తెలంగాణలో జులై 14 నుంచి 19 వరకూ, కోస్తాంధ్ర, యానాంలో జులై 15 నుంచి 19 వరకూ, రాయలసీమలో జులై 16 నుంచి 19 వరకూ అక్కడక్కడా తేలికపాటి జల్లులు పడతాయి అని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. జులై 15, 16, 17న కోస్తాంధ్ర, యానాంలో ఉరుములు, మెరుపులు, పిడుగులు పడతాయనీ, ఈదురు గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని IMD తెలిపింది. జులై 14 నుంచి 17 వరకూ.. కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో ఉపరితల గాలులు బలంగా వీస్తాయి అని IMD చెప్పింది.

