ప్రభన్యూస్

లూథరన్ చర్చి అభివృద్ధికి రూ.10,001 విరాళం

సూళ్లూరుపేట, ప్రభ న్యూస్ , సెప్టెంబర్ 25 :

సూళ్లూరుపేట మండలం సర్వారెడ్డి గ్రామానికి చెందిన డి. సుబ్రహ్మణ్యం తన స్వగ్రామంలోని లూథరన్‌ చర్చి అభివృద్ధి కార్యక్రమాలకు రూ.10,001 విరాళంగా అందజేశారు. చర్చి అభివృద్ధికి తనవంతు సహకారం అందించాలనే ఉద్దేశంతో ఈ మొత్తాన్ని కానుకగా సమర్పించినట్లు సుబ్రహ్మణ్యం తెలిపారు.
ఈ సందర్భంగా చర్చి ప్రతినిధులు, కమిటీ సభ్యులు సుబ్రహ్మణ్యానికి కృతజ్ఞతలు తెలిపారు. సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తనవంతు సహకారం అందించినందుకు పలువురు ఆయనను అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్‌ మండల అధ్యక్షుడు ఏ. బుజ్జయ్య, ఎల్‌సీసీ చైర్మన్‌ పి. ఏసప్‌, పీసీసీ సభ్యుడు పి. సురేష్‌తో పాటు చర్చి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 26 September 2026, 8:49 am Digital Edition : Prabhanews
<b>లూథరన్ చర్చి అభివృద్ధికి రూ.10,001 విరాళం</b>