ప్రభన్యూస్

SS Rajamouli: సెట్స్‌లో దర్శకధీరుడు.. ఇంట్లో మాత్రం ‘హోమ్ మినిస్టర్’ మాటే వినాల్సిందే! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

భారతీయ సినీ పరిశ్రమలో ఎస్.ఎస్. రాజమౌళికి ఉన్న ప్రత్యేక గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ప్రస్తుతం భారతీయ దర్శకుల్లో అత్యంత క్రేజ్ ఉన్న వారిలో ఒకరిగా నిలిచారు.

News18
News18

భారతీయ సినీ పరిశ్రమలో ఎస్.ఎస్. రాజమౌళికి ఉన్న ప్రత్యేక గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ప్రస్తుతం భారతీయ దర్శకుల్లో అత్యంత క్రేజ్ ఉన్న వారిలో ఒకరిగా నిలిచారు. భారీ సినిమాలను ఎంతో క్రమశిక్షణతో తెరకెక్కించే రాజమౌళి.. షూటింగ్ సెట్స్‌లో చాలా సీరియస్‌గా, కఠినంగా కనిపిస్తుంటారు. అయితే కెమెరాల ముందు ఎంత సీరియస్‌గా ఉన్నా.. వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా సరదాగా ఉంటారని చెప్పడానికి తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియో నిదర్శనంగా మారింది.

రాజమౌళి కుటుంబంలో భార్య రమా రాజమౌళి పాత్ర ఎంత కీలకమో తెలిసిందే. తాజాగా ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వీరిద్దరి మధ్య చోటుచేసుకున్న చిన్న సరదా సంఘటన సోషల్ మీడియాలో అభిమానులను ఆకట్టుకుంటోంది. బయట ప్రపంచానికి ‘దర్శకధీరుడు’గా కనిపించే రాజమౌళి.. ఇంట్లో మాత్రం భార్య మాట వినే సాధారణ భర్తేనంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

అసలేం జరిగిందంటే?

రాజమౌళి కుమారుడు కార్తికేయ నిర్మించిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ (Don’t Trouble The Trouble) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజమౌళి, ఎం.ఎం. కీరవాణి కుటుంబ సభ్యులతో పాటు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దీంతో ఈ వేడుక ఒక సినిమా ఈవెంట్ కంటే కుటుంబ వేడుకను తలపించేలా సందడిగా సాగింది.

ఈ కార్యక్రమంలో రాజమౌళిని వేదికపైకి ఆహ్వానించిన సమయంలోనే ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. రాజమౌళి వెనుకే నిలబడి ఉన్న రమా రాజమౌళి.. సరదాగా ఆయనను చేత్తో ముందుకు నెట్టారు. ‘త్వరగా స్టేజ్‌పైకి వెళ్లండి’ అన్నట్టుగా ఆమె చేసిన ఆ చిన్న సైగ అక్కడున్న వారిని నవ్వించింది. ఈ క్షణాన్ని అక్కడే ఉన్న కెమెరాలు కూడా క్యాప్చర్ చేయడంతో ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

‘ఇంట్లో బాస్ రమానే’ అంటూ కామెంట్లు:

ఈ వీడియో సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా భారీ సినిమాలను తెరకెక్కించే దర్శకుడు రాజమౌళి అయినప్పటికీ.. ఇంట్లో మాత్రం భార్య రమా రాజమౌళి మాట వినాల్సిందే అంటూ సరదా కామెంట్లు చేస్తున్నారు.

‘సెట్స్‌లో రాజమౌళి బాస్ కావచ్చు.. కానీ ఇంట్లో మాత్రం రమా గారే బాస్’ అంటూ కొందరు కామెంట్ చేస్తుండగా.. మరికొందరు ‘ప్రతి ఇంట్లో కనిపించే భార్యాభర్తల మధ్య సరదా సన్నివేశంలాగే ఇది ఉంది’ అంటూ పోస్టులు చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఈ చిన్న సంఘటనలోనే వారి మధ్య ఉన్న స్నేహం, ఆప్యాయత కనిపిస్తోందని చెబుతున్నారు.

రాజమౌళి, రమా రాజమౌళి చాలా కాలంగా కలిసి సినీ ప్రయాణం సాగిస్తున్నారు. రాజమౌళి సినిమాల వెనుక రమా రాజమౌళి కూడా కీలక పాత్ర పోషిస్తుంటారు. ముఖ్యంగా కాస్ట్యూమ్స్, కుటుంబం, వ్యక్తిగత విషయాల్లో ఆమె సహకారం గురించి రాజమౌళి పలు సందర్భాల్లో ప్రస్తావించారు.

