ఈ దోసె మేకర్లో ప్రీమియం నాన్‌స్టిక్ టెఫ్లాన్ కోటింగ్ ఉంది. దీనివల్ల పిండి ఉపరితలంపై సులభంగా పరుచుకోవడంతో పాటు దోసె అంటుకుపోవడం, పిండి అవశేషాలు పేరుకుపోవడం తగ్గుతాయి. దోసె ఉడికిన తర్వాత దాన్ని సులభంగా తీసుకోవచ్చు. వాడిన తర్వాత శుభ్రం చేయడం కూడా సులభంగా ఉంటుంది. ఈ మెషీన్‌తో నూనె వేయకుండా కూడా దోసెలు తయారు చేసుకోవచ్చని కంపెనీ ప్రచారం చేస్తోంది. తక్కువ నూనెతో లేదా నూనె లేకుండా దోసెలు చేసుకోవాలనుకునేవారికి ఈ ఫీచర్ నచ్చవచ్చు. లైఫ్‌లాంగ్ ఆటోమేటిక్ దోసె మేకర్ గోల్డెన్ బీజ్ రంగులో ఉంటుంది. దీని కొలతలు 26 × 47.4 × 32.5 సెంటీమీటర్లు. బరువు 4.5 కిలోలు. దోసెలు తయారు చేసే యూనిట్, పిండి కంటైనర్, ఆపరేటింగ్ కంట్రోల్స్ అన్నీ ఒకే మెషీన్లో ఉంటాయి. దీని ప్యాకేజీలో ప్రధాన మెషీన్, ట్యాంక్ సెపరేటర్, స్క్రబ్బర్, పిండి ట్యాంక్, పిండి సేకరించే ట్రే, ఆయిల్ క్యాన్, బ్లేడ్, దోసె తిప్పే పరికరం, రోలర్, యూజర్ మాన్యువల్‌తో కూడిన వారంటీ కార్డు ఉంటాయి. మెషీన్‌ను ఉపయోగించడానికి, నిర్వహించడానికి అవసరమైన ఈ పరికరాలను ప్యాకేజీలో అందిస్తారు. (image: Amazon India)

