల్, కాజీపేట మార్గం మీదుగా ఆలేరు వైపు ప్రయాణించే కీలక రైళ్లకు ఆలేరు స్టేషన్‌లో తాత్కాలికంగా ఆగే వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ ఒక ప్రకటన విడుదల చేశారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే జైన భక్తులు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు పడకుండా నేరుగా, సురక్షితంగా ఆలయానికి చేరుకునేలా రైల్వే బోర్డు ఈ ప్రత్యేక నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: ఎస్‌ఐ పాడు పని.. తీగ లాగితే మొత్తం బాగోతమే బయటపడింది!

తాజా రైల్వే ప్రకటన ప్రకారం 2027 ఫిబ్రవరి 10 నుంచి 12వ తేదీ వరకు విశాఖపట్నం-హైదరాబాద్ (12727) గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు ఆలేరులో హాల్టింగ్ కల్పించారు. ఫిబ్రవరి 11 నుంచి 13వ తేదీ వరకు హైదరాబాద్-విశాఖపట్నం (12728) గోదావరి ఎక్స్‌ప్రెస్ ఆలేరులో ఆగుతుంది. ఫిబ్రవరి 10 నుంచి 12 వరకు తాంబారం-హైదరాబాద్ (12759) చార్మినార్ ఎక్స్‌ప్రెస్, ఫిబ్రవరి 11 నుంచి 13 వరకు హైదరాబాద్-తాంబారం (12760) చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లకు ఆలేరులో స్టాప్ ఇచ్చారు. వీటితో పాటు ఫిబ్రవరి 10వ తేదీన సికింద్రాబాద్-హిస్సార్ (22737) ఎక్స్‌ప్రెస్ రైలుకు కూడా ఆలేరులో ఆగే సదుపాయం కల్పించారు.

చారిత్రక కొలనుపాక ఉత్సవాలకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఏటా వేలాదిగా భక్తులు తరలివెళ్లడం ఎప్పటినుంచో వస్తున్న ఆనవాయితీ. ఈసారి 1400 ఏళ్ల ఉత్సవాలు కావడంతో భక్తుల రద్దీ రెట్టింపు అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. వరంగల్, కాజీపేట తదితర ప్రాంతాల నుంచి ఆలేరుకు వెళ్లే ప్రయాణికులు ఈ తాత్కాలిక రైల్వే హాల్టింగ్ సదుపాయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు. ప్రయాణికులు ఎలాంటి గందరగోళానికి గురికాకుండా పక్కా ప్రణాళికతో ముందుగానే తమ ప్రయాణ టికెట్లు బుక్ చేసుకుని సుఖవంతమైన దర్శనం చేసుకోవాలని వారు కోరారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 14 October 2026, 11:13 am Digital Edition : Prabhanews
Railways: రైల్వే శాఖ బిగ్ అనౌన్స్‌మెంట్.. పండగ చేసుకోనున్న భక్తులు! | బిజినెస్

Last Updated:Oct 14, 2026 10:07 AM ISTరైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. రైల్వే శాఖ తీసుకున్న ఈ సరికొత్త నిర్ణయం చూశారా? భారీ ఊరట.News18చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచే అతి ప్రాచీన పుణ్యక్షేత్రం మహోత్సవాలకు ముస్తాబవుతోంది. తెలంగాణ గడ్డపై దేదీప్యమానంగా వెలుగొందుతున్న ప్రసిద్ధ జైన మందిరం ఏకంగా 1400 ఏళ్ల వేడుకలకు సిద్ధమవుతున్న వేళ భక్తులకు అదిరిపోయే శుభవార్త అందింది. దేశవ్యాప్తంగా ఈ అపురూప ఘట్టాన్ని కనులారా వీక్షించేందుకు తరలివచ్చే వేలాది మంది సందర్శకుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్సవాలకు హాజరయ్యే ప్రయాణికుల కోసం ఆలేరు రైల్వే స్టేషన్‌లో పలు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు తాత్కాలిక హాల్టింగ్ సదుపాయం కల్పిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల పరిధిలోని కొలనుపాక జైన్ టెంపుల్‌కు దేశవ్యాప్తంగా ఎంతో విశిష్టమైన ఆధ్యాత్మిక చరిత్ర ఉంది. అత్యంత ప్రాచీన శ్వేతాంబర జైన పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం 1400 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా 2027 ఫిబ్రవరి 11 నుంచి 13వ తేదీ వరకు ఉత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ చారిత్రక వేడుకల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరాది రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు.ఇది కూడా చదవండి: అన్న వదిలేసిన భార్యతో తమ్ముడి కాపురం.. ఆ కోరిక ఎక్కడికి దారి తీసిందో తెలుసా? స్టోరీలో మరో ట్విస్ట్!ఈ అనూహ్యమైన రద్దీని ముందుగానే అంచనా వేసిన రైల్వే శాఖ ప్రయాణికుల కోసం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రధానంగా వరంగల్, కాజీపేట మార్గం మీదుగా ఆలేరు వైపు ప్రయాణించే కీలక రైళ్లకు ఆలేరు స్టేషన్‌లో తాత్కాలికంగా ఆగే వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ ఒక ప్రకటన విడుదల చేశారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే జైన భక్తులు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు పడకుండా నేరుగా, సురక్షితంగా ఆలయానికి చేరుకునేలా రైల్వే బోర్డు ఈ ప్రత్యేక నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.ఇది కూడా చదవండి: ఎస్‌ఐ పాడు పని.. తీగ లాగితే మొత్తం బాగోతమే బయటపడింది!తాజా రైల్వే ప్రకటన ప్రకారం 2027 ఫిబ్రవరి 10 నుంచి 12వ తేదీ వరకు విశాఖపట్నం-హైదరాబాద్ (12727) గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు ఆలేరులో హాల్టింగ్ కల్పించారు. ఫిబ్రవరి 11 నుంచి 13వ తేదీ వరకు హైదరాబాద్-విశాఖపట్నం (12728) గోదావరి ఎక్స్‌ప్రెస్ ఆలేరులో ఆగుతుంది. ఫిబ్రవరి 10 నుంచి 12 వరకు తాంబారం-హైదరాబాద్ (12759) చార్మినార్ ఎక్స్‌ప్రెస్, ఫిబ్రవరి 11 నుంచి 13 వరకు హైదరాబాద్-తాంబారం (12760) చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లకు ఆలేరులో స్టాప్ ఇచ్చారు. వీటితో పాటు ఫిబ్రవరి 10వ తేదీన సికింద్రాబాద్-హిస్సార్ (22737) ఎక్స్‌ప్రెస్ రైలుకు కూడా ఆలేరులో ఆగే సదుపాయం కల్పించారు.చారిత్రక కొలనుపాక ఉత్సవాలకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఏటా వేలాదిగా భక్తులు తరలివెళ్లడం ఎప్పటినుంచో వస్తున్న ఆనవాయితీ. ఈసారి 1400 ఏళ్ల ఉత్సవాలు కావడంతో భక్తుల రద్దీ రెట్టింపు అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. వరంగల్, కాజీపేట తదితర ప్రాంతాల నుంచి ఆలేరుకు వెళ్లే ప్రయాణికులు ఈ తాత్కాలిక రైల్వే హాల్టింగ్ సదుపాయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు. ప్రయాణికులు ఎలాంటి గందరగోళానికి గురికాకుండా పక్కా ప్రణాళికతో ముందుగానే తమ ప్రయాణ టికెట్లు బుక్ చేసుకుని సుఖవంతమైన దర్శనం చేసుకోవాలని వారు కోరారు.మరింత చదవండి

Source link