అందుకే తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియో కూడా కేవలం ఒక సరదా క్షణంగానే కాకుండా.. ఈ దంపతుల మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని చూపించే అందమైన సందర్భంగా అభిమానులు భావిస్తున్నారు. ప్రపంచస్థాయి దర్శకుడిగా రాజమౌళికి ఎంత పేరు ఉన్నా.. కుటుంబం విషయంలో మాత్రం ఆయన కూడా అందరిలాగే సాధారణ భర్తేనని ఈ చిన్న వీడియో మరోసారి చూపించింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 30 September 2026, 11:19 pm Digital Edition : Prabhanews
SS Rajamouli: సెట్స్‌లో దర్శకధీరుడు.. ఇంట్లో మాత్రం ‘హోమ్ మినిస్టర్’ మాటే వినాల్సిందే! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 30, 2026 11:14 PM ISTభారతీయ సినీ పరిశ్రమలో ఎస్.ఎస్. రాజమౌళికి ఉన్న ప్రత్యేక గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ప్రస్తుతం భారతీయ దర్శకుల్లో అత్యంత క్రేజ్ ఉన్న వారిలో ఒకరిగా నిలిచారు. News18భారతీయ సినీ పరిశ్రమలో ఎస్.ఎస్. రాజమౌళికి ఉన్న ప్రత్యేక గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ప్రస్తుతం భారతీయ దర్శకుల్లో అత్యంత క్రేజ్ ఉన్న వారిలో ఒకరిగా నిలిచారు. భారీ సినిమాలను ఎంతో క్రమశిక్షణతో తెరకెక్కించే రాజమౌళి.. షూటింగ్ సెట్స్‌లో చాలా సీరియస్‌గా, కఠినంగా కనిపిస్తుంటారు. అయితే కెమెరాల ముందు ఎంత సీరియస్‌గా ఉన్నా.. వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా సరదాగా ఉంటారని చెప్పడానికి తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియో నిదర్శనంగా మారింది.రాజమౌళి కుటుంబంలో భార్య రమా రాజమౌళి పాత్ర ఎంత కీలకమో తెలిసిందే. తాజాగా ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వీరిద్దరి మధ్య చోటుచేసుకున్న చిన్న సరదా సంఘటన సోషల్ మీడియాలో అభిమానులను ఆకట్టుకుంటోంది. బయట ప్రపంచానికి ‘దర్శకధీరుడు’గా కనిపించే రాజమౌళి.. ఇంట్లో మాత్రం భార్య మాట వినే సాధారణ భర్తేనంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.అసలేం జరిగిందంటే?రాజమౌళి కుమారుడు కార్తికేయ నిర్మించిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ (Don't Trouble The Trouble) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజమౌళి, ఎం.ఎం. కీరవాణి కుటుంబ సభ్యులతో పాటు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దీంతో ఈ వేడుక ఒక సినిమా ఈవెంట్ కంటే కుటుంబ వేడుకను తలపించేలా సందడిగా సాగింది.ఈ కార్యక్రమంలో రాజమౌళిని వేదికపైకి ఆహ్వానించిన సమయంలోనే ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. రాజమౌళి వెనుకే నిలబడి ఉన్న రమా రాజమౌళి.. సరదాగా ఆయనను చేత్తో ముందుకు నెట్టారు. ‘త్వరగా స్టేజ్‌పైకి వెళ్లండి’ అన్నట్టుగా ఆమె చేసిన ఆ చిన్న సైగ అక్కడున్న వారిని నవ్వించింది. ఈ క్షణాన్ని అక్కడే ఉన్న కెమెరాలు కూడా క్యాప్చర్ చేయడంతో ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.‘ఇంట్లో బాస్ రమానే’ అంటూ కామెంట్లు:ఈ వీడియో సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా భారీ సినిమాలను తెరకెక్కించే దర్శకుడు రాజమౌళి అయినప్పటికీ.. ఇంట్లో మాత్రం భార్య రమా రాజమౌళి మాట వినాల్సిందే అంటూ సరదా కామెంట్లు చేస్తున్నారు.‘సెట్స్‌లో రాజమౌళి బాస్ కావచ్చు.. కానీ ఇంట్లో మాత్రం రమా గారే బాస్’ అంటూ కొందరు కామెంట్ చేస్తుండగా.. మరికొందరు ‘ప్రతి ఇంట్లో కనిపించే భార్యాభర్తల మధ్య సరదా సన్నివేశంలాగే ఇది ఉంది’ అంటూ పోస్టులు చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఈ చిన్న సంఘటనలోనే వారి మధ్య ఉన్న స్నేహం, ఆప్యాయత కనిపిస్తోందని చెబుతున్నారు.రాజమౌళి, రమా రాజమౌళి చాలా కాలంగా కలిసి సినీ ప్రయాణం సాగిస్తున్నారు. రాజమౌళి సినిమాల వెనుక రమా రాజమౌళి కూడా కీలక పాత్ర పోషిస్తుంటారు. ముఖ్యంగా కాస్ట్యూమ్స్, కుటుంబం, వ్యక్తిగత విషయాల్లో ఆమె సహకారం గురించి రాజమౌళి పలు సందర్భాల్లో ప్రస్తావించారు.అందుకే తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియో కూడా కేవలం ఒక సరదా క్షణంగానే కాకుండా.. ఈ దంపతుల మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని చూపించే అందమైన సందర్భంగా అభిమానులు భావిస్తున్నారు. ప్రపంచస్థాయి దర్శకుడిగా రాజమౌళికి ఎంత పేరు ఉన్నా.. కుటుంబం విషయంలో మాత్రం ఆయన కూడా అందరిలాగే సాధారణ భర్తేనని ఈ చిన్న వీడియో మరోసారి చూపించింది.మరింత చదవండి

Source